యువకుడికి ఒకటే వెన్నెల ప్రేమికుడికి ప్రియురాలి నవ్వుతో కలిపి రెండు వెన్నెలలు. యువకుడికి చల్లదనం కావాలంటే ఏసీ కావాలి ప్రేమికుడికి చెలి కురులను తాకిన గాలి చాలు. యువకుడికి తోడు లేకుంటే ఒంటరి ప్రేమికుడికి సఖి ఊహలు ఎప్పుడూ వెంట ఉంటాయి. యువకుడికి ఈ లోకం ఒక్కటే తెలుసు ప్రేమికుడికి ప్రియురాలి లోకం అదనం.