9, జనవరి 2014, గురువారం

ప్రాణమే లేకుంటే ప్రేమ ఎలా పొందుతావు

ప్రేమ.... అంటే బతుకునివ్వడం. 
ప్రేమలో ఓదార్పు, ధైర్యం, నమ్మకం, నీరీక్షణ, బలం దొరుకుతాయి. అవి జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి కాని నాశనం చేయవు. 
అలా జరిగితే అది ప్రేమే కాదు. 
ప్రేమను దక్కించుకోవడం కోసం ఏ సాహసమైనా చేయచ్చు కాని ప్రేమ దక్కలేదని ప్రాణం తీసుకుంటే మనం కావలి అనుకునే ప్రేమ మనకు దక్కదు కదా... 

ప్రేమించిన అమ్మాయి ప్రేమను కాదంటే మల్లి మల్లి ప్రయత్నించి ఆమె మనసును గెలవాలి. పిరికి వాడిలా ప్రాణాలు విడిస్తే జీవితాన్ని కోల్పోతావు. అంత పిరికితనం ఉన్న నీకు ప్రేమ ఎందుకు...? 

ప్రేమకు అర్థం తెలియకుండానే ప్రేమించి, ప్రేమ విఫలమైందని ప్రాణం తీసుకుంటున్నారు నేటి యువత. ప్రేమ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా  అంటే.. ప్రాణమే ముఖ్యం కదా. ప్రాణమే లేకుంటే ఎలా ప్రేమిస్తారు..? 
ఎలా ప్రేమను పొందుతారు..?  ఎలా ప్రేమగా జీవిస్తారు..? 

అనంతపురం జిల్లా, కళ్యాణ దుర్గ మండలం, దాసం పల్లి గ్రమంలో తిమ్మరాజు అనే యువకుడు ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురై జనవరి 7 తేదిన పురుగుల మందు తాగి ప్రాణం విడిచాడు. 
ప్రేమ విఫలమైదని బాదపడేదనికన్నా ఎలాగైనా ప్రేమను దక్కించుకోవాలి అని అనుకుంటే తిమ్మరాజు బతికి ఉండేవాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి