4, జనవరి 2014, శనివారం

పెద్దల్లారా మీది ఏ కులం

మీరు తింటున్న బియ్యం మీ కులం రైతే పండిస్తున్నాడా....? 
మీరు తాగుతున్న నీటిని మీ కులం వాడే శుద్ధి చేసి పంపిస్తున్నాడా....? 
మీరు పీలుస్తున్న గాలి మీ కులం వాల్లదేనా....? 
మీరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, రక్తం అత్యవసరం అయినప్పుడు  
మీ కులం వాడా కాదా అని అడిగి తీసుకుంటారా....? 
వీటన్నింటికి కులం అడ్డురానప్పుడు మీ బిడ్డల ప్రేమకు, పెళ్ళికి కులం ఎందుకు అడ్డువస్తుంది...?  

హైదరాబాద్ లోని నిజాం పేట గ్రామ బండారు లేఅవుట్ లో ఉన్నటువంటి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్వాతి, కొండాపూర్ లో ఉంటున్నటువంటి యువకుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలకు విషయం తెలియజేశారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. స్వాతి మనోవేదన భరించలేక శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఇలా కులానికి పిల్లల్ని బలి చేయాలనుకుంటే పెద్దల్లారా మీకు కులమే ముక్యం అనుకుంటే ముందు మీరే చావాలి. 
ఎందుకంటే మీరు తినే బియ్యం, తాగే నీరు, పీల్చే గాలి, ఏ కులం వాళ్ళ దగ్గరనుండి వస్స్తుందో మీకే తెలియాలి... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి