3, ఏప్రిల్ 2014, గురువారం

ప్రేమ వయసు తెలుసా...?

ప్రేమ చాలా గొప్పది. ప్రేమను వర్ణించడం చాలా కష్టo. 
ప్రేమకు పవిత్రత, నమ్మకం, వివేచన చాలా అవసరం. 

జీవితాన్నిఅందుకోవడానికి పరుగులు తీయాల్సిన పాదాలు ప్రేమ వైపు అడుగులు వేస్తున్నాయి.
ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో ఎవరిని పడితే వారిని నమ్మి, మోసపోయి ప్రాణాలు తీసుకోవడం 
సరి కాదు. 
l,k,g చదవడం మొదలు పెట్టినప్పటినుండి వయసు ప్రకారమే చదువు ముందుకుపోతుంది.  
l,k,g చదివే పిల్లలు 10th ఎగ్జామ్స్ రాయలేరు. 
అలాగే ప్రేమకు కూడా ఒక వయసు, ఒక సమయం అవసరం. 
అది నిజమా కాదా అనే యోచించే వివేచన అవసరం. 

నల్గొండ జిల్లా, గుండ్రపల్లి గ్రామానికి చెందిన మాధవి(ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది) , సైదులు ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పరారిలో ఉన్నాడు.  

1, ఏప్రిల్ 2014, మంగళవారం

తప్పు ఎవరిది...?

అన్యాయo, అవినీతి, అక్రమాలు, మోసాలు రాజ్యమేలుతున్నాయి. 
ఘోరాలు నేరాలు నివాసాన్ని నిర్మించుకున్నాయి.  
అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయి. 
వీటన్నిటికన్నా నీచమైనదా ప్రేమ....?

ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనగానే వ్యతిరేకత...ఎందుకు? 
ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలపట్ల చెడు అభిప్రాయం... ఎందుకు?  
ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచిస్తే వారు కోరుకున్న జీవితం వాళ్లకు అందించిన వారు అవుతారు కదా.. 
కళ్ళ ముందు కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉండాల్సిన జీవితాలను మీ కోప తాపాలతో కడతేర్చారు. 
కోల్పోయిన ప్రాణాలను తిరిగి రప్పించగలరా...? 
వీరిరువురిని కలిపి నూరేళ్ళ జీవితాన్ని పండించగలరా...?   

హైదరాబాద్, మేడ్చల్ మండలం, చంద్రశేఖర్ అదే కాలనీకి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెద్దలు అంగీకరించకపోవడంతో 29.3.2014 న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. 31.3.2014 న గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్ పరిదిలో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్బాయి తల నుజ్జునుజ్జయింది. అమ్మాయి మృతదేహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయింది. 

చావడానికి అంత సాహసం చేయగలిగినవాళ్ళు కలసి బతకడానికి ధైర్యం చేయలేకపోయారా..? ఓ నిమిషం ఆలోచించి ఉంటే మీరు కోరుకున్న జీవితాన్ని అందుకునేవారు.