
ఘోరాలు నేరాలు నివాసాన్ని నిర్మించుకున్నాయి.
అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయి.
వీటన్నిటికన్నా నీచమైనదా ప్రేమ....?
ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనగానే వ్యతిరేకత...ఎందుకు?
ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలపట్ల చెడు అభిప్రాయం... ఎందుకు?
ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచిస్తే వారు కోరుకున్న జీవితం వాళ్లకు అందించిన వారు అవుతారు కదా..
కళ్ళ ముందు కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉండాల్సిన జీవితాలను మీ కోప తాపాలతో కడతేర్చారు.
కోల్పోయిన ప్రాణాలను తిరిగి రప్పించగలరా...?
వీరిరువురిని కలిపి నూరేళ్ళ జీవితాన్ని పండించగలరా...?
హైదరాబాద్, మేడ్చల్ మండలం, చంద్రశేఖర్ అదే కాలనీకి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెద్దలు అంగీకరించకపోవడంతో 29.3.2014 న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. 31.3.2014 న గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్ పరిదిలో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్బాయి తల నుజ్జునుజ్జయింది. అమ్మాయి మృతదేహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయింది.
చావడానికి అంత సాహసం చేయగలిగినవాళ్ళు కలసి బతకడానికి ధైర్యం చేయలేకపోయారా..? ఓ నిమిషం ఆలోచించి ఉంటే మీరు కోరుకున్న జీవితాన్ని అందుకునేవారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి