
ప్రేమకు పవిత్రత, నమ్మకం, వివేచన చాలా అవసరం.
జీవితాన్నిఅందుకోవడానికి పరుగులు తీయాల్సిన పాదాలు ప్రేమ వైపు అడుగులు వేస్తున్నాయి.
ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో ఎవరిని పడితే వారిని నమ్మి, మోసపోయి ప్రాణాలు తీసుకోవడం
సరి కాదు.
l,k,g చదవడం మొదలు పెట్టినప్పటినుండి వయసు ప్రకారమే చదువు ముందుకుపోతుంది.
l,k,g చదివే పిల్లలు 10th ఎగ్జామ్స్ రాయలేరు.
అలాగే ప్రేమకు కూడా ఒక వయసు, ఒక సమయం అవసరం.
అది నిజమా కాదా అనే యోచించే వివేచన అవసరం.
నల్గొండ జిల్లా, గుండ్రపల్లి గ్రామానికి చెందిన మాధవి(ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది) , సైదులు ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పరారిలో ఉన్నాడు.