9, జనవరి 2014, గురువారం

ప్రేమకు న్యాయం జరుగుతుందా..

మంచి డ్రెస్ కనిపిస్తే కొని వాడి పక్కన పడేస్తాం.  
అందమైన వస్తువు కనిపిస్తే కొని ఉపయోగించి  కొత్త మోడల్ రాగానే వేరేది కొంటాం.  

ఈ కాలంలో ప్రేమ కూడా అలాగే మారిపోయింది. ఎంజాయ్ చేసేవరకు ఉండి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనుషులకు వస్తువులకు తేడా లేనంతగా ప్రవర్తిస్తున్నారు ఈ సమాజం. ఇలాంటి మరమనుషులకు ఇద్దరు బలయ్యారు. 

ఆదిలాబాద్ జిల్లా, వేమనపల్లి చెన్నూరు మండలం, గంగారాం గ్రామానికి చెందిన ఏదళ్ళ రజిత, నీల్వాయి గ్రామానికి చెందిన శ్రీశైలం ప్రేమించుకున్నారు పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారు. పెద్దలచేత ముగుర్తాలు కూడా పెట్టించారు. శ్రీశైలం వరసకు బావ కావడంతో తనని పూర్తిగా నమ్మి పెళ్ళికి ముందే తనువును అర్పించుకుంది. అలా మూడు నెలలు  కలసి ఉన్నారు. పెళ్లి సమయం దగ్గర పడే సమయంలో పెళ్ళికి నిరాకరించాడు శ్రీశైలం. రజిత తనను పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ఇంటి ముందు 15 రోజులనుండి మౌనపోరాటం చేస్తుంది. చావైన బతుకైన తనతోనే తేల్చుకుంటానని దీక్ష పట్టింది. శ్రీశైలo  తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడని తనకి న్యాయం చేయాలనీ అతనితో పెళ్లి జరిపించాలని కోరుతుంది. 

ఖమ్మం జిల్లా, ఇల్లెందు గ్రామీణం మండలంలోని నాయకుల గూడేనికి చెందిన కిన్నెర వసంత, కుమ్మరి బస్తీకి చెందిన సింగవరపు నవీన్ కుమార్ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వసంతని పెళ్ళిచేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరకు తీసుకున్నాడు. పెళ్లి  చేసుకోమంటే నిరాకరించాడు. తనకు న్యాయం జరగాలంటూ ప్రియుడి ఇంటిముందు పోరాటానికి దిగింది. 

రజిత, వసంత చేసిన పోరాటాన్ని చూసి గర్వపడాలి. అందరి అమ్మాయిల్లా ప్రేమలో ఓడిపోయి పిరికి దానిలా ఆత్మహత్య చేసుకోకుండా మోసం చేసిన వాదిపైకి ఉద్యమించడం గొప్ప విషయం. వారికి న్యాయం జరగాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది. 

యువతకు ఓ చిన్న మాట... ప్రేమించండి తప్పులేదు కాని ప్రేమ పేరుతో తనువులు దగ్గర చేసుకొని తలదించుకునే పనులు చేసుకోవద్దు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి