15, జనవరి 2014, బుధవారం

ప్రేమ పోరాటం

ప్రేమ కోసం యుద్దాలు జరిగాయి, సాహసాలు చేశారు, పోరాటాలుసాగాయి... ఇలా చరిత్రలో విన్నాము, చదివాము కానీ ఈ కాలంలో కూడా ప్రేమ కోసం పోరాటాలు చేస్తున్న యువతులను చూస్తుంటే గర్వంగా ఉంది.
ప్రేమించి, మోసపోయి, కుమిలుపోయి, జీవితమే లేదని మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోకుండా ధైర్యంగా నిలబడుతున్నారు. 


అలాంటివారిలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతీ చేరింది. తనపై దాడులు జరిగినా భయపడకుండా పోరాటం మొదలు పెట్టింది. 

నల్గొండ జిల్లా, డొంకదొండీ గ్రామపంచాయితీ పరిదిలోని కాన్యతండకు చెందిన ఇష్లావత్ సునీత, డొంకదొండీ గ్రామానికి చెందిన శివకుమార్ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావనకు వచ్చేసరికి శివకుమార్ పెళ్ళికి నిరాకరించాడు. సునీత ప్రియుడి ఇంటిముందు కూర్చొని దీక్ష మొదలుపెట్టింది తనుకు శివకుమార్ కు పెళ్లి జరగాలని. ప్రియుడి తల్లి, సోదరి ఆమెపై దాడి చేశారు అయినప్పటికీ తనకు న్యాయం జరగాలని దీక్ష కొనసాగిస్తుంది. 

సునీతకు న్యాయం జరగాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది.  

14, జనవరి 2014, మంగళవారం

తెలుగు అబ్బాయి చైనా అమ్మాయి

ప్రేమకు నిజమైన అర్థం తెలిసినవాళ్ళుతప్పకుండా ప్రేమలో పడతారు, అదిఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో  అని ఎవరు చెప్పలేరు. ప్రేమకు ఒక్కటే తెలుసు ప్రేమించడం. ఆ ప్రేమలో ఓ తెలుగబ్బాయి చైనా అమ్మాయి పడిపోయారు. అంతే కాకుండా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  

విజయవాడకు చెందిన ఫణి కుమార్ ఎం.బీ.బీ.ఎస్ చేయడం కోసం చైనా వెళ్ళాడు అక్కడ చైనా కు చెందిన అమ్మాయి లీ లూయన్ పరిచయమయ్యింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు, పెద్దలకు చెప్పి పెళ్ళికి ఒప్పించారు, పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి విజయవాడలో జనవరి 11 న వివాహం జరిపించారు. 

ఈ ప్రేమికులిద్దరూ కలకాలం సంతోషంగా, అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.   

రొమాంటిక్ ప్రేమ లేఖ

ప్రేమ లేఖ అనే మాట వినగానే ప్రేమికుల గుండెల్లో గుబాళింపులు మొదలవుతాయి.  
ప్రేమ లేఖను చూడగానే గుండెల్లో పొంగే ఆనందం కళ్ళల్లో కనిపిస్తుంది.  
ప్రేమ లేఖను తాకగానే గుండెల్లో వైబ్రేషన్స్ మొదలవుతాయి . 

ఈ మాటలన్నీ పాత కాలంలో వినిపించేవి .. ఇప్పట్లో ప్రేమ లేఖ అనే పదం వినబడదు. ఎందుకంటే మొబైల్ ఫోన్ లు, ఇ-మెయిల్, ఫేస్ బుక్ లు అందుబాటులోకి వచ్చాయి. 

రొటీన్ కి బిన్నంగా మీ ప్రేమను రొమాంటిక్ గా కంటికింపుగా కనిపించేలా "రెడ్ హార్డ్ స్టాంప్ పెన్ను" ఉపయోగించి ఓ ప్రేమ లేఖ రాయండి. ఈ పెన్నుకి పై భాగంలో ఎర్రటి ఇంకుతో హృదయాకారపు స్టాంప్ఉంటుంది. ఆ గుర్తును ప్రేమ లేఖలో అక్కడక్కడా గురుతులు పెట్టచ్చు,
ఇంకాస్త సృజనాత్మకత జోడించి ఈ గురుతులతో 'ఐ లవ్ యు' 
లేక ప్రేమించే వారి పేరు రాసి పంపండి మీ ప్రియులు ఫ్లాట్ అయిపోతారు.

లవ్ ఫెయిల్యూర్

తోటలో పూల మొక్కలను నాటి 
వాటికీఎరువు వేసి, నీళ్ళు పోసి పెంచుతాము. 
ఆ మొక్కలకు పూలు పూయకుంటే ఆ మొక్కలను పీకేస్తామా ....? 
మొక్కను నాటిన చేతిని నరికేస్తామా....?
పూలు పూయనందుకు కారణాలు ఏవో తెలుసుకొని వాటికీ తగిన మందులు ఉపయోగించి, సరైన పద్దతిలో ఎరువు వేసి మళ్లీ  పూలు పూసేలా చేసుకుంటాము.

మన జీవితంలో ప్రేమ కూడా అంతే.. ప్రేమించిన వాళ్ళు ప్రేమను కాదన్నారని,
ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకోవడనికే పరుగెడుతారు 
కాని ఆ ప్రేమ ఫలించెలా ప్రయత్నాలు చేయరు. 
అలా ఆలోచించకనే ఓ ప్రేమికుడు ప్రాణాలు తీసుకున్నాడు.  

కర్ణాటక, బెంగళూర్, మాగడిరోడ్డు చోళురాపాళ్య  నివాసి కుమార్ తను ప్రేమించిన అమ్మాయి తనని పట్టించుకోవట్లేదని, తన ప్రేమను నిరాకరించిందని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

13, జనవరి 2014, సోమవారం

ప్రియుడికి ఎప్పుడు సంక్రాంతి

కొత్త నీరొస్తే ఏటికి... 
చిగురొస్తే చెట్టుకి... 
 రెక్కలొస్తే పక్షికి.. 
వసంతమొస్తే ప్రకృతికి... పండుగే.
ప్రియురాలు చూపే హృదయ మందిరానికి తోరణంగా... 
ప్రేయసి నవ్వే మనసు ముంగిట ముగ్గుగా... 
తనతో సఖి నడకే బంధు మిత్రులుగా... ఉంటే 
ప్రియుడికి రోజూ సంక్రాంతి పండుగే. 
ప్రేమికులందరికీ ... శుభాకాంక్షలు. 







10, జనవరి 2014, శుక్రవారం

ప్రేమ పలుకులు

ఈ మాట "కొత్త బంగారు లోకం" 
సినిమాలోనిది... 

"వేచి చూడడంలో ఓర్పు ఉంటుంది..  
ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది..  
ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది." 

నేటి యువత ఈ మాటను గుర్తుంచుకోవాలి. ప్రేమ విఫలమైoదనో.. 
పెద్దలు ఒప్పుకోలేదనో.. 
ప్రేమించిన వారు మోసం చేశారనో.. 
ఇలా ఏదోక కారణం వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రేమ ఎలాంటి వారినైనా మార్చేస్తుంది కాబట్టి నమ్మకంతో ముందడుగు వేసి 
ప్రేమను, ప్రాణాలను కాపాడుకోండి. 

9, జనవరి 2014, గురువారం

ప్రాణమే లేకుంటే ప్రేమ ఎలా పొందుతావు

ప్రేమ.... అంటే బతుకునివ్వడం. 
ప్రేమలో ఓదార్పు, ధైర్యం, నమ్మకం, నీరీక్షణ, బలం దొరుకుతాయి. అవి జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి కాని నాశనం చేయవు. 
అలా జరిగితే అది ప్రేమే కాదు. 
ప్రేమను దక్కించుకోవడం కోసం ఏ సాహసమైనా చేయచ్చు కాని ప్రేమ దక్కలేదని ప్రాణం తీసుకుంటే మనం కావలి అనుకునే ప్రేమ మనకు దక్కదు కదా... 

ప్రేమించిన అమ్మాయి ప్రేమను కాదంటే మల్లి మల్లి ప్రయత్నించి ఆమె మనసును గెలవాలి. పిరికి వాడిలా ప్రాణాలు విడిస్తే జీవితాన్ని కోల్పోతావు. అంత పిరికితనం ఉన్న నీకు ప్రేమ ఎందుకు...? 

ప్రేమకు అర్థం తెలియకుండానే ప్రేమించి, ప్రేమ విఫలమైందని ప్రాణం తీసుకుంటున్నారు నేటి యువత. ప్రేమ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా  అంటే.. ప్రాణమే ముఖ్యం కదా. ప్రాణమే లేకుంటే ఎలా ప్రేమిస్తారు..? 
ఎలా ప్రేమను పొందుతారు..?  ఎలా ప్రేమగా జీవిస్తారు..? 

అనంతపురం జిల్లా, కళ్యాణ దుర్గ మండలం, దాసం పల్లి గ్రమంలో తిమ్మరాజు అనే యువకుడు ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురై జనవరి 7 తేదిన పురుగుల మందు తాగి ప్రాణం విడిచాడు. 
ప్రేమ విఫలమైదని బాదపడేదనికన్నా ఎలాగైనా ప్రేమను దక్కించుకోవాలి అని అనుకుంటే తిమ్మరాజు బతికి ఉండేవాడు.