31, డిసెంబర్ 2013, మంగళవారం

ప్రేమ..హృదయం శుభాకాంక్షలు

చెట్టు ప్రేమ.. ఫలం
నది ప్రేమ.. జలం
ప్రకృతి ప్రేమ.. కాలం
నేల ప్రేమ.. మనం
మన ప్రేమ.. లోకం
కాలాలు ఎన్ని మారినా ..
యుగాలు ఎన్ని గడచినా..
ప్రేమైక లోకమే ఈ ప్రపంచ గమనం.

ఈ ప్రపంచంలో ఫలించిన ప్రేమలు చూపిన బాటను కొనసాగిస్తూ,
విఫలమైన ప్రేమల నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ... 

అమ్మపాలంత స్వచ్చత
కొత్త చిగురంత ఆర్థత
నూతన నీరంత గాఢత
వీచే గాలిలోని పారదర్శకతతో
2014 లో ప్రేమలు పరిమళించాలని కోరుకుంటూ
ప్రేమ..హృదయం చెబుతోంది నూతన సంవత్సర శుభాకాంక్షలు.


    heartly welcome to... 
       
          
      
                        
                 
                        
                              
                                      

30, డిసెంబర్ 2013, సోమవారం

పిరికి ప్రేమలు ఫలించవు

ప్రేమకు ధైర్యం చాలా అవసరం. 
అది లేని ప్రేమ విజయం సాధించడం చాలా కష్టం. 
రెండు పిరికి ప్రేమలతో ఎంత నష్టం జరిగిందో మీరే చదవండి. 


* ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్న పాలేనికి చెందిన 16 ఏళ్ళ బాలిక తన ప్రియుడిని కలవడానికి తోటలోకి వెళ్ళింది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా ముగ్గరు యువకులు వచ్చి బెదిరించారు. ఎదుర్కొనే ధైర్యం లేక  ప్రియుడు పారిపోయాడు. పాపం అమాయకురాలు వారికి ఒంటరిగా చిక్కింది.  సాముహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం  పెనుబల్లి పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

16 ఏళ్ల వయసులో ప్రేమించడం ఒక తప్పు ఐతే... కలుసుకున్నాక కష్టమైన, నష్టమైన ఇద్దరు కలిసి భరించక పోవడం రెండో తప్పు... బెదిరించే వారిని ధైర్యంగా ఎదిరించక పోవడం మూడో తప్పు... పెద్దలకు తెలిస్తే ఏమవుతుంది... కోప్పడతారు... మహా ఐతే కొడతారు... ఇలా జీవితమే నాశనం చేయరు కదా ?


* చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెద్ద దామరగుంట కు చెందినా చిట్టిబాబు,  ఎన్.లక్ష్మిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన మీనా ప్రేమించుకున్నారు. తిరుపతిలో ఉంటున్నారు. క్రిస్మస్ కు ఇంటికి వెళ్ళిన మీనా తిరిగి రాలేదు. ప్రేమ విషయం తెలిసి వారు మీనాను బంధించారు.  విషయం తెలుసుకున్న  చిట్టిబాబు తన స్నేహితుడు చిరంజీవిని తీసుకుని ఆ ఊరికి వెళ్లారు. అక్కడ నుంచి మీనాను తీసుకుని బైక్ పై ముగ్గురు బయలుదేరారు. మీనా బంధువులు వెంటపడ్డారు. వేగంగా వెళ్ళడంతో బైక్ కింద పడిపోయింది. దాని వదిలి పొలాల్లోకి పరుగు తీశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బావిలో పడిపోయారు. అక్కడ ఉన్న గ్రామస్థులు చిట్టిబాబు, చిరంజీవి లను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీనా పడిపోయిన విషయం వారు గుర్తించలేదు. వీరిద్దరూ అపస్మారక స్థితిలో మాట్లాడలేక పోయారు. సోమవారం ఉదయం మీనా శవమై బావిలో తేలింది. 

ప్రేమించు కుంటూనే పెద్దలెవరు ఒప్పుకోరు. వారిని మన ప్రేమ బలంతో ఒప్పించాలి... వీరు అలా  చేసే ప్రయత్నం చేయకపోవడం తొలి తప్పు... బైక్ మీద ముగ్గురు పోవడం రెండో తప్పు... పెద్దలను ఒప్పించే ధైర్యం చేయకుండా పారిపోవడం పెద్ద మూడో తప్పు.  వారికి మీ ప్రేమ అంత గొప్పదో చెప్పాలి... మహా ఐతే ఏం చేస్తారు? కొడతారు... తిడతారు... ప్రాణాలు తీయరు కదా?


ప్రేమ కోసం పరుగులు తీసిన ప్రేమికులు

ప్రేమించి పెద్దలు ఒప్పుకోలేదని వారిని ఎదిరించే ధైర్యం లేక, పెద్దలను ఒప్పించలేక, మనసును చంపుకొని ప్రేమలో ఓడిపోయి నిర్జీవంగా బతుకును సాగిస్తూ ఉంటారు కొందరు. 

ఒక ప్రేమ జంట మాత్రం అలా చేయలేదు. ప్రేమను జయించింది.. మనసును బతికించింది. ఎంతమంది వారి ప్రేమను ఓడించాలని ప్రయత్నించినా చివరికి ప్రేమే గెలిచింది. 

శ్రీకాకుళం పట్టణంలోని గూనేపాలెం మేదరవీదికి చెందిన ఎల్.నీలిమ,  టి.సంతోష్ లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడంతో 6నెలల క్రితం వీరిద్దరూ విజయవాడకు వెళ్లిపోయారు. నీలిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని వెతికి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. నీలిమ అంతటితో ఆగిపోకుండా ఆత్మహత్యాయత్ననికి ప్రయత్నించింది. నీలిమ కోలుకున్న తరువాత డిసెంబర్ 27 న శుక్రవారం తన ప్రియుడితో కలిసి విశాఖపట్నం వెళ్ళిపోయింది. నీలిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నీలిమ సంతోష్ లు అదే రోజు విశాఖలో వినాయక ఆలయంలో పెళ్ళిచేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు కాని వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. మళ్లీ వారిద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. పోలీసులు వారిని వెతికిపట్టుకొని మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరి ఇరువురి పెద్దలమద్య వాగ్వాదం జరిగింది. అయినా కూడా వీరు భయపడక మేము మేజర్లము మాకు ఇదివరకే పెళ్ళైపోయింది, ఇందులో ఎవరి బలవంతం లేదని ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని ధైర్యంగా చెప్పి అందరి సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్నారు. 




ప్రేమ ద్రోహి

ప్రేమంటే నమ్మకం... అనుమానం కాదు 
ప్రేమంటే భరోసా ... భయం కాదు 
ప్రేమంటే చావైనా, బతుకైనా కలిసి నడిచే మార్గం...
చంపేసే దుర్మార్గం కాదు. 

మనసున్న వాడని నమ్మింది. 
కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానంటే ప్రేమించింది. 
పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. 
పెళ్లి ఐన 17 రోజులకే మృత్యువై కబలిస్తాడని
ఊహించలేక పోయింది... అంజలి. 

తూ. గో. జిల్లా అమలాపురానికి చెందిన అంజలి హైదరాబాద్ లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. 
విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన జాన్ఆడంసన్  కాటేదాన్లో పనిచేస్తున్నాడు. 
ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి డిసెంబరు 11న పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు నుంచే అనుమానంతో అంజలిని వేధించడం మొదలు పెట్టాడు. 17రోజులకే జాన్ కపట మనసు బయటపడిoది. ఎందుకు ఇలా మారిపోయావని నిలదీసినందుకు అంజలిని గొంతు నులిమి చంపేశాడు. 
జాన్ మీద ఆమె పెంచుకున్న నమ్మకం  చనిపోయింది. 
అంజలితో పాటు ప్రేమ ప్రాణాలు విడిచింది. 

జాన్ లాంటి ప్రేమ ద్రోహిని ఏం  చేస్తే పాపం పోతుంది..?

29, డిసెంబర్ 2013, ఆదివారం

అందమైన మనసు

ప్రేమకు అందమైన మనిషి కావాలా?
అందమైన మనసు కావాలా?

మనిషి అందం అశాశ్వతం 
మనసు అందం శాశ్వతం

అందమైన మనసును ప్రేమిస్తే కలకాలం ఆనందం

అలాంటి అందమైన మనసులు ఒక్కటైతే... 
ఆ జీవితం స్వర్గం. 

ఆ స్వర్గంలో ఉన్నారు.... హైదరాబాద్ లో సిద్దూ, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పంచాయతీ కార్యదర్శి శేషకుమారి. 

శేషకుమారి తిరుపతి విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో సిద్దూ పరిచయమయ్యారు. భావాలు కలిసి మంచి స్నేహితులయ్యారు. మనసులు కలిసి ప్రేమికులయ్యారు. ప్రేమ పేరుతో చదువులు నిర్లక్ష్యం చేయలేదు. కెరీర్ పాడు చేసుకోలేదు. పెద్దలను ఇబ్బంది పెట్టలేదు. బాగా చదువుకున్నారు. ఉద్యోగాలతో స్థిరపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 
వారి ప్రేమకు కులాలు అడ్డురాలేదు. శేషకుమారి వైకల్యం అడ్డు నిలవలేదు. ఆమెను అతను అడగడుగునా ప్రోత్సహిస్తాడు. అతనికి ఆమె క్షణక్షణం ఉత్సాహాన్ని ఇస్తారు. ఒకరికి ఒకరుగా హాయిగా జీవితం సాగిస్తున్నారు. 

ప్రేమహృదయం వీరిని చూసి గర్వపడుతోంది. 

ప్రేమకు కుల మతాలు లేవు

ప్రేమకు కులము మతము అనే బేదం లేదు. 
సర్వమత సమ్మేళనం చేసే మార్గం ప్రేమ మాత్రమే. 
మానవాళిని ఒక్కటి చేసేది ప్రేమే.. 

అదే నిజం అని మరో సారి నిరూపించారు ఓ ప్రేమ జంట. 

ఎర్రపాలెం మండలం మామునూరుకు చెందిన ఎడ్డురి ప్రసన్న కుమార్, అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన నవ్య భిందు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. జమలాపురం ఆలయంలో శుక్రవారం పెళ్లి చేసుకొని మధిర మున్సిఫ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని రక్షణ కల్పించాలంటూ శనివారం పోలీసులను ఆశ్రయించారు. 

వీరి జీవితంలో ఎటువంటి మత బేదాలు లేకుండా సంతోషంగా సాగాలని ప్రేమ..హృదయం కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 


ప్రేమ ఫలించింది

వికసించని పుష్పం పరిమళమివ్వదు 
మాగని ఫలం రుచిని ఇవ్వదు 
పరిపక్వం సాధించని ప్రేమ అంతే మన్ననలు పొందదు. 

ప్రేమించి తొందర పడకుండా మైనారిటీ తీరేవరకు ఆగి, ఎవరి వలన ఇబ్బందులు కలుగకుండా ఆలోచించి ముందడుగు వేసి పెళ్లి చేసుకున్నారు. యువత ఈ విషయాన్ని గ్రహించాలి. 

రామచంద్రపురంపట్టణానికి చెందిన జక్కా దుర్గా ప్రసాద్ , మండపేటకు చెందిన గుత్తుల శ్రీదేవి గత నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు తల్లిదండ్రులు వీరి పెళ్ళికి అంగీకరించలేదు. అయితే వీరు మైనారిటీ తీరేవరకు ఆగి, మైనారిటి తీరగానే శనివారం ద్వారకా తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. శనివారం సాయంత్రం రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించమని కోరారు. 

వీరి ప్రేమైక జీవితం ఆనందంగా గడవాలని ప్రేమ..హృదయం కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది  





ప్రేమికులకు చాక్లెట్ ఇచ్చే ఆనందం

ప్రేయసి అలకను తీర్చడానికి, ప్రియుడి కోపం చల్లార్చేందుకు ఈ చాక్లెట్ ఎంతో సాయపడుతుంది. 

గుండెల్లో నిండుకొని ఉన్న ప్రేమను తెలపడానికి దారిచూపుతుంది. 

తటపటాయించే పెదవులనుండి తియ్యటి రాగం పలికిస్తుంది. 

చాక్లెట్ శృంగార ప్రేరితం అన్నది చారిత్రక సత్యం. నాటి అజ్ టెక్ రాజు మాంటేజుమా  రోజుకు 50 కప్పుల చాక్లెట్ తాగేవాడట. ప్రియురాలిని కలుసుకునేముందు మరీ ఎక్కువట. ఈ రాచపోకడే చివరకు వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి దారితీసింది. అయితే ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఫినైల్ ఇథైల్ ఎమీన్, శృంగార వాంచను పెంచే ట్రిప్టోఫాన్ కకోవాలోను ఉంటాయని తేలింది. రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా ఈ రెండు ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ విడుదలకు తోడ్పడతాయి.



ప్రేమకు కావాల్సింది మనసా.. వయసా ...?


రామ్ గోపాల్ వర్మ 'నిశ్శబ్ద్ ' సినిమాలా ఉంటుంది జాంగ్ ఫెంగ్ ప్రేమ కథ. 

ఎందుకంటే ఇరవై మూడేళ్ళ జాంగ్ అరవై ఎనిమిదేళ్ళ వెంచాంగ్లిన్ ను ప్రేమించింది. అంతేకాదు పెళ్ళంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని పట్టుపట్టింది. తల్లితోపాటు బందువులు కూడా ఈ పెళ్ళికి అంగీకరించలేదు. కాని మూడేళ్ళు పట్టువదలకుండా ప్రయత్నించి అందరిని ఒప్పించింది. పెళ్ళయిన ఏడాదికే కొడుకు పుట్టాడు. " మా నాన్న చావుబతుకుల్లో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే చాంగ్లిన్ ఎంతో సాయపడ్డాడు. అతడి మంచి మనసు నాకెంతో నచ్చింది. మా జంట చూడముచ్చటగా ఉండదనీ.. చూసేవాళ్ళకు మేము తాత మనవరాలులా కనిపిస్తామనీ తెలుసు. అయినా ప్రేమకు కావాల్సింది మనసుగానీ వయసు కాదు" అంటోంది జాంగ్. కొన్నేళ్ళకిందట బార్యను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న చంగ్లిన్ మాత్రం ఈ సరికొత్త ప్రేమకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడట. 


27, డిసెంబర్ 2013, శుక్రవారం

ప్రేమోదయం


తూరుపున సూర్యుడు వెలిగి  పోతున్నాడు... 
నా చెలి నుదుట సింధూరమై 
పచ్చికపై మంచు బిందువులు మెరిసి పోతున్నాయి... 
నా సఖి మందహాసమై 
గాలి నాట్యం చేస్తోంది... నా హృదయరాణి కురులై...
ముంగిట ముగ్గు మురిసి పోతోంది... నా ప్రియురాలి మోమై... 
పక్షులు కిలకిల రావాలవుతున్నాయి... 
నా ప్రేయసి కోసం కొట్టుకునే నా గుండె చప్పుల్లై...  

శుభోదయం 


బైక్ కలిపింది ఇద్దరిని

నరసింహుడు , జై చిరంజీవ, అశోక్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి ప్రేమ వివాహం చేసుకోనుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది. సమీరాకు బైక్ లంటే ఇష్టం. అక్షయకు  బైక్ లు తయారు చేసే సంస్థ ఉంది. ఓ సారి బైక్ కోసం అక్కడికి వెళ్ళిన సమీరాకు అక్షయ్ పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. డిసెంబర్ 14న వీరికి నిచ్చితార్థం అయియింది 2014లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ప్రేమ జంటకు ప్రేమ హృదయం శుభాకాంక్షలు చెబుతోంది. 

26, డిసెంబర్ 2013, గురువారం

ప్రేమంటే మధ్యాహ్నం నీడ

ప్రేమలో కోరిక ఉంటే.. 
ఉదయపు నీడలా మొదట్లో పెద్దగా ఉంటుంది... 
క్రమంగా తగ్గిపోతుంది. 
ప్రేమలో ఆరాధన ఉంటే... 
మధ్యాహ్నం నీడలా మొదట తక్కువగా ఉన్నా...
క్రమంగా విస్తరిస్తుంది. 
మన ప్రేమలో ఆరాధన ఉండాలి... అప్పుడే అది క్రమంగా పెరిగి... అవతలి వ్యక్తిని తాకుతుంది. 

ప్రేమంటే ఒకరికోసం ఒకరు బతకడం... చావడం కాదు

24, డిసెంబర్ 2013, మంగళవారం

ఉద్యమం అవ్వండి... ఉగ్రరూపం చూపండి

పెళ్లి చేసుకోమంటే కాల్చేస్తాడు ఒకడు.
పెళ్లి చేసుకోనంటే చంపేస్తాడు ఇంకొకడు.

ప్రేమించడం లేదని ప్రాణాలు తీస్తాడు ఒకడు.
ప్రేమించి మోసం ఎందుకు మోసం చేశావంటే  నరికేస్తాడు మరొకడు.

ప్రేమంటే ఇదా?
ప్రేమించడం అంటే ఇదా?

ఎంత కాలం ఇలా?
ఎన్ని ప్రాణాలు పోవాలా?

మహిళల్లారా ఇంకా సహనం ఎందుకు?
ఇంకా మౌనం ఎందుకు?
మృగాళ్ళపై గళ మెత్తoడి.
ఇలాంటి వారిని శిక్షించకుండా వదిలేస్తున్న వారిపై అపర కాళికలై కదం తొక్కండి. 
 ఉద్యమం అవ్వండి... ఉగ్రరూపం చూపండి.
నల్లగొండలో ప్రాణాలొదిలిన అరుణకు, తూర్పుగోదావరి జిల్లాలో తుది శ్వాస విడిచిన రేవతికి నివాళి అదే. 


  

22, డిసెంబర్ 2013, ఆదివారం

ఏకాంతం ఎంతపని చేసింది

ప్రేమించిన వారితో ఆనందంగా ప్రశాంత వాతవరనంలో 
విహరించాలని మనసు ఉరకలేస్తుంది.

మనసులోని భావాలను పంచుకోవాలని ఆరాటపడుతుంది. 

ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ గుండెచప్పుడు నీకోసమే 
అని చెప్పాలని ఆశపడుతుంది. 

మన హృదయం ఎవరితో జతగా ఉంటె ఆనందంగ ఉంటుందో అక్కడికే పరుగులు తీస్తుంది.

తప్పేం కాదు కాని ఎవరు సంచరించని నిర్జల ప్రదేశాలకు వెళ్లి ప్రమాదమలో పడకండి.  
ప్రేమ పొందలనుకొని ప్రాణం పోయేలా చిక్కుల్లో పడకండి. 

ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాన్ని గమనించక  వైద్య విద్య చదివే ఓ ప్రేమ జంట ఏకాంతం కోసం పోయి దుండగుల చేతిలో చిక్కి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. 

18వ తేది రాత్రి మంగళూర్ నగరంలో దేరళకట్టి మీటింగ్ పాయింట్ బార్ నుంచి బయటకు వచ్చి కారులో వెళ్లేందుకు సిద్దమవుతున్న మెడికో జంటను.. ఆయుదాలతో వచ్చిన దుండగులు బెదిరించి, అదే కార్ లో బందించి నిర్జన ప్రదేశంలోని  ఓ మారుమూల ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ వారిద్దరిని సెక్స్ లో పాల్గొనాల్సిందిగా బెదిరించారు. అందుకు నిరాకరిస్తే ఆ అమ్మాయిని రేప్ చేస్తామని బెదిరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ జంట సెక్స్ లో పాల్గొనగా.. ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. తమకు రూ.25 లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఆ దృశ్యాలను ఇంటర్నెట్ లో పెడతామని, వారి తల్లిదండ్రులకు, కాలేజ్ ప్రిన్సిపాల్ కు వీడియోలు పంపుతామని బెదిరించారు.
డిసెంబర్ 22 వ తేదిన ఈ విషయం బైటపడింది.

ప్రేమికుల్లార జాగ్రత్త.. మీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా జనసంచారం ఉన్నచోటునే ఎంచుకోండి. 



నీ ప్రేమ లో తడవనీ....

నేల నీరు లేక ఎండిపోయి, బీడుబారుతుంటే 
నింగి చూడలేక వర్షంతో నేలను తడుపుతుంది. 

చీకటి ప్రకృతిని కమ్మేసి భయపెడుతుంటే 
జాబిల్లి వెన్నెల వెలుగులు నింపుతుంది. 

నువ్వులేక ఒంటరినై , నీ తోడుకోసం ఎదురుచూస్తున్న నాపై                    నీ ప్రేమ జల్లులు కురిపిచావా....

21, డిసెంబర్ 2013, శనివారం

ప్రేమించినందుకు మరణ శిక్ష.

ప్రేమే ప్రాణం అనుకుంది.. 
ప్రియుడే జీవితం అనుకుంది.. 
ఆ ప్రేమే ప్రాణం తీసింది..  
ఆ ప్రియుడే ప్రాణం తీశాడు.

తన హృదయాన్ని పువ్వుగా చేసి ప్రియుడికి అర్పిస్తే,
ప్రియుడి తన గుండెను బండరాయి చేసుకొని ఆ రాయితో ఆమె గుండెపై కొట్టి చంపేశాడు. 

రామ చంద్రాపురం ఎస్ ఎస్ కాలనీకి చెందిన రేష్మా , దుర్గాప్రసాద్ లు ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోమని ప్రియుడిని అడిగింది రేష్మా. కొద్దిరోజులు ఆగుదమన్నాడు దుర్గాప్రసాద్. ఇద్దరిమద్య మాటామాట పెరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ రేష్మా బెదిరించడంతో ఆగ్రహించిన ప్రియుడు రాయితో ఆమె తలపై మోదాడు. తర్వాత నేలకు గట్టిగా కొట్టాడు. దీంతో రేష్మా అక్కడికక్కడే మృతి చెందింది. 

అమ్మాయిలు ఇటువంటి దుర్మార్గులతో జాగ్రత్త. 



మరో ప్రేమ కథ ముగిసింది

ప్రేమించి, పెళ్ళిచేసుకొని జీవితంలో స్థిరపడి ఆదర్శంగా నిలబడి ఉంటె నలుగురూమీగురించి గొప్పగా చేపుకునేవారు.
ప్రేమించి పెద్దల్లు ఒప్పుకోలేదని పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేసుకుంటే మీరు కళలు కన్న ప్రపంచం మీకు దక్కకుండా పోయింది. ఎవరిని సాధించాలని చనిపోయారు... బతికి సాధించాలి ఏదైనా. 
ఈ ప్రేమికులిద్దరూ చస్తే సాధిస్తాం అనుకొని ఓడిపోయారు.  

ఆదిలాబాద్ జిల్లా, జన్నారం మండలం లో ఇద్దరు ప్రేమికులు ప్రేమను బతికించుకోలేక ప్రాణాలను బలిచేశారు. రొండి రంజిత్, పడిగెల వనజ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి నిరాకరించారు. వనజకు ఆరు నెలల క్రితమే నిశ్చితార్థం చేశారు. మరో నెలలో వివాహం జరగనుంది. వీరి ప్రేమ పెళ్లి పెద్దలు ఒప్పుకోరని నిర్ణయం తీసుకొని పురుగులమందు తాగి జన్నారం మండలంలోని  ప్రైవేట్ పాఠశాల ఎదురుగా ప్రధాన రహదారిపై అపస్మారకస్థితిలో పడిపోయారు. చుట్టుపక్కల ఉన్న జనం గమనించి వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు.

ప్రేమించుకునేది కలసి బ్రతకడానికి... కలిసి చావడానికి కాదు. 


రైలు కింద ముక్కలైన ప్రేమ


తల్లిదండ్రుల్లారా 
ఇప్పుడు మీ కోపం చల్లారిందా?
మీ పంతాలు నేగ్గాయా ?
మీ పట్టింపులు తీరాయా?
అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ పిల్లలు 
రైలు పట్టాలపై ముక్కలైనా మీ తప్పు తెలిసిరాలేదా? 
బిడ్డలకు అడిగిందల్లా ఇచ్చే మీరు
 ప్రేమను ఎందుకు కాదంటున్నారు?
పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని మీరు 
వారిని చావుకు ఎందుకు పురికొల్పుతున్నారు? 
తునాతునకలైన ప్రేమికుల మృత దేహాలు 
అడుగుతున్నాయి సమాధానం చెప్పండి... 
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకట్రాజుల కండ్రిగకు చెందినా మోహన్ కృష్ణ , సత్యవేడుకు చెందిన చాతుర్య ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు కాదన్నారు. బతికితే కలిసి బతుకుదాం... లేకపోతే కలిసి చనిపోదాo అని నిర్ణ యించుకున్నారు. నెల్లూరు జిల్లా సూల్లురుపేట సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.  
ప్రేమికుల్లారా చావాల్సింది మీరు కాదు... పెద్దల్లోని ద్వేషం. 


20, డిసెంబర్ 2013, శుక్రవారం

మృత్యువును జయించిన ప్రేమ

ప్రేమంటే ప్రాణం ఇవ్వడమో, 
తీయడమో కాదు 
ప్రాణం పోయడం. 
ఈ ప్రేమ చరిత్ర చదివితే మీకే తెలుస్తుంది. 

గ్రీకు చారిత్రక పురుషుడు ఆర్ఫియెస్ సంగీతంలో దిట్ట, మంచి అందగాడు. ఈయన అతిలోక సుందరి ఐన యూరిదైస్ ను ఘాడంగా ప్రేమిస్తాడు. ఇద్దరు  పెళ్లి చేసుకుంటారు.  ఆనంద లోకంలో విహరిస్తుండగా  యూరిదైస్ ను పాము కాటేస్తుంది. అతని చేతుల్లోనే ప్రాణాలు విడుస్తుంది.  ఆర్ఫియెస్ తట్టుకోలేక పోతాడు. విలవిలలాడిపోతాడు. ఎలాగైనా తన ప్రియురాలిని బతికించుకోవాలని మృత్యు లోకానికి వెళ్తాడు. తన సంగీత కౌశలంతో దేవుళ్ళను మెప్పిస్తాడు. దేవుళ్ళు వరం కోరుకోమని అంటే... తన ప్రియురాలు   యూరిదైస్ ను బతికించాలని కోరతాడు. అతని ప్రేమకు మెచ్చుకున్న దేవుళ్ళు ఆమెను బతికిస్తారు. 

 ప్రేమలో నిజాయతీ ఉంటే మృత్యువునైనా  జయించవచ్చునని చాటాడు ఆర్ఫియెస్.  మరి మీరు...?


ఈ గాలికి ఇంత పరిమళం ఎక్కడిది?

ఆకాశంలో వెన్నెల... 
భూలోకంలో 
నా ప్రియురాలు... 
నవ్వారు... ఈ ప్రపంచానికి...  ఇంత చల్లదనం. 

మల్లె తీగను... 
నా ప్రేయసిని... 
తాకి వీస్తోందేమో... ఈ గాలికి..  ఇంత పరిమళం. 

దివిలో నక్షత్రాలను... 
భువిలో నా హృదయ దేవిని.. 
అల్లుకుంటుoదేమో... ఈ రాత్రి..   ఇంత హాయి.  
శుభరాత్రి  

19, డిసెంబర్ 2013, గురువారం

రెండు విఫల ప్రేమ కతలు


ప్రేమ తీసిన ప్రాణం 

కరీంనగర్ జిల్లా జ్యోతి నగర్ చెందిన

చక్రధర్ ఒక యువతిని ప్రేమించాడు.

యువతిని తీసుకొనివెళ్ళిపోయాడు. 

వారిబంధువులు ఇద్దరిని 

పట్టుకొచ్చి హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తర్వాత  చక్రధర్ తండ్రి చనిపోవడంతో సింగరేణి గనిలో ఉద్యోగం ఇచ్చారు. అక్కడ విధులకు వెళ్ళిన చక్రధర్ హత్యకు  గురయ్యాడు. యువతి బంధువులే ఈ పని చేసి ఉంటారని  చక్రధర్ తల్లి కేసు పెట్టారు.  చక్రధర్  కు నలుగురు పెళ్ళికాని చెల్లెళ్ళు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటని తల్లి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. 

వన్ సైడ్ లవ్ 
బెంగళూర్ కు చెందిన ఐటి ఉద్యోగిని పవిత్ర అనే యువతి అక్కడ నటుడు శ్రీ మురళిని ప్రేమించింది. మురళి ఫోన్ నంబర్ తెలుసుకుని రోజు సందేశం పంపేది. మురళి వాటికి స్పందించేవాడు కాదు. వన్ సైడ్ లవ్ చేసేది. మురళికి ఇదేవరకే పెళ్లి అయింది. బుధవారం మురళి ఇంటి వద్దకు వెళ్ళిన పవిత్ర తనను పెళ్ళిచేసుకోవాలని, లేక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వెంటనే మురళి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఆమెను తీసుకెళ్ళి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మనస్తాపం చెందిన పవిత్ర నిద్ర మాత్రలు మింగి మురళి ఇంటి వద్దకు వచ్చి పడిపోయింది. 





ప్రేమికులారా... బతికి సాధించండి

సమాజం సాగరం... 
జీవితం పడవ...  
ప్రేమ తెడ్డు..  

తెడ్డుతో పడవ నడుపుతూ సాగరం దాటాలి. 
ఇలా దాటేటప్పుడు సమాజమనే సాగరం పోటెత్తుతుంది. తుఫాన్ సృష్టిస్తుంది. పెద్ద పెద్ద అలలను మీదికి పంపుతుంది. భయపడిపోయి పడవను వదిలేస్తే  తెడ్డు ఉన్నా ప్రయోజనం ఉండదు. 
పెద్దలు మందలించారని, కాదన్నారని, తిరస్కరించారని జీవితాన్నే వదిలేస్తే ... ప్రేమ ఉండీ ఏం లాభం? 
అలలను, తుఫాన్లను ప్రేమ తెడ్డుతో దాటి...  జీవిత పడవను ఒడ్డుకు చేర్చినప్పుడే  ప్రేమకు, జీవితానికి సార్ధకత. 
ఇలా దాటలేని ఓ ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం చేసింది. 

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన సరిలాల్, కల్పన ప్రేమించుకున్నారు. పెద్దలకు విషయం తెలిసి మందలించారు. వారి ప్రేమకు నిరాకరించారు. దీంతో సరిలాల్ పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలిసి కల్పన నిద్ర మాత్రలు మింగింది. వెంటనే పెద్దలు తెలుసుకుని ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెల్లడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.  

ప్రేమికులారా... బతికి సాధించండి.
ప్రేమ ప్రాణం తీసి...
మీ ప్రాణాలను గాలిలో కలిపేయకండి. 

http://www.eenadu.net/district/images/spacer1.gif

18, డిసెంబర్ 2013, బుధవారం

ప్రేమ మంటల్లో రేవతి మనసు... శరీరం

ప్రేమ దీపం లాంటిది. 
కోరిక మంట  లాంటిది. 
యువతలోని శక్తి యుక్తులను దీపంలా మార్చి.. ప్రపంచానికి వెలుగునివ్వాల్సిన
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆ బాధ్యతను విస్మరించారు. 
వారిలోని ఆశలను కోరికలుగా మార్చి దహించడానికి  మీడియా, సినిమా, సమాజం
తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 
అందుకే నేటి సమాజంలో దీపాల్లేవ్... 
మంటలే కనిపిస్తున్నాయి. 

 తూర్పు గోదావరి జిల్లా పిటాపురంలో జరిగిన ఘటన ఇందుకు నిలువెత్తు  నిదర్శనం.  వేణుగోపాల స్వామి గుడి వీధికి చెందిన రేవతిని కత్తుల గూడెం కు చెందిన నవీన్ ప్రేమిస్తున్నానని వెంటపడే వాడు. నువ్వు లేక పోతే చచ్చిపోతానని బెదిరించేవాడు. రేవతి తండ్రి హెచ్చరించినా వెంటపడ్డం మానలేదు. దీంతో రేవతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిశ్చయించారు. తల్లిదండ్రులు పెళ్లి పన్నుల్లో ఉన్నారు.  దీన్ని భరించలేని నవీన్ రేవతి ఇంటికి వెళ్లి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి, పరారయ్యాడు. ప్రస్తుతం రేవతి కాకినాడ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.  ఆ అమ్మాయి తల్లిదండ్రుల కన్నీళ్ళు తుడవడం ఎవరితరం కావడం లేదు.

దారుణం... అరాచకం... అన్యాయం... ఘోరం... 
నవీన్ చేసిన ఘాతుకాన్ని చెప్పడానికి ఈ పదాలు ఏవి సరిపోవు... వీటన్నికంటే క్రూరమైన పదం తెలుగులో కనిపెట్టాలి. రేవతినే కాదు ప్రేమనూ తగలపెట్టిన నవీన్ ను శిక్షించాలి.  

నవీన్ ది   ప్రేమ కాదు... కోరిక. 
అందుకే వెలుగు ఇవ్వాల్సింది... దహించింది. 
ఇంటర్ తప్పిన నవీన్ ప్రేమ పేరుతో పెడుతున్న హింసను భరించలేక 
రేవతి పదో తరగతి మధ్యలో మానేసింది. 
నవీన్ పెట్టిన మంటల్లో మనసు, శరీరం కాలిపోయి ఏడుస్తోంది. 
కనీస వయస్సు లేని, జీవితమంటే అవగాహన లేని నవీన్ మనసు ఇంత కఠినంగా మారడానికి కారణం ఎవరని ఆలోచించాల్సి ఉంది. 
 ప్రేమంటే బతుకునివ్వాలి... చావును కాదని నేటి యువతకు 
పాఠాలు నేర్పాల్సిన అవసరాన్ని పెద్దలు,
ఉపాధ్యాయులు గుర్తించాల్సిన తరుణం ఇది. 






ప్రేమకైతే సరే... పెళ్లికైతే ఉరే... అనే వాళ్ళను ఏమిచేద్దాం?

ప్రేమించడానికి ఓకే... 
షికార్లు తిరగడానికి ఓకే... 
సినిమాలకు వెళ్ళడానికి ఓకే.. 
పార్కుల్లో జంటగా గడపడానికి ఓకే... 
పెళ్లి చేసుకోవడానికి మాత్రం నాట్   ఓకే... 
అమ్మాయిల్లారా జాగ్రత్త... ఇటువంటి వాళ్ళతో  జాగ్రత్త...
ఇలా  జాగ్రత్తగా ఉండకనే నల్గొండ జిల్లా కురంపల్లికి చెందిన అరుణ మోసపోయింది. 

దర్వేశిపురానికి  చెందిన సైదులును ప్రేమించింది. అన్నీ తనే అనుకుంది. చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగిన సైదులు ఆమెను మోసం చేశాడు. పెళ్లి   చేసుకోమని అడిగినందుకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు.  ప్రేమను వదులుకోలేక, ప్రాణం వదలలేక చావు బతుకుల మధ్య విలవిలలాడుతోంది. 

ఇలా నమ్మించి ద్రోహం చేసే ప్రేమ పిశాచాలను ఉరితీయాలని
 ప్రేమ హృదయం కోరుకుంటోంది. 
ఇలాంటి వారితో  జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలను హెచ్చరిస్తోంది. 


17, డిసెంబర్ 2013, మంగళవారం

ప్రేమ పేరుతో నయవంచన

కంచె చేను మేస్తే కాచేవారేవ్వారు....?
ప్రేమను ప్రేమే వంచిస్తే ప్రేమకు అర్థం ఏంటి....? 

నవమాసాలు మోసి, బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డ ప్రాణం తీయటం ఎంత ఘోరమో ప్రేమ పేరుతో ప్రేమించే వారిని మోసం చేయడం అంత దారుణం. 

ప్రేమించానని నమ్మబలికి ప్రియురాలిని 40 రోజులు నిర్బందించి లైంగిక వేదింపులకు గురిచేశాడు ఓ ప్రేమోన్మాది. 

మదనపల్లె, బంగారుపాళెం మండలం గోవర్ధనగిరికి చెందిన బాలిక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఆమె దూరపు బందువు దేవేంద్ర  ప్రేమించానని నమ్మబలికాడు. దేవేంద్ర స్నేహితులు మంజునధ్, మోహన్, రవి, వెంకటేష్, రేఖతో కలిసి బాలిక చదువుతున్న కళాశాలకు 40 రోజుల క్రితం వెళ్లాడు. కూల్డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్ళాడు. అక్కడ 40 రోజులు నిర్భందించి లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. కళాశాలకు వెళ్ళిన కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ చొరవతో ఎస్పీ ఆదేశాలమేరకు పోలీసులు విచారణ జరిపి కిడ్నాప్ నకు గురైన బాలికను విడిపించారు. దేవేంద్ర ఫై చర్య తీసుకోవాలని కిడ్నాప్ కు సహకరించిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.  


ప్రేమలో ప్రేమే ఉంటుంది... పైసాచికం కాదు

పాలు శ్రేష్టమైనవి. పాలను పాలతో కలిపితే చెడిపోవు.
పాలలో కొద్దిగా వ్యర్థమైనది పడితే మొత్తం పాలు విరిగిపోతాయి. 
ప్రేమా  అంతే  శ్రేష్టమైనది. అందులో కొద్దిగా చెడు ఉన్నా ఫలించదు. 

ప్రేమ కావాలనుకోవడం తప్పు కాదు. ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తినే వేధించడం తప్పు. 
ప్రేమ కోసం ఎంత కష్టపడినా తప్పులేదు.
ప్రేమను కష్టాలపాలు చేయడం తప్పు. 

హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ కి చెందిన ఎరాబోయిన కోటేశ్వర్ రావ్ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. తనకు తెలిసిన అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటూ వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరచి అసభ్య  సందేశాలు పంపి వేధిoచడమే  కాక తనను నిర్లక్ష్యం చేస్తే లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సైబరాబాద్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. 

ప్రేమించాలి, ప్రేమను చూపించాలి, ప్రేమను ప్రేమతోనే పొందాలి. 
ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది. పైసాచికం కాదు.

నీలిమతో పాటు ప్రేమ ప్రాణం పోయింది


మనసారా ప్రేమించింది. 
మనువారా ఒక్కటైoది.
ఎన్ని కలలు... ఎన్ని ఆశలు... 
ఎన్ని ఆశయాలు.. 
ప్రియుడితో ఏడడుగులు నడిచి...  వందేళ్ళ జీవితం ప్రారంభించింది. 
మూడు ముళ్ళ బంధం... రెండు రోజులకే ప్రాణం మీదికి వస్తుందనుకోలేదు. 
కలలు కల్లలయ్యాయి. ఆశలు అడిఆశలయ్యాయి. ఆశయాలు మసయ్యాయి. 
నూరేళ్ళ జీవితం... 48 గంటల్లో ముగుస్తుందని ఊహించలేదు....
 నెల్లూరుకు చెందిన నీలిమ. 

నీలిమ నెల్లూరు నగరంలోనే తనకంటే చిన్న వాడిన శ్రీనివాసులును ప్రేమించింది. ఇద్దరు శనివారం పెళ్లి చేసుకున్నారు.  పెద్దలు కాదనడంతో  శ్రీనివాసులు పిన్ని ఇంటికి వెళ్లారు. చిన్నవాడిని మాయ చేసి, మందు పెట్టి వలలో వేసుకున్నావని అందరూ సూటి పోటి మాటలు అన్నారు.  నిందించారు. ఈ అవమానం భరించలేక పోయింది. శ్రీనివాసులు వారి మాటలు విని నీలిమను దూరం పెట్టాడు. తట్టుకోలేక పోయింది. సోమవారం ఆత్మహత్య చేసుకుని  ప్రాణాలు విడిచింది.  శ్రీనివాసులు పరారయ్యాడు. ఇందూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రేమ విత్తనాలు నాటి... పెళ్లి పంట వేసిన నీలిమ... 
ఆ పంట పండకుండానే లోకం విడిచి వెళ్ళిపోయింది. 


ప్రేమ ఉంటే మార్గం ఉంటుంది

మనసుంటే మార్గం ఉంటుంది... 
ప్రేమ ఉంటే కలిసి బతికే జీవితం ఉంటుంది.

గుంటూరు జిల్లా మేల్లంపూడికి చెందిన శశికళ , గుంటూరు నగరం స్వర్ణ భారత్ నగర్ కు చెందిన క్రాంతి కుమార్ ప్రేమించుకున్నారు. కలిసి బతికి మార్గం చూసుకున్నారు.
మేజర్లు అయ్యేదాకా వేచి ఉండి...  పోలీసులను ఆశ్రయించి... తమ ప్రేమ ఎలాంటిదో వివరించి ...  పెద్దలను అక్కడికి పిలిపించి తాము కలిసి బాగా జీవిస్తామని వారికి భరోసా ఇవ్వగలిగారు. ప్రేమలో ఎంతో బలం ఉందని నిరూపించారు.

 ప్రేమికులారా... ప్రేమ హృదయం మీకు చెబుతోంది జోహార్... 


16, డిసెంబర్ 2013, సోమవారం

తనతో పాటు ... తన ప్రేమకు ఉరేసింది

యేరు దాటి తెప్ప తగిలేయడం 
ఎంత అన్యాయం...?
ఒట్టి పోయిందని గోమాతని కటికింటికి తోయడం
ఎంత పాపం..? 
నిన్ను ప్రేమించి...  నువ్వే జీవితం అనుకొని...  
తన బ్రతుకును నీకు అర్పించిన ప్రియురాలిని వేధించి, హింసించి
ప్రాణాలు తీయడం పై రెండింటికంటే ఘోరం. 

కూకట్ పల్లి ప్రాంతానికి చెందినా సునీత, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ ప్రేమించుకున్నారు. మూడు ఏళ్ళు కాపురం చేశారు. వారి ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఇంత జరిగాక అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించారు. భర్త మౌనం దాల్చాడు. ప్రాణంకంటే  ఎక్కువగా ప్రేమించి, జీవితం అర్పించిన సునీత దీనిని భరించలేక పోయింది. అన్నింటిలో అండగా ఉంటాడనుకున్న సాయికుమార్ తప్పుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ కేసు జడ్చర్ల పోలీసులు విచారిస్తున్నారు. 

తనతో పాటు ... తన ప్రేమనూ ఉరితాటికి వేలాడదీసింది.  


15, డిసెంబర్ 2013, ఆదివారం

ఆకాశానికి నిన్ను తాకాలని ఆశ





ఆకాశానికి నిన్ను తాకాలని ఆశ 
చినుకులై జారుతోంది

మేఘాలకు నువ్వు చూడాలని కోరిక 
ఉరుము, మెరుపులవుతోంది. 

గాలికి గాలే పోటీ  
నిన్ను తాకాలని పరుగులు తీస్తోంది. 

మట్టికి నిన్ను చేరాలని ఇష్టం 
పరిమళమై విస్తరిస్తోంది.  

నాకు నువ్వంటే ప్రాణం 
నీ గుండె చప్పుడై నా మనసు పల్లవిస్తోంది. 

ప్రేమను వదిలేస్తావా? ప్రాణం వదిలేస్తావా?

ప్రేమను వదిలేస్తావా? ప్రాణం వదిలేస్తావా? అంటే .. 
ప్రాణం వదిలేయడానికే  ప్రేమికులు ఇష్టపడతారు. 
ప్రేమ కావాలా? ప్రాణం కావాలా? అంటే ... 
ప్రేమే కావాలంటారు  ప్రేమికులు. 
కడప జిల్లా సిద్ధవటం మండలం కడపాయపల్లె కు చెందిన 
శారద ప్రేమనే కోరుకుని అమర ప్రేమికురాలైంది.  

 శారద సొంత ఊల్లొనే ఒక అబ్బాయిని ప్రేమించింది. పెద్దలు కాదని బలవంతంగా బంధువుల అబ్బాయి చంద్రబాబు నాయుడుతో పెళ్లి చేశారు. శారద అతనితో కాపురం చేయలేదు. ప్రియుడితో వెళ్లి పోయింది. వెతికి మరీ వారిద్దరిని పట్టుకొచ్చారు. ప్రియుడిని బెదిరించారు. శారదను ఇంటికి తీసుకుపోయారు. ఐనా  శారద వారి మాట వినలేదు. ప్రాణం పోయినా ప్రేమను వదులుకోలేనంది. తమ పరువు పోతుందని భావించిన భర్త  చంద్రబాబు నాయుడు, అన్న శ్రీనివాస నాయుడు కలిసి చంపేశారు. వీరిద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని కాపాడటానికి రాజకీయ నేతలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

వీరిని కఠినంగా  శిక్షించాలని ప్రేమ హృదయం కోరుకుంటోంది. 
మరి మీరూ .... 

ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం

ఆవు ఎదుటే దూడ గొంతు కోస్తే ఎంతగా ఏడుస్తుంది?
తల్లి కళ్ళ ముందే బిడ్డ ప్రాణాలు తీస్తే ఎంతగా రోధిస్తుంది?
ప్రియుడి కళ్ళ ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం చేస్తే...? 
ప్రియుడి గుండె ఎంతగా నలిగి పోయి ఉంటుంది. 

నెల్లూరు జిల్లా సూల్లూరుపేటలో అదే జరిగింది. 
రాజశేఖర్ అనే దుర్మార్గుడు పోలీసునని చెప్పి ప్రేమికులను బెదిరించాడు. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై  అత్యాచారం చేశాడు. ఈ ప్రేతాన్ని పోలీసులు పట్టుకున్నారు. 

ప్రేమికులారా పోలీసులంటే భయపడకండి. మీరు చేస్తున్నది  తప్పు కాదు....  ప్రేమ....   ధైర్యంగా ఉండండి.  
ఇటువంటి పరిస్థితుల్లో స్నేహితుల సహాయం తీసుకోండి.
పోలీసులకు ఫోన్ 100  చేయండి. 

రాజశేఖర్  లాంటి  భూతాలను కఠినంగా  శిక్షించాలని ప్రేమ హృదయం కోరుకుంటోంది. ప్రేమికులారా ? మరీ మీరు... ?

14, డిసెంబర్ 2013, శనివారం

ప్రేమ చాక్లెట్

మీ ప్రేమను విభిన్నంగా వ్యక్తం చేయాలనుకుంటే ... 
ఇలా ప్రయత్నిచండి. 
మార్కెట్లో కొత్తగా చాక్లెట్స్ వచ్చాయి. వీటిని మన కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తారు. మనం కోరుకున్న రూపంలో, కోరుకున్న అక్షరాలతో, కోరుకున్న చిత్రాలతో రూపొందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం... మీ మనసులోని మాటను 
తియ్యగా వ్యక్తం చేయండి. 

ఓటు నమోదు చేసుకోండి... ప్రజాస్వామ్యాన్ని ప్రేమించండి.

ప్రేమికుల్లారా ఓటు నమోదు చేసుకున్నారా? చేసుకోక పోతే ఇలా చేసుకోవచ్చు.
ఇక మూడు రోజులే గడువుంది. 17వ తేది చివరి రోజు.
ఇంకెందుకు ఆలస్యం... you tube  లో

Voting process made easy [English]

వీడియో చూసి ఓటు నమోదు చేసుకోండి. ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించండి. 
http://www.youtube.com/watch?v=85LwDjeXngY

ఇలాంటి మగాళ్ళతో జాగ్రత్త

ప్రేమించానంటే నమ్మింది. 
పెళ్లి చేసుకుంటానంటే 
కలిసి నడిచింది. 
సంసార సాగరంలో ఒక బిడ్డకు తల్లైంది. 
వ్యాపారం చేస్తానంటే మేడలో బంగారు అమ్మి డబ్బులిచ్చింది. 
పుట్టింటికి వెళ్లి రమ్మంటే పోయింది. 

ఇంకా భర్త వస్తాడని ఎదురుచూసింది... 
ఎంతకి రాకపోయేసరికి ... అతని ఇంటికి వెళ్ళింది.
 అతను తనను కాదని వేరే అమ్మాయితో వివాహానికి సిద్దపడుతున్నాడని
 తెలుసుకుని బాధ పడింది.  నిలదీసింది.
 రూ. 5 లక్షలు తీసుకొస్తే నీతో ఉంటా లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని 
అతను తెగేసి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించింది. 

కడప జిల్లా సంబెపల్లికి చెందిన మంజూరువలీ చేసిన ప్రేమ ద్రోహం ఇది. ఇతని మోసానికి బలైంది గుత్తికి చెందిన రమీజ. తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లిని చేసి ఎప్పుడు కాదు పొమ్మంటున్నాడని రమీజ  సంబెపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఇలాంటి మగాళ్ళతో జాగ్రత్త ... యువతుల్లారా... 


13, డిసెంబర్ 2013, శుక్రవారం

4 ఏళ్ల ప్రేమ + 13 ఏళ్ల వైవాహిక జీవితం = విడిపోయారు

ప్రేమించడం అంటే... 
ఆమె లక్ష్యాలను, అలవాట్లను, అభిరుచులను, 
కుటుంబాన్ని అతను ప్రేమించడం. 
అతని  లక్ష్యాలను, అలవాట్లను, అభిరుచులను, 
కుటుంబాన్ని ఆమె  ఇష్టపడటం. 
అలా కాకపోతే ఎంతటి ప్రేమికులైనా విడిపోవాల్సిందే. 

4 ఏళ్ళు ప్రేమిoచుకుని... పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ... 13 ఏళ్లుగా  వైవాహిక జీవితం గడిపిన ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ , సుజానే  ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు. ఇప్పుడు విడిపోయారు.

ఇలాంటి ఘటనలతో ప్రేమపై పెద్దలకు నమ్మకం లేకుండా పోతుంది.

జర్మనీ ప్రియురాలు... వైజాగ్ ప్రియుడు

కులాల గోడలను బద్దలు కొట్టే శక్తి ఎవరికి ఉంది ?
మతాల కంచెలు తుంచే బలం ఎవరికీ ఉంది ?
దేశాల సరిహద్దులు చెరిపే సామర్థ్యం ఎవరికి ఉంది ?
ఇంకెవరికి.... ప్రేమికులకే  

వైజాగ్ లోని మురళి నగర్కు చెందిన  
చక్రవర్తి, డెన్మార్క్ కు  చెందిన జగీత 
ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. 

ఈ ప్రేమ హృదయాలకు పెళ్లి శుభాకాంక్షలు. 

నీ ప్రేమకు నేనేమివ్వగలను....

నాతో పరిచయం కావాలన్నావు...
నన్ను ఇష్టపడ్డావు 

నాపైన ప్రేమ ఉందన్నావు... 
నన్ను ప్రాణంగా ప్రేమించావు

నిన్ను ఆరాధి స్తున్నానన్నావు...             
నన్ను దేవతలా పూజిస్తున్నావు 

నాతో జీవితం పంచుకోవాలన్నావు...                        
నన్నే నీ జీవితంగా మార్చుకున్నావు 

కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానన్నావు...                 
నీ గుండెలో పెట్టుకున్నావు 

నన్ను కష్టపెట్టకుండా కాపాడతానన్నావు...                      
కాని కష్టమంటే ఏంటో మర్చిపోయేలా చేశావు. 


నీ ప్రేమకు నేనేమివ్వగలను...                                                                 
               
                                నా జీవితం నీకంకితం

                                                   నీ ప్రేమకు దాసోహం                   

12, డిసెంబర్ 2013, గురువారం

ప్రేమికుడి కాటుకి ప్రియురాలి చెప్పు దెబ్బ

నీరైనా 100 డిగ్రీల సెల్సియస్ వరకే నీరులా ఉంటుంది. ఆ తరవాత ఒక్క డిగ్రీ సెల్సియస్ పెరిగినా ఆవిరైపోతోంది. 
ప్రేమ అంతే...  ఒక స్థాయి వరకే ప్రేమలా ఉంటుంది. ఆ హద్దు దాటితే అది ఆవిరి అవుతుంది. 
అదే నీటిని ఒక క్రమ పద్ధతిలో వేడి చేస్తే... 100 డిగ్రీల సెల్సియస్ దాటి  ఆవిరిగా మారి పెద్ద రైల్ ఇంజిన్నే నడుపుతుంది. 
ప్రేమ అంతే... పెళ్లి అనేది దానికి ఒక క్రమ పద్ధతి... తరవాత హద్దులు దాటితే సంసార నావను నడుపుతుంది. 
అలా కాకుండా పెళ్ళికి ముందే ఒక అమ్మాయి ... ప్రియుడిని నమ్మి హద్దులు దాటింది. ప్రియుడు మోసం చేస్తే కోర్టును ఆశ్రయించింది. 
ఖమ్మం జిల్లా నేలకొండ పల్లి మండలం చెర్వు మాదారానికి చెందిన ఓ అమ్మాయి అదే గ్రామానికి చెందిన కుక్కల రాజును ప్రేమించింది.  పెళ్లి చేసుకుంటానంటే నమ్మి సర్వస్వం అర్పించింది. మోసపోయింది. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే' తట్టుకోలేక పోయింది. న్యాయస్థానాన్ని  ఆశ్రయించింది. ఖమ్మం న్యాయస్థానం రాజుకు ఐపిసి 376 కింద ఏడేళ్ళ జైలు శిక్ష విధించారు. 

అమ్మాయి లు జాగ్రత్త... ఇటువంటి మోసగాళ్ళు ఉంటారు... ప్రేమించినా హద్దులు దాటకుండా ఉండండి. 


ప్రేమకు వేలాయరా....




ప్రేమ కోసం పరుగులు తీసే హృదయాలు ఎన్నో... 

ప్రేమను తెలుపడంలో తడబాటు ఎంతో... 

ప్రేమను అందరు కోరుకుంటారు కాని ప్రేమను కొందరే పొందుతారు. ఎందుకంటే ఆ ప్రేమను చెప్పడం తెలియక...
ప్రేమను వ్యక్తం చేయడంలో ఆలస్యం చేస్తే ప్రేమనే కోల్పోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మీకు రాకూడదు అనుకుంటే కింది సైట్లు ఉపయోగించి ప్రేమను చెప్పడానికి ప్రయత్నించండి.

www.jacquielawson.comనచ్చిన ఇ - కార్డుతో సందేశాన్ని క్షణాల్లో పంపొచ్చు. దానితో పాటు మీ పోటో జత చేసి పంపిచవచ్చు. దానితో పాటు సంగీతం, యానిమెషన్ జత చేసి పంపవచ్చు.
www.lakecards.comగలగల శబ్దాలతో సాగిపోతున్న సెలయేళ్ళు ,వెండి తుంపర్లల్లా రాలుతున్న సన్నటి మంచుతెరలు ఇలాంటి దృశ్యాలున్నో ఇందులో. ఈ ప్రత్యేకత జావ కార్డుతో లవర్సు మది గేల్చుకోవచ్చు.
www.freewebcards.com ఇందులో మనుసుకు హత్తుకునే కవితలు ఉంటాయి . వీటిని జత చేసి పంపవచ్చు
ఇలాంటి సైట్లు మరిన్ని
www.hallmark.com
www.americangreetings.com

11, డిసెంబర్ 2013, బుధవారం

ఫేస్ బుక్ ప్రేమ పాఠం


ఫేస్ బుక్ తెరిచింది  కాని ప్రేమ హృదయం చూడలేదు 

ప్రియుడి నోట్స్ రాసింది కాని మగాడి మనసు చదువలేకపోయింది 


ప్రేమ పాఠాలు వల్లే వేసింది కాని పెళ్లి పరీక్ష తప్పింది ఓ యువతి. 


లాలాగూడ ఠాణా పరిదిలోని ఆర్యానగర్ కాలానీకి చెందిన యువతి (26), వైజాగ్ కు చెందిన సందీప్ సిన్హా (29) ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. 2010 ఫేస్ బుక్ లో పరిచయం అయ్యారు. అది ప్రేమగా మారింది మూడేళ్ళుగా ప్రేమించుకున్నారు. ఒకరి ప్రాంతానికి ఒకరు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. తీరా పెళ్లి చేసుకొమ్మంటే కులాలు వేరంటూ పెళ్ళికి నిరాకరించాడు . దీంతో న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించింది.   




ప్రియమైన ప్రేయసి బొమ్మ



పాల నుండి జున్ను 

మల్లెల నుండి పరిమళం  


గులాభి   నుండి మృదుత్వం  


వెన్నెల వర్షం నుండి ప్రశాంతత 


సెలయేటి గల గల నుండి నవ్వులు  

సముద్రం వైశాల్యం నుండి హృదయం 


మంచు పర్వత అంచుల నుండి చల్లదనం 


వీటన్నింటిని తీసుకొని కలిపి ముద్ద చేసి బొమ్మను చేస్తే నా ప్రియురాలైంది. 



బైబిల్ మాట ప్రేమ బాట



ప్రేమిచడం అంటే    పార్కులకు, పబ్బులకు, షికార్లకు వెళ్లి సరదాలు తీర్చుకోవడం కాదు ప్రేమ బతుకునిస్తుంది. ప్రేమ కలిగి ఉండటం అంటే ఏంటి, ఎలా నడుచుకోవాలి అని బైబిల్ ( 1 కొరంధీ 1:7 ) నందు ప్రేమ యొక్క లక్షణాలను క్లుప్తంగా వివరించబడింది. 

1. ప్రేమ దీర్ఘకాలం (జీవితాంతం ) సహిస్తుంది. 
2. ప్రేమ దయ చూపుతుంది 
3. ప్రేమ మత్సర (అసూయ ) పడదు.
4. ప్రేమ డంబముగా (గర్వం ) ప్రవర్తించదు. 
5. ప్రేమ ఉప్పొంగదు (గొప్పలు చెప్పదు) 
6. ప్రేమ అమర్యాదగా నడువదు. 
7. ప్రేమ స్వప్రయోజనము (స్వార్థం ) విచారించుకొనదు.  
8. ప్రేమ త్వరగా కోపపడదు. 
9. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 
10. ప్రేమ సత్యము నందు సంతోషించును. 
11. ప్రేమ అన్నింటిని తాలుకొనును (భరించును). 
12. ప్రేమ అన్నింటిని నమ్మును. 
13. ప్రేమ అన్నింటిని నిరీక్షించును. 
14.  ప్రేమ అన్నింటిని ఓర్చుకొనును. 

10, డిసెంబర్ 2013, మంగళవారం

నా గుండె చప్పుడు నువ్వే



ఎడారిలో నీరు చూడలేము 

చీకటిలో నీడను వెదకలేము 

భీడు భూమిలో పంట వేయలేము 

నీటిలో చేప జాడను కనిపెట్టలేము 

మండుటెండలో వెన్నెలను కనలేము 

నువ్వు లేని క్షణం నా గుండె చప్పుడు వినలేము 





ఓ నెలవంక.... నీ వెనకే నేనింక

  
నిండు పున్నమి వెన్నెల్లో మిల మిల మెరిసే తారను చూస్తే ఏమనిపిస్తుంది....? 

ఎవరో గొప్ప వ్యక్తి  జన్మించి ఉంటారు అని సహజంగా అనుకుంటుంటారు. 

తార, నెలవంక చెంత చేరి మెరుస్తుంటే ఏమంటారో తెలుసా.....?  

నెలవంక, తారల కలయికను ప్రేమకు చిహ్నంగా ఆఫ్రికా దేశస్థులు భావిస్తారు. 

మీరు  ప్రేమించే వ్యక్తికి మీ ప్రేమను  తెలియజేయాలనుకుంటే నెలవంక తారలు కలిసి దగ్గరగా ఉన్నట్లు కనిపించే బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్, లాకెట్స్ ఇవ్వవచ్చు. ఇంకెందుకు ఆలస్యం...