4, జనవరి 2014, శనివారం

పెద్దల్లారా మీది ఏ కులం

మీరు తింటున్న బియ్యం మీ కులం రైతే పండిస్తున్నాడా....? 
మీరు తాగుతున్న నీటిని మీ కులం వాడే శుద్ధి చేసి పంపిస్తున్నాడా....? 
మీరు పీలుస్తున్న గాలి మీ కులం వాల్లదేనా....? 
మీరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, రక్తం అత్యవసరం అయినప్పుడు  
మీ కులం వాడా కాదా అని అడిగి తీసుకుంటారా....? 
వీటన్నింటికి కులం అడ్డురానప్పుడు మీ బిడ్డల ప్రేమకు, పెళ్ళికి కులం ఎందుకు అడ్డువస్తుంది...?  

హైదరాబాద్ లోని నిజాం పేట గ్రామ బండారు లేఅవుట్ లో ఉన్నటువంటి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్వాతి, కొండాపూర్ లో ఉంటున్నటువంటి యువకుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలకు విషయం తెలియజేశారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. స్వాతి మనోవేదన భరించలేక శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఇలా కులానికి పిల్లల్ని బలి చేయాలనుకుంటే పెద్దల్లారా మీకు కులమే ముక్యం అనుకుంటే ముందు మీరే చావాలి. 
ఎందుకంటే మీరు తినే బియ్యం, తాగే నీరు, పీల్చే గాలి, ఏ కులం వాళ్ళ దగ్గరనుండి వస్స్తుందో మీకే తెలియాలి... 

3, జనవరి 2014, శుక్రవారం

ప్రేమ పరీక్షలో సీత

ప్రేమిస్తున్నానంటే... నమ్మింది.
మనసిచ్చింది.
పెళ్లి చేసుకుంటానంటే...
సంబర పడింది.
మనువుకు సరేనంది.
ఏడడుగులు నడిచి... వందేళ్ళ జీవితం తనతో పంచుకోవలనుకుంది.
తొలి అడుగులోనే అనుమానం తనకు పరీక్ష పెట్టింది. 
నువ్వు నీ క్లాసుమేట్ తో క్లోజ్ గా ఉన్నావంటూ ప్రియుడు అనుమానించాడు. 
పెళ్లి చేసుకోవాలా వద్దా? అని ఆలోచిస్తున్నాడు. 
తను శీల పరీక్షకైనా సిద్ధమంటున్నా ఒప్పుకోవడం లేదు. 
మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరిగిన ఈ ఘటనలో ఈ అమ్మాయి రామాయణంలో సీతలా ప్రేమ అగ్ని పరీక్షకు సిద్దపడుతోంది. 

ఇంత అనుమానం ఉన్న వాడిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని సుఖపడుతుoదంటారా? 
పూర్తి వివరాలు చదవండి ... 
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20140104a_016101007&ileft=727&itop=196&zoomRatio=130&AN=20140104a_016101007

చచ్చి సాధించేది ఏమీ లేదు. బతికి ప్రేమ గెలవాలి

ఐ లవ్ యూ అన్న పదం గమనించర భాయి...
యూ లవ్ మీ అని  అర్థం అక్కడ లేదోయి....  
ఆర్య సినిమాలోని ఓ పాటలో చరణం... 
దీన్ని నేటి యువత తప్పక తెలుసుకోవాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. 

బెంగళూరుకు చెందిన లోకేష్ (22) ఓ అమ్మాయిని ప్రేమించాడు. నూతన సంవత్సరాది సందర్బంగా ఆమెకు గ్రీటింగ్ ఇవ్వబోయాడు. ఆమె తీసుకోలేదు. దీంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. 
ఇంత చిన్న విషయానికే చావడం ఎంత తప్పు?
నువ్వు నిజాయితీగా ప్రేమిస్తే 2015లో  గ్రీటింగ్ తీసుకొనే అవకాశం ఐన ఉండేది. ఇప్పుడు  ఇక లేదు. 
మనం ప్రేమించినంత మాత్రాన అవతలి వారు ప్రేమించాలని లేదు కదా?

యువతా ...చచ్చి సాధించేది  ఏమీ  లేదు. బతికి ప్రేమ గెలవాలి 

గుండెకు ప్రేమకు సంబంధం ఉందా....?

ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రకరకాల భావోద్వేగాలు శరీరంలో ఎలా ప్రతిఫలిస్తాయి అనే అంశం మీద పరిశోదనలు జరిపారు. 

ప్రేమలో పడితే నిజంగానే ఒళ్ళంతా ఏదో తియ్యని, సంతోషకరమైన భావ తరంగాలు వ్యాపిస్తాయట. 
ఒళ్ళంతా నులువేచ్చని ఆవిర్లు వచ్చినట్లు ఉండటం, ఏదో తెలియని ఆందోళన కలగటం, వీటికి తోడు గుండెల్లో చిన్న నొప్పి... ఇవన్ని ప్రేమ లక్షణాలేనంటున్నారు శాస్త్రవేత్తలు. 

ప్రేమలో పడినప్పుడు, ప్రేమించినవారిని చూసినప్పుడు గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. శ్వాస వేగవంతమవుతుంది. ముఖం కళకళలాడుతుంది. అదే చాలా విచారకరమైన విషయాలు విన్నప్పుడు కడుపులో గడబిడ మొదలవుతుందట. 

శారీరకరమైన ఈ మార్పులు మెదడులోని సంతోష భాగాలను ఉత్తేజితం చేసి ప్రేమలో ఉన్నప్పుడు అదనపు ఆనందం కలిగేలా ప్రేరేపిస్తాయట. 

2, జనవరి 2014, గురువారం

ప్రేమంటే శరీరం ఇవ్వోచ్చా?... అడగొచ్చా?

ప్రేమంటే మనసు ఇవ్వొచ్చు... 
ప్రేమంటే ప్రాణం ఇవ్వొచ్చు... 
ప్రేమంటే జీవితం ఇవ్వొచ్చు... 
ప్రేమంటే శరీరం ఇవ్వోచ్చా?... అడగొచ్చా?
ఇవ్వొచ్చు... అడగొచ్చు... పెళ్లి అనే మూడు ముళ్ళ బంధం తరవాత... 
ఇదే మన భారతీయ సంప్రదాయం. 

దీన్ని అతిక్రమిస్తే ఎన్నో కష్టాలు వస్తాయనే మన పెద్దలు అలా చెప్పారు. 
మగ్గాళ్ళ ముసుగు వేసుకున్న మృగాళ్ళు ఉంటారని హెచ్చరించారు. 
ఇది తెలియని ఇద్దరు అమాయకురాళ్ళు  మృగాళ్ళ నోటికి చిక్కారు. 


* గుంటూరు జిల్లా తాడేపల్లిలో 16 ఏళ్ల బాలిక ప్రేమిస్తానంటే మనసు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానంటే సర్వస్వం అర్పించింది. తీర పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు వెంకటేశ్వర రావు. తట్టుకోలేని బాలిక ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ బాలిక ఎప్పుడు రెండునెలల గర్భవతి. 

* మహారాష్ట్ర అంబర్ నాథ్ ఉల్లాస్ నగర్ లోని దోభిఘాట్ పరిసరాల్లో ఓ యువతిని అనిల్ రాజ్ బర్ ఇలాగే మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని నిలదీస్తే కత్తితో పొడిచాడు.   

అమ్మాయిలూ జాగ్రత్త... ప్రేమ పేరుతో శరీరం అడిగే వాళ్ళను నమ్మకండి. 







ప్రేమ మాట



జీవితంలో గొప్ప విషయం....?

ప్రేమించడం. 


అతి ఘనమైన విషయం.....?


ఎప్పటికి ప్రేమలో నిలిచి ఉండడం.  


ప్రేమ విఫలమై ఆగిన ఊపిరి

అమ్మాయి ప్రేమ దక్కలేదని ఆత్మహత్య చేసుకొని అమర ప్రేమికుడవయ్యావని అనుకుంటున్నావా.. 

అమ్మా నాన్నల ప్రేమను చంపేసి హంతకుడవయ్యావు. 27 ఏళ్ళు నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ కాలరాశావు. ప్రేమంటే జీవం పొయ్యాలి కాని ఊపిరి తీయకూడదు. నీ ఆత్మహత్యతో నీతో పాటు మీ తల్లిదండ్రులు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు. 

నీకు ఇది న్యాయమా...?

కరీంనగర్ జిల్లా లోని గోదావరి ఖని తిలక్ నగర్ కు చెందిన ఉదయకుమార్ పద్మశాలి వసతి గృహంలో ఉంటూ చింతకుంట లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎం.బి.ఎ  చదువుతున్నాడు. జనవరి 1తేదిన తన ప్రేమ విఫలం అయ్యిందని మానసికంగా క్రుంగిపోయి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తన ప్రేమ విఫలమైనదని...అందుకే చనిపోతున్నానని ఫేసుబుక్ లో రాశాడు.