3, జనవరి 2014, శుక్రవారం

గుండెకు ప్రేమకు సంబంధం ఉందా....?

ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రకరకాల భావోద్వేగాలు శరీరంలో ఎలా ప్రతిఫలిస్తాయి అనే అంశం మీద పరిశోదనలు జరిపారు. 

ప్రేమలో పడితే నిజంగానే ఒళ్ళంతా ఏదో తియ్యని, సంతోషకరమైన భావ తరంగాలు వ్యాపిస్తాయట. 
ఒళ్ళంతా నులువేచ్చని ఆవిర్లు వచ్చినట్లు ఉండటం, ఏదో తెలియని ఆందోళన కలగటం, వీటికి తోడు గుండెల్లో చిన్న నొప్పి... ఇవన్ని ప్రేమ లక్షణాలేనంటున్నారు శాస్త్రవేత్తలు. 

ప్రేమలో పడినప్పుడు, ప్రేమించినవారిని చూసినప్పుడు గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. శ్వాస వేగవంతమవుతుంది. ముఖం కళకళలాడుతుంది. అదే చాలా విచారకరమైన విషయాలు విన్నప్పుడు కడుపులో గడబిడ మొదలవుతుందట. 

శారీరకరమైన ఈ మార్పులు మెదడులోని సంతోష భాగాలను ఉత్తేజితం చేసి ప్రేమలో ఉన్నప్పుడు అదనపు ఆనందం కలిగేలా ప్రేరేపిస్తాయట. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి