14, ఆగస్టు 2014, గురువారం

ప్రేమకు స్వాతంత్ర్యం ఎప్పుడు?

కులమతాల అడ్డుగోడల మధ్య
 ప్రేమికులకు స్వేఛ్చ ఎక్కడ?

పేద ధనిక తేడాల మధ్య 
ప్రేమకు స్వాతంత్ర్యం ఎప్పుడు?

పెద్దలను కాదన్న ప్రేమికులకు 
జీవించే హక్కు ఎక్కడ ?

పెళ్లి చేసుకున్న జంటలకు 
సమానత్వపు హక్కు ఎప్పుడు ?





28, జూన్ 2014, శనివారం

నా మనసుకు ఎన్ని ఊహలు

ఆకాశానికి ఇన్ని రంగులు ఎవరు వేసారబ్బా... 
బహుషా నిన్ను చూసిందేమో 

గాలికి ఇన్ని పరిమళాలు ఏంటబ్బా ... 
నీ కురులు తాకిందేమో 

నది జలాలకు ఇన్ని రుచులు ఎలా వచ్చాయబ్బా...
 నీ పాదాలు స్పర్శిన్చినట్లుందే

నా మనసుకు ఎన్ని ఊహలు వస్తున్నయబ్బా ....
 నీ మనసులో చేరిందేమో 

24, జూన్ 2014, మంగళవారం

మన రెండు మనసులు పెనవేసుకున్నాయని....

రెండు పెదవులు కలిస్తే ... 
నీ పేరే పలుకుతాయి 

రెండు పాదాలు కదిలితే... 
నీ వైపే నడుస్తాయి 

రెండు కళ్ళు చూస్తే... 
నీ రూపంతో కనులు నిండుతాయి

రెండు రెప్పలు మూత పడితే... 
నీ ఉహలు కలలో మెదులుతాయి

మన రెండు మనసులు పెనవేసుకున్నాయని   
ఇవన్నీ చెప్పకనే చెబుతున్నాయి

15, జూన్ 2014, ఆదివారం

నీ మది చేరాలని....

సముద్రంలోని అలలకు ఎంత ఆత్రుతో నీ పదాలను స్పర్శించాలని....  
ఎగిరి పడుతున్నాయి 
సంధ్యా సమయ గాలికి ఎంత ఆశో నీ కురులను తాకాలని.... 
పరుగులు తీస్తోంది
చందమామకు ఎంత తొందరో నీ మోముపై మెరవాలని... 
భానుడు అస్తమించాకుండానే మిరుమిట్లు గొలుపుతున్నాడు 
మేఘానికి ఎంత ఇష్టమో నీ మేనుపై కురవాలని... 
తొలకరి చినుకులై వర్షిస్తోంది 
నా మదికి ఎంత ఉబలాటమో నీ చెంత చేరాలని... 
పక్కనే నడుస్తున్నా నీ నామ జపం చేస్తోంది