9, జనవరి 2014, గురువారం

ప్రేమకు న్యాయం జరుగుతుందా..

మంచి డ్రెస్ కనిపిస్తే కొని వాడి పక్కన పడేస్తాం.  
అందమైన వస్తువు కనిపిస్తే కొని ఉపయోగించి  కొత్త మోడల్ రాగానే వేరేది కొంటాం.  

ఈ కాలంలో ప్రేమ కూడా అలాగే మారిపోయింది. ఎంజాయ్ చేసేవరకు ఉండి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనుషులకు వస్తువులకు తేడా లేనంతగా ప్రవర్తిస్తున్నారు ఈ సమాజం. ఇలాంటి మరమనుషులకు ఇద్దరు బలయ్యారు. 

ఆదిలాబాద్ జిల్లా, వేమనపల్లి చెన్నూరు మండలం, గంగారాం గ్రామానికి చెందిన ఏదళ్ళ రజిత, నీల్వాయి గ్రామానికి చెందిన శ్రీశైలం ప్రేమించుకున్నారు పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారు. పెద్దలచేత ముగుర్తాలు కూడా పెట్టించారు. శ్రీశైలం వరసకు బావ కావడంతో తనని పూర్తిగా నమ్మి పెళ్ళికి ముందే తనువును అర్పించుకుంది. అలా మూడు నెలలు  కలసి ఉన్నారు. పెళ్లి సమయం దగ్గర పడే సమయంలో పెళ్ళికి నిరాకరించాడు శ్రీశైలం. రజిత తనను పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ఇంటి ముందు 15 రోజులనుండి మౌనపోరాటం చేస్తుంది. చావైన బతుకైన తనతోనే తేల్చుకుంటానని దీక్ష పట్టింది. శ్రీశైలo  తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడని తనకి న్యాయం చేయాలనీ అతనితో పెళ్లి జరిపించాలని కోరుతుంది. 

ఖమ్మం జిల్లా, ఇల్లెందు గ్రామీణం మండలంలోని నాయకుల గూడేనికి చెందిన కిన్నెర వసంత, కుమ్మరి బస్తీకి చెందిన సింగవరపు నవీన్ కుమార్ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వసంతని పెళ్ళిచేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరకు తీసుకున్నాడు. పెళ్లి  చేసుకోమంటే నిరాకరించాడు. తనకు న్యాయం జరగాలంటూ ప్రియుడి ఇంటిముందు పోరాటానికి దిగింది. 

రజిత, వసంత చేసిన పోరాటాన్ని చూసి గర్వపడాలి. అందరి అమ్మాయిల్లా ప్రేమలో ఓడిపోయి పిరికి దానిలా ఆత్మహత్య చేసుకోకుండా మోసం చేసిన వాదిపైకి ఉద్యమించడం గొప్ప విషయం. వారికి న్యాయం జరగాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది. 

యువతకు ఓ చిన్న మాట... ప్రేమించండి తప్పులేదు కాని ప్రేమ పేరుతో తనువులు దగ్గర చేసుకొని తలదించుకునే పనులు చేసుకోవద్దు. 

8, జనవరి 2014, బుధవారం

ఓ ప్రియురాలి ఉద్యమం

ప్రేమించాడనుకుంది... 
మోసం చేస్తాడనుకోలేదు. 
పెళ్లి చేసుకున్నాడునుకుంది... ద్రోహం చేస్తాడనుకోలేదు. 
నూరేళ్ళు తోడుంటాడనుకుంది... వంచన చేస్తాడనుకోలేదు.
మోసాన్ని ఎదుర్కోడానికి... 
ద్రోహాన్ని నిలదీయడానికి... వంచనను ప్రశ్నించడానికి... 
ఓ ప్రియురాలు నడుం బిగించింది. 
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన విజయలక్ష్మి చాగలమర్రికి చెందిన పెద్దబాబును ప్రేమించింది.    ఇరువురు కర్నూలు లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. మూడేళ్ళ క్రితం పెద్దబాబు ఎవరికీ తెలియకుండా విజయలక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కాదు పొమ్మంటున్నాడు. దీంతో చాగలమర్రిలోని పెద్దబాబు ఇంటి వద్ద విజయలక్ష్మి ధర్నాకు దిగారు. 
ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ ఐన  పెద్దబాబు కు పోలీసులు సహకరిస్తున్నారు. తోటి మహిళలు విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఏ ప్రియురాలికి ఇలాంటి కష్టం రాకుడదంటే మనమంతా విజయలక్ష్మికి బాసటగా నిలవాలి. ప్రేమహృదయం విజయలక్ష్మి వైపే ఉంది... మరి మీరూ... ?


ప్రేమనే చంపేశాడు ఓ ప్రేమోన్మాది

కొమ్మకు మొగ్గ తొడిగితే పువ్వుగా మారేవరకు ఎదురుచూడాలి 
భూమిలో విత్తనం వేస్తే మొలకేత్తేవరకు ఎదురుచూడాలి 
చెట్టుకు పూత వస్తే కాయగా మారేవరకు ఎదురుచూడాలి  
ప్రేమిస్తే ప్రేమను పొందేవరకు ఎదురుచూడాలి.. 

ప్రేమించి ప్రేమను పొందేవరకు ఎదురుచూడలేక ప్రేమనే చంపేశాడు ఓ ప్రేమోన్మాది. 

మహారాష్ట్ర , ముంబాయి చెంబూరుకు చెందిన గణేష్ సూర్యవంశీ , షాహీన్ ఖాన్ అనే అమ్మాయి ప్రేమించుకున్నారు పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారు. కొంతకాలంగా గణేష్ తమ పెళ్లి విషయం షాహీన్ తో ప్రస్తావిస్తే తను ఏమి చెప్పకుండా దాటవేస్తూ వచ్చింది. తను పెళ్లి చేసుకోదేమో అని మనస్తాపానికి గురయ్యేవాడు.  పెళ్లి విషయంలో గణేష్ చాలాసార్లు గొడవ కూడా పడేవాడు. షాహీన్ మీద అనుమానం వచ్చిo డిది. ఆమెపైన కక్ష పెంచుకున్నాడు. జనవరి 6 వ తేదిన నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై చర్చిస్తుండగా మాట మాట పెరగడంతో గణేష్ దగ్గర వున్న కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.   

7, జనవరి 2014, మంగళవారం

ప్రేమ మాట

సింహా సినిమాలో 
బాలకృష్ణ చెప్పిన డైలాగ్.... 

అందమైన అమ్మాయిలను వెంటపడండి, 

టీస్ చేయండి వాళ్ళు ఎంజాయ్ చేసేవరకు..  

కామెంట్ చేయండి వాళ్ళు హర్ట్ అవనంతవరకు..  

లవ్ చేయండి వాళ్ళు ఓకే అంటే ప్రాణాలిచ్చైనా దక్కించుకోండి..

ప్రేమించనంటే యాసిడ్ పోయడమేoటిరా......

యువత జీవితాన్ని సరదాగా గడపాలనుకుంటారు తప్పులేదు కాని అందులో మంచి చెడును గ్రహిస్తే ఏ పొరపాట్లు జరగవు.  

6, జనవరి 2014, సోమవారం

ప్రేమ పుట్టింది... ఎలా నమ్ముతారు...?

మల్లెపువ్వు పూసింది... 
మల్లె చెట్టునుండి పూసింది అని నమ్ముతాము. 
మామిడి పండు కాసింది... 
మామిడి చెట్టు నుండి కాసింది అని నమ్ముతాము. 
జాబిల్లి కనబడుతుంది... 
రాత్రి అయిందని నమ్ముతాము.
ఎండలు మండుతున్నాయి... 
సూర్యుడి నుండి అని నమ్ముతాము.   
ప్రేమ పుట్టింది... ఎలా  నమ్ముతారు...? 

ప్రేమ నమ్మకం నుండి పుడుతుంది. 
ఒక వ్యక్తిని చూసి, వారిలోని నడవడిక, పద్దతులు, ఆలోచనలు, అభిరుచులు...... నచ్చి వారిపైన నమ్మకం ఏర్పడుతుంది. 
ఆ నమ్మకం ప్రేమగా పరిపక్వం చెందుతుంది.  
నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేనిచోటే నమ్మకం ఉండదు.

ప్రేమించిన అమ్మాయిపైన నమ్మకం లేక ప్రియురాలి ప్రాణం తీశాడు ఓ ప్రేమికుడు. అది ప్రేమేనంటారా...? 

హైదరాబాద్, హయ్యత్ నగర్ లో ఈ సంగటన జరిగింది. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, గంజుగాపూర్ గ్రామానికి చెందిన షబానా బేగం రామ్ కోఠి లో ఉంటున్నారు. కాచిగూడలో నివాసముంటున్న మహమ్మద్ హుస్సేన్ ఇరువురు ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. షబానా కొంత కాలంగా ఇమ్రాన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉందని ఆమెపై అనుమానం పెంచుకొని ఆమెను చంపాలని నిర్ణయించుకొని తన చిన్నాన్న కుమారుడు రఫిక్ సహాయంతో శికారుకని బైటికి తీసుకెళ్ళి ఆమెను పొదలలోకి తీసుకెళ్ళి కత్తితో, స్క్రూడ్రైవర్ తో పొడిచి విచక్షణారహితంగా బండరాయితో మోది చంపాడు. 

గుండెలనిండా అనుమానం నింపుకొని కసాయితానంగా ప్రవర్తించడం ప్రేమ లక్షణం కాదు. 
ప్రేమిస్తే నమ్మండి..  నమ్మకం లేకపోతే ప్రేమించద్దు.   

5, జనవరి 2014, ఆదివారం

జీవితాలను మొగ్గలోనే తుంచేయకండి

డ్రెస్ ఏది కొందాం...? 
అబ్బాయికి ఇష్టం వచ్చింది తీసుకోనీలే. 

నగలు ఏం కొందాం...? 
అమ్మాయికి నచ్చింది తీసుకోనీలే. 

టి.వి ఏది కొందాం...? 
అబ్బాయికి నచ్చిన మోడల్ తీసుకోనీలే. 

ఏ కోర్స్ చదివిద్దాం...? 
అమ్మాయికి ఇష్టం వచ్చింది చాడువుకోనీలే. 

తల్లిదండ్రులారా పిల్లలకు నచ్చిందే చేయాలని అన్నింటిలో ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమ విషయంలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు...? 
మీ చేజేతులార పిల్లలను ఎందుకు చంపుతున్నారు...?  

న్యూ డిల్లీ , మోదీనగర్ సౌదాగావ్ లో ఉండే ఓ యువకుడు, ఓయువతి ప్రేమించుకున్నారు. కలసి బ్రతకలనుకున్నారు. వీరి ప్రేమను తల్లిదండ్రులకు చెప్పారు కాని పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. కలసి బ్రతకకపోయినా కలసి చావలనుకున్నరేమో జనవరి 4 వ తేదిన పురుగులమందు తాగి కలసి ప్రాణాలు విడిచారు. 

పెద్దలారా పిల్లల ప్రేమను మూర్ఖంగా తిరస్కరించి , వారి జీవితాలను మొగ్గలోనే తుంచేయకండి.  

ప్రేమతో కలిసి పెళ్లితో ఒక్కటయ్యారు

చినుకేప్పుడైన నేలలో కలవాలి..   

నది ఎప్పుడైనా 
సాగరంలో కలవాలి..  

అమ్మాయి అబ్బాయి ప్రేమలోనే కలవాలి..    

అలాగే ఓ ప్రేమ జంట... ప్రేమతో కలిసి పెళ్లితో  ఒక్కటయ్యారు. 

కడప జిల్లా, రాజంపేట మండలం పుల్లంపేటకు చెందిన ఫన్నీష్ కుమార్, ఓబులవారి మండలం ముక్కవారిపల్లెకు చెందిన అమ్మాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి ఇంట్లో విషయం తెలిసిన పెద్దలు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిర్ణయించారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. వీరిరువురు తిరుపతి ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుకొని రాజంపెతలోని మున్నూరు పోలీస్ స్టేషన్ కు చేరి ఇరు కుటుంబాలనుండి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. 

వీరు పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమైక జీవితాన్ని చూసి పెద్దలు మెచ్చుకునేల బతకాలని ఆశిస్తూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.