6, జనవరి 2014, సోమవారం

ప్రేమ పుట్టింది... ఎలా నమ్ముతారు...?

మల్లెపువ్వు పూసింది... 
మల్లె చెట్టునుండి పూసింది అని నమ్ముతాము. 
మామిడి పండు కాసింది... 
మామిడి చెట్టు నుండి కాసింది అని నమ్ముతాము. 
జాబిల్లి కనబడుతుంది... 
రాత్రి అయిందని నమ్ముతాము.
ఎండలు మండుతున్నాయి... 
సూర్యుడి నుండి అని నమ్ముతాము.   
ప్రేమ పుట్టింది... ఎలా  నమ్ముతారు...? 

ప్రేమ నమ్మకం నుండి పుడుతుంది. 
ఒక వ్యక్తిని చూసి, వారిలోని నడవడిక, పద్దతులు, ఆలోచనలు, అభిరుచులు...... నచ్చి వారిపైన నమ్మకం ఏర్పడుతుంది. 
ఆ నమ్మకం ప్రేమగా పరిపక్వం చెందుతుంది.  
నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేనిచోటే నమ్మకం ఉండదు.

ప్రేమించిన అమ్మాయిపైన నమ్మకం లేక ప్రియురాలి ప్రాణం తీశాడు ఓ ప్రేమికుడు. అది ప్రేమేనంటారా...? 

హైదరాబాద్, హయ్యత్ నగర్ లో ఈ సంగటన జరిగింది. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, గంజుగాపూర్ గ్రామానికి చెందిన షబానా బేగం రామ్ కోఠి లో ఉంటున్నారు. కాచిగూడలో నివాసముంటున్న మహమ్మద్ హుస్సేన్ ఇరువురు ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. షబానా కొంత కాలంగా ఇమ్రాన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉందని ఆమెపై అనుమానం పెంచుకొని ఆమెను చంపాలని నిర్ణయించుకొని తన చిన్నాన్న కుమారుడు రఫిక్ సహాయంతో శికారుకని బైటికి తీసుకెళ్ళి ఆమెను పొదలలోకి తీసుకెళ్ళి కత్తితో, స్క్రూడ్రైవర్ తో పొడిచి విచక్షణారహితంగా బండరాయితో మోది చంపాడు. 

గుండెలనిండా అనుమానం నింపుకొని కసాయితానంగా ప్రవర్తించడం ప్రేమ లక్షణం కాదు. 
ప్రేమిస్తే నమ్మండి..  నమ్మకం లేకపోతే ప్రేమించద్దు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి