30, నవంబర్ 2013, శనివారం

మనిషికి ప్రాణం ...మనసుకి ప్రేమ

 జింక బాగా అలసిపోయినప్పుడు వేగంగా పరుగేత్తలేదు .  అలసట తో  శక్తి సరిపోదు ఆగిపోతుందినీరు తాగితే రెట్టింపు బ లం పుంజుకొని అతివేగంగా దూసుకుపోతుంది. 

జీవన పరుగులో నిత్యం మనిషి  లసిపోతాడు. ఒత్తిడితో మనసు కృంగిపోతుంది. 
భరోసా , ధైర్యం, సాంత్వన ఇచ్చే "ప్రేమ" దొరికితే ... తిరిగి పురోగమిస్తాడు. 

ప్రేమ మనసునే  కాదు మనిషిని కూడా
లపర్తుంది. ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది.  ప్రేమలో ధైర్యం దొరుకుతుంది, ప్రేమలో ఓదార్పు కలుగుతుంది, ప్రేమ నమ్మకాన్ని నింపుతుంది, ప్రేమ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది, ప్రేమ ముందుకు నడిపిస్తుంది. 



"మనిషికి ప్రాణం ఎంత అవసరమో మనసుకి ప్రేమ అంతే అవసరం."  

నువ్వు లేక నేను లేను

పూల తోటలో పూసిన పువ్వులను చూస్తుంటే నా కన్నులకు ఆనందం కలుగలేదు... ఎందుకో...? 

సముద్ర తీరాన నడిచివేల్తుంటే అలలు నా పాదాలను తాకుతుంటే నా తనువు పులకించలేదు... ఎందుకో...? 

కోయిల పాటలు కిల కిల రావాలు వింటుంటే అవి నా గుండెను తాకలేదు... ఎందుకో...? 

పండు వెన్నెల్లో నిండు జాబిల్లిని చూస్తుంటే నా మది స్పందించలేదు... ఎందుకో...? 

ఆలోచించగా..  ఆలోచించగా తెలిసింది నువ్వు నా పక్కన లేవని.  
మనసుకు నచ్చిన వారిని ప్రత్యేకంగా పిలువాలనుకున్న్రారా ...

ప్రేయసీ ప్రియులు వివిధ ముద్దు పేర్లతో పిలుచుకోవడం సర్వసాధారణం, మన దేశంలో బంగారు, కన్నా, డార్లింగ్, స్వీట్ హార్ట్, లవ్లీ ఇలా పిలుచుకుంటారు. కాని ప్రపంచంలో వివిధ భాషల్లో ఎంతో అందమైన పేర్లతో ప్రేయసి ప్రియులు సంభోధించుకుంటున్నారు. మీరు అలా ప్రయత్నించండి.

దేశం                                         ముద్దు పేరు                               అర్థం 

Argerntina                                Muru                                        ముద్దులొలికే   

Spanish                                    Albondiga or frutita                   బుజ్జి పండు 

Tibetain                                    Nyingdu-la                               నా హృదయ సఖి 

London                                    Paapu bear                                చిన్న కుందేలు 

Odawa                                     Gdab                                         ప్రేమతో ఉండు 

Netherlands                              Poepie or schcetije                    అందమైన ప్రియుడు 

Russia                                      Pupsik                                       ప్రియ సఖా   

Eastern India                            Rossogolla or Mishti                  రసగుల్లా 

Turkish                                     Patlicanim                                  నా ప్రాణమా 

Denmark                                  Skat                                           సంపద 

Germany                                  Meain spatzle                             ప్రియతమా 
   

29, నవంబర్ 2013, శుక్రవారం

కొత్త జంట

ప్రేమకు హద్దులు ఉంటాయా?
ఉండవు ... ఉన్నా చెరిగిపోతాయి . 
ప్రేమికులకు కుల మతాలు ఉంటాయా?
ఉండఫు ... ఉన్నా వారిని అడ్డుకోలేవు. 

ఆదిలాబాద్ జిల్లా, కాసిపేట మండలం పెద్దనపల్లి కి చెందిన రమేష్, కర్నూలు కు చెందిన ఫౌసియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు వ్యతిరేకించినా ఒక్కటయ్యారు . హైదరాబాద్ లో ఉంటున్న వీరు సంతోషంగా జీవితం సాగించాలని కోరుకుందాం..

ప్రేమను ప్రేమించు

తేనె పట్టును  పిండితే తేనే  వస్తుంది 
దీపం వెలిగిస్తే వెలుగునిస్తుంది 
పూల చెట్టు పూలనే పూస్తుంది 

జాబిల్లి  వెన్నెలనే  కాస్తుంది 
ప్రేమ ఎప్పుడు ప్రేమనే యిస్తుంది  
ప్రేమను ప్రేమించు... ప్రేమతో జీవించు ... ప్రేమను ప్రేమతోనే జయించు 

నువ్వు పుట్టిందే నాకోసం


పువ్వులు ఎందుకు పుడతాయి...?
ఈ ప్రపంచంలోని సకల చరాచరాలను పరిమలిమ్పజేయడానికి .  

నదులెందుకు పుడతాయి....? 
పువ్వులెన్నిటికో ప్రాణం పోయడానికి.   

మేఘాలెందుకు వర్షిస్తాయి.....?
నదులన్నింటిని పరిగెత్తించడానికి. 

ఆకాశం అంత విశాలంగా ఎందుకు ఉంది....? 
వర్షించే మేఘాలను హత్తుకోవడానికి. 

నువ్వెందుకు పుట్టావో తెలుసా...? 
అంత గొప్ప, పెద్ద , విశాలమైన ఆకాశమంత మనసుతో నన్ను ప్రేమించడానికి. 

జాబిల్లికి చెల్లివా...

జాబిల్లికి చెల్లివా... 
మల్లెలకి అక్కవా... 
చేమంతికి చెలిమివా... 
చెండుమల్లికి తరువువా... 

మందారం నీ ఒంటి పేరా... 
మకరందం నీ యింటి పేరా... 
పూలవనం నీ ఊరా... 
పాల మీగడ నీ గురువా... 

చల్లని మంచు నీ తనువా... 
వసంతానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ వా...
ఎన్ని రోజులు ఇలా ప్రశ్నించుకున్నా సమాదానం దొరకడం లేదు. 

నువ్వు ఓ అద్భుతానివి ప్రియా..... 
  

28, నవంబర్ 2013, గురువారం

ఇదే మన ప్రేమాభివ్రుద్ధి


అబ్బాయిల ప్రేమ  సఫలమైతే 

                                                          మొన్న... 




                                                                 
                                                          నిన్న... 


                                                         నేడు... 







అబ్బాయిల ప్రేమ  విఫలమైతే





                                                                                   మొన్న..


 

                                                              నిన్న...



 
                                                                  నేడు


ఇదే మన ప్రేమాభివ్రుద్ధి 

నేనున్నది నీలోనే


సెలయేరు నదిని చేరుతుంది 
నది సముద్రాన్ని చేరుతుంది 
సముద్రం ఆవిరై నింగిని చేరుతుంది 
నింగి కరిగి నేల చేరుతుంది 
నా మది ఎక్కడున్నా నేరుగా నిన్నే చేరుతుంది 

ప్రేమను కొలవలేము

గాలి వైశాల్యం కొలవడం కష్టం 

నక్షేత్రాలను లెక్కించడం కష్టం 

విశ్వం విస్తీర్ణం గణించడం కష్టం 

నీ పైన నాకున్న ప్రేమ ఎంతో...
పరిశీలించడం అంతే కష్టం 

ప్రేమకోసం నీ హృదయం పరుగులు తీస్తుందా....? అయితే ఒక్క నిమిషం......

ఇదివరకటి కాలంలో ప్రేమించడం అంటే కొందరు ఎంతో పవిత్రంగా భావించేవారు, మరికొందరు నేరంగా పరిగణించేవారు. కాని ఇప్పటి కాలంలో పరిస్థితి ప్రేమించడం సహజం అనే స్థాయికి మారిపోయింది. 

ప్రేమంటే ఏంటో  తెలియకుండానే యువత ప్రేమకోసం పరుగులు తీస్తుంది. ప్రేమించకపోతే  స్నేహితులమధ్య  చిన్నతనంగా భావిస్తోంది.

ఒక్కసారి ప్రేమకోసం పరుగులు తీసిన పాదాలు ఏవైపు వాల్తాయో, ఏచోట ఆగుతాయో, చివరికి ఏమౌతాయో కూడా తెలియదు కాని ప్రేమ మాత్రం కావాలని కోరుకుంటున్నారు. 

ప్రేమించకముందు తెలియకపోయినా ప్రేమించాక కొన్ని ఊహించగలం.  వాటిని ఎదుర్కోనగల్గితే నీ అడుగు  ముందుకువెయ్యి . 

1. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం 

2. బెదిరింపులకు లొంగిపోవడం 

3. ఆర్థికపరిస్థితులకు తలోగ్గడం 

4. సమాజానికి భయపడడం 

5. బంధువులు వేలేస్తారని క్రుంగిపోవడం 

వీటిని ఎదుర్కోనే సామర్త్యం నీలో లేకపోతే టైం పాస్ కోసం ప్రేమించి ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు. 

వీటన్నిటిని జయించే శక్తి, ధైర్యం, మనోనిబ్బరం నీకుంటే ప్రేమ కోసం పరిగెత్తు, ప్రేమ కోసం తపించు, ప్రేమ కోసం జీవించు, ప్రేమను జయించు.      

27, నవంబర్ 2013, బుధవారం

ప్రేమే జీవితం 


ప్రేమించడం చాలా తేలిక
ప్రేమించబడడం చాలా కష్టం. 

ప్రేమను చెప్పడం చాలా తేలిక 
ప్రేమను పొందడం చాలా కష్టం. 

ప్రేమలో నిలవడం చాలా తేలిక
ప్రేమను నిలుపుకోవడం చాలా కష్టం. 

ప్రేమను తీసుకోవడం చాలా తేలిక 
ప్రేమను త్యాగం చేయడం చాలా కష్టం. 

ప్రేమ లేకుండా జీవితం లేదు 
ప్రేమ లేని జీవితం జీవితమే కాదు. 


ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు



ప్రేమ అనే పదం రెండే అక్షరాలూ కాని ప్రేమకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి,   
అందులో ఒకటి ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు. 

ప్రేమలో గౌరవం ఉంటుంది. 
గౌరమున్నచోట విలువ ఉంటుంది.
విలువున్నచోట ప్రాధాన్యం ఉంటుంది. 
ప్రాధాన్యం ఉన్నచోట అపోహలుండవు. 
అపోహలు లేనిచోట అమర్యాదకు చోటుండదు. 

ప్రేమించు....  ప్రేమను గౌరవించు....  
ప్రేమతో జీవించు.      

ఎటు చూసినా నువ్వే

మబ్బులను తొలగించుకొని దూసుకువస్తున్న రవి కిరణాలను చూశా .. 
నా మదిలోకి దూసుకువచ్చిన్న నీ చూపులా అనిపించింది. 

నిండు పండు వెన్నెలను చూశా .. 
నిర్మలమైన నీ మనసులా కనిపించింది.  

వికసించి పరిమళించే పువ్వును చూశా.. 
చక్కటి నీ నవ్వులా తోచింది. 

 గల గల పారేటి సెలయేరును చూశా..
కమ్మటి నీ మాటలా వినిపించింది. 

 వీచే చిరుగాలిని చూశా.. 
చల్లటి నీ స్పర్శలా తాకింది. 

అద్దంలో  నా రూపం చూశా.. 
నీలా  కనిపించింది.... అర్థమైంది నేను నువ్వైనని ...  

ప్రేమికుల్లారా జాగ్రత్త

ప్రేమికుల్లారా జాగ్రత్త 



ఒంటరిగా ఉన్న ప్రేమికులపై సైనికుల దాడి ... యువకుడిని తరిమివేసి , యువతిపై అత్యాచార యత్నం 

ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై  కానిస్టేబుల్ దాడి ... యువకుడిని తరిమివేసి , యువతిపై అత్యాచారం 

ఒక ఘటన హైదరాబాద్ లో జరగగా, మరొకటి ఒంగోలులో జరిగింది . 
ఈ రెండు ఘటనల నుంచి ప్రేమికులు నేర్చుకోవాల్సిన పాటాలు ఉన్నాయి . తీసుకోవాల్సిన  జాగ్రత్తలు ఉన్నాయి. 



1. నిర్జన ప్రేదేశాలకు వెళ్ళకుండా ఉండాలి . 

2. ఒకవేళ వెళితే ఫ్రిండ్స్ కు చెప్పాలి . ఎక్కడికి వెళుతున్నది ?   ఎప్పుడు వెళ్ళేది? తిరిగి వచ్చే సమయం తెలియజేయాలి . 

3. ఈ మధ్య కాలంలో వారిని ఫోన్ కాని, మెసేజ్ చేస్తుండ మనాలి . 

4. ఎవరు(పోలీసులు) వచ్చినా భయపడకూడదు.  ఎవరిని నమ్మకూడదు . 

5. విపత్కర పరిస్థితి  ఎదురైనప్పుడు  స్నేహితులకు ఫోన్ చేయాలి . 

6. ఒకరిని విడిచి, ఒకరు వెళ్ళకూడదు . 

7. ఏ సమస్య అయినా కలిసి ఎదుర్కోవాలి . 

8. అమ్మాయిలు ముఖ్యంగా  స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి . కారం పొడి, మిరియాల పొడి, చిన్న కత్తి దగ్గర ఉంచుకోవాలి . 

9. ప్రేమించు కోవడం తప్పుకాదు ... భయపడొద్దు. ఎవరైనా బెదిరిస్తే 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 

10. ఈ ఘటనలే కాదు చాలా చోట్ల రాత్రిపూట నే అఘాయిత్యాలు జరిగాయి . అందుకే ప్రేమికులారా రాత్రి పుట కలవక పోవడమే మంచిది. 



ప్రేమిస్తే బతకండి ... ప్రేమిస్తూ బతకండి... ప్రేమను బతికించండి.

పక్షులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటాయా?

జంతువులు ఎప్పుడైనా   ఆత్మహత్య చేసుకుంటాయా?

ప్రకృతిలో మరే జీవి ఐన  ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా విన్నామా?

మరి మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ?


ప్రాణంగా ప్రేమించుకోవడం అంటే ....

 ఇద్దరు కలిసి  ప్రాణాలు తీసుకోవడం కాదు ... 

జీవితాంతం ఒకరంటే ఒకరు ప్రాణంగా బతకడం. 

ప్రేమిస్తే బతకండి ... ప్రేమిస్తూ బతకండి... ప్రేమను బతికించండి. 



 ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊల్లపాలెమ్ లో ప్రేమ జంట  ఒకరిపై ఒకరు ప్రేమను చంపుకోలేక తమను తామే చంపుకోవాలని నిర్ణయించుకున్నారు. 

పురుగల మందు తాగారు.  
ప్రస్తుతం వారు ఒంగోలు రిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు.

 వీరు బతకాలని ... వీరి ప్రేమ బతకాలని కోరుకుందాం . 

26, నవంబర్ 2013, మంగళవారం

ఏ మివ్వగలను నీ ప్రేమకు.......?

 ఏమివ్వగలను నీ ప్రేమకు.......?


ఎడారిలాంటి నా జీవితంలో 

చినుకై తాకింది నీ చూపు...... 

చిరుజల్లై విరిసింది నీ పలుకు.....


వానల్లే కురిసింది నీ నవ్వు  .....

వరదల్లె పొంగింది నీ ప్రేమ .. 

సంద్రమై నిలిచింది నీ నీడలో నా జీవితం 


ఏ మివ్వగలను నీ ప్రేమకు....? 

నీ ప్రేమతో నిండిన ఈ జీవితం నీకంకితం.  

25, నవంబర్ 2013, సోమవారం

కాలకూట విషాన్ని అయినా అమృతం చేయగలిగేది ....  ప్రేమ 
ఎండిన మహా సముద్రన్నైనా నింపగలిగేది  ... ప్రేమ 
మోడువారిన కొమ్మలకు చిగురునద్ద గలిగేది ... ప్రేమ 

పచ్చని చెట్టునైనా  దహించేది... పగ 
మంచునైనా మండించ గలది ... ద్వేషం 
అంతులేని ఆకాశాన్ని అంతం చేయగలిగేది ... ఈర్శ 

ప్రేమ ఉంటే ఈ మూడు ఉండవు .... 
ఈ మూడు ఉంటే అది ప్రేమే కాదు. 

ఈ మూడు లేని ప్రేమ కాని... ప్రేతాన్ని కర్ణాటకలోని రాయచురులో చూడొచ్చు . 
తనను ప్రేమించలేదని ఓ అమాయకురాలికి విషం తాపి చంపాడో రాక్షసుడు 
వీడికి ఏ శిక్ష వేస్తే సరిపోతుంది?

"ప్రేమ ఒక ఔషదం"

            "ప్రేమ ఒక ఔషధం



ఒక మనిషిలో కలిగే బాధ, భయం, ఆవేదన, అసంతృప్తి, 
నిరాశ నిస్పృహ, ఒంటరితనం, బలహీనత ఇలాంటివి 
ఎన్నో మనిషిని క్రుంగదీస్తాయి. 


ఇలాంటి సమయంలో మనిషికి కావాలి ఒక ఔషధం ...... అదే ప్రేమ...    


             ఎలా......?

సంతోషం, సమాదానం, మంచితనం, ఓదార్పు, ధైర్యం, 
సహనం, నమ్మకం, భరోసా, తోడు, లం,  ఇలా 
వీటన్నిటిని  ఇచ్చేది ప్రేమ. 

ఈ ప్రేమ అనే ఔషధం వల్లే మనిషికి  అన్ని సమస్యలనుండి 
విడుదల దొరుకుతుంది. 


ఇలాంటి నిజమైన ప్రేమ నీలో ఉందా...?
ఉంటే నీవు ప్రేమించే వ్యక్తికి ఇవ్వు.
తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే.... ఆ తీపికి విషమైనా  అమృతమే అయిపోదా....
అని ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెప్పే ఈ పాట ప్రేమ హృదయుల కోసం  http://www.youtube.com/watch?v=cFnQRhjFS4s

ప్రేమ సందేశం

మట్టికి మబ్బు పంపే ప్రేమ సందేశం... చినుకు మబ్బు మట్టి కి తెలిపే సంకేతం ... మొలక 

చెట్టుకు ప్రకృతి  పంపే ప్రేమ సందేశం .... చిరుగాలి ప్రకృతికి చెట్టు తెలిపే సంకేతం ... కుసుమం 

నీకు నేను పంపే ప్రేమ సందేశం...నీ నామ స్మరణ చేసే నా గుండె చప్పుడు 




23, నవంబర్ 2013, శనివారం

ఓ .... ప్రియురాలా ప్రేమించు

బాధలో ఉంటే ఉపశమనం ప్రేమ... 
భయంగా ఉంటే  ధైర్యం ప్రేమ...  
నొప్పిగా ఉంటే  వైద్యం ప్రేమ ... 
నిరాశలో ఉంటే ప్రోత్సాహం ప్రేమ... 

 తల్లిలా లాలిస్తావా ?
 చెల్లిలా ఆత్మీయత పంచుతావా?
అక్కలా అనురాగం అందిస్తావా ?
స్నేహితురాలై నడుస్తావా ? 
ఓ .... ప్రియురాలా ప్రేమించు

తండ్రిలా భరిస్తావా ?
అన్నలా ఆదరిస్తావా ?
మిత్రుడవై అర్థం చేసుకుంటావా ?
ఓ... ప్రియుడా ప్రేమించు. 





20, నవంబర్ 2013, బుధవారం

ఆల్ టైం ప్రేమ హిట్ సాంగ్ చూసి ఆనందించండి.


http://www.youtube.com/watch?v=trdZVnPwPk8

ప్రేమికులకు మద్దతు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన నవీన్, కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన మంజుల ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వీరికి ప్రేమికుల తరపున శుభాకాంక్షలు చెబుదాం. మద్దతుగా నిలుద్దాం.


ప్రేమిస్తే అందమైన మనసులో చోటు దొరుకుతుంది.... ప్రేమించి మోసం చేస్తే జైలులో గది దొరుకుతుంది

ప్రేమిస్తే అందమైన మనసులో చోటు దొరుకుతుంది....
 ప్రేమించి మోసం చేస్తే జైలులో గది  దొరుకుతుంది...  



కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందినా వెంకటరమణకు కోర్టు ఇలాగే శిక్ష విదించింది. అదే ఊరికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా నన్నాడు. తరవాత మోసం చేశాడు. ఆ యువతి న్యాయ పోరాటం చేసింది. ప్రేమ ముసుగు వేసుకున్న మోసగాడికి బుద్ధి చెప్పింది.

మోసపోయ్ ఏడిస్తూ కూర్చుంటే మోసగాళ్లు మరికొంత మందిని ఏడిపిస్తారు...
ఈ అమ్మాయిలా పోరాటం చేస్తే ప్రేమ పిశాచాలకు  గుణపాటం అవుతుంది. 

19, నవంబర్ 2013, మంగళవారం

ఆకాశానికి నేలపై ప్రేమ.... 

చినుకులు వర్షిస్తుంది. 

నేలకు చెట్టు అంటే ప్రేమ .... 

పుట్టుకనిచ్చి పెరగనిస్తుంది. 

చెట్టుకు మనిషంటే ప్రేమ .... 

ఊపిరి ఇచ్చి బతుకునిస్తుంది. 

ప్రకృతి నిండా ప్రేమే .... మనిషికే దానిపై ప్రేమ లేదు. నిత్యం ద్వంసం చేస్తూ ఉంటాడు.... 

ప్రేమ ఇద్దరి వైపు నుంచి ఉన్నప్పుడే బతుకు పండుతుంది. 

అది మనిషీ మనిషీ మధ్యనైన...  మనిషీ ప్రకృతి మధ్యనైనా ... 

నీవులేక నేను లేను

నీవులేక నేను లేను



నీరు లేని నది
నీవు లేని మది


వెన్నెల లేని' పున్నమి
నిన్ను  నింపుకోని కన్నులు


వసి వాడిని పువ్వు
పెదవులపై  నువ్వు లేని నవ్వు

జనం లేని ప్రపంచం
మనం లేని ప్రేమ





16, నవంబర్ 2013, శనివారం

ప్రేమిస్తే బతకాలి. ప్రేమిస్తే బతుకునివ్వాలి.

ప్రేమిస్తే బతకాలి.  ప్రేమిస్తే బతుకునివ్వాలి.
ద్వేషం, స్వార్థం, కుట్ర... ఉంటే అది ప్రేమకాదు.
ప్రేమిస్తే ... ప్రేమే ఉంటుంది.
ప్రేమకోసం బతకండి ... ప్రేమిస్తూ బతకండి... ప్రేమను బతికించండి.
ఈనాడులో వచ్చిన ఈ కథనం చదవండి

15, నవంబర్ 2013, శుక్రవారం

ప్రేమించక పోతే చంపాలా?... ప్రేమించి కాదంటే ప్రాణం తీయాలా?


ప్రేమ అనేది చెట్టు లాంటిది... 

ఈ కొమ్మను ఆ కొమ్మ .... ఆ కొమ్మను ఈ కొమ్మ నరుక్కుంటూ పోతే చివరికి చెట్టు  ఉండదు .  

తరవాతి తరాలకు నీడ దొరకదు. 

ప్రేమికులు కొమ్మల్లాంటి వాళ్లు. ప్రేమించలేదని, ప్రేమించినా దక్కడం లేదని చంపుకుంటూ పోతే... ప్రేమ అనే చెట్టే లేకుండా పోతుంది. భవిష్యతు తరాలకు ప్రేమ లేకుండా పోతుంది.

 

ప్రేమించడం అంటే....మనం  ప్రేమించిన వారికి ఏ కష్టం రాకుండా చూడాలి. వారికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ గలగాలి. అంతేగాని చంపడం, చావడం పరిష్కారం కాదు. ఏమంటారు?

 

 

 

14, నవంబర్ 2013, గురువారం

ప్రేమికులకు దారేది

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలానికి చెందిన మాధవి, సిరువెల్ల  మండలానికి చెందిన శ్రీనివాసులు నంద్యాలలో డిగ్రీ చదువుకుంటూ ప్రెమించుకున్నరు. పెద్దలు ఒప్పుకోలేదని పెళ్లి చేసుకున్నారు. మేజరులైన వీరు పెళ్లి చేసుకోవడం అభినందనీయం.

అయితే.... ఈ వయసులో వీరు చదువు కోవాలి.  పెళ్లి వల్ల చదువు దెబ్బతింటుంది. జీవనానికి డబ్బు ఎలా... వీటిని అదిగమించగలరా... వీరు ఈ ఆటంకాలను దాటి హయీగా  జీవించడానికి మీ సలహాలు, సూచనలు చెప్పండి.  

13, నవంబర్ 2013, బుధవారం

ప్రేమ గణితం

ప్రేమ గణితం 

 ప్రియురాలి విరహం ... 

 ప్రియుడికి నరకం 

 ప్రియురాలి అలక.... 

ప్రియుడికి చురక 

 ప్రియురాలి కోపాగ్ని ... 

ప్రియుడికి బడభాగ్ని 

 ప్రియురాలి బాధ ....  ప్రియుడికి  తీరని వ్యధ 

ఆమె కళ్ల నుంచి  రాలే ప్రతి కన్నీటి బొట్టు ... 

అతనిపై కురిసే ఆసిడ్ వర్షం. 



ప్రేమికులారా ఆశీర్వదించండి

10, నవంబర్ 2013, ఆదివారం

మేం పైకి కనిపించేoత .... అమాయకులం కాదు ....

మేం పైకి కనిపించేoత .... అమాయకులం కాదు .... అని బైక్ ఫై రాసుకుని తిరుగుతున్న యువకులు నిజంగానే   అమాయకులు కాదు ....  దొంగలు.....  మిగతా వివరాలు 

6, నవంబర్ 2013, బుధవారం