8, మే 2014, గురువారం

యువకుడికి.... ప్రేమికుడికి తేడా ఏంటి?

యువకుడికి ఒకటే వెన్నెల 
ప్రేమికుడికి ప్రియురాలి నవ్వుతో కలిపి రెండు వెన్నెలలు. 

యువకుడికి చల్లదనం కావాలంటే ఏసీ కావాలి
ప్రేమికుడికి చెలి కురులను తాకిన గాలి చాలు. 

యువకుడికి  తోడు లేకుంటే ఒంటరి 
ప్రేమికుడికి సఖి ఊహలు ఎప్పుడూ వెంట ఉంటాయి. 

యువకుడికి ఈ లోకం ఒక్కటే తెలుసు 
ప్రేమికుడికి ప్రియురాలి లోకం అదనం. 

3, ఏప్రిల్ 2014, గురువారం

ప్రేమ వయసు తెలుసా...?

ప్రేమ చాలా గొప్పది. ప్రేమను వర్ణించడం చాలా కష్టo. 
ప్రేమకు పవిత్రత, నమ్మకం, వివేచన చాలా అవసరం. 

జీవితాన్నిఅందుకోవడానికి పరుగులు తీయాల్సిన పాదాలు ప్రేమ వైపు అడుగులు వేస్తున్నాయి.
ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో ఎవరిని పడితే వారిని నమ్మి, మోసపోయి ప్రాణాలు తీసుకోవడం 
సరి కాదు. 
l,k,g చదవడం మొదలు పెట్టినప్పటినుండి వయసు ప్రకారమే చదువు ముందుకుపోతుంది.  
l,k,g చదివే పిల్లలు 10th ఎగ్జామ్స్ రాయలేరు. 
అలాగే ప్రేమకు కూడా ఒక వయసు, ఒక సమయం అవసరం. 
అది నిజమా కాదా అనే యోచించే వివేచన అవసరం. 

నల్గొండ జిల్లా, గుండ్రపల్లి గ్రామానికి చెందిన మాధవి(ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది) , సైదులు ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పరారిలో ఉన్నాడు.  

1, ఏప్రిల్ 2014, మంగళవారం

తప్పు ఎవరిది...?

అన్యాయo, అవినీతి, అక్రమాలు, మోసాలు రాజ్యమేలుతున్నాయి. 
ఘోరాలు నేరాలు నివాసాన్ని నిర్మించుకున్నాయి.  
అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయి. 
వీటన్నిటికన్నా నీచమైనదా ప్రేమ....?

ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనగానే వ్యతిరేకత...ఎందుకు? 
ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలపట్ల చెడు అభిప్రాయం... ఎందుకు?  
ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచిస్తే వారు కోరుకున్న జీవితం వాళ్లకు అందించిన వారు అవుతారు కదా.. 
కళ్ళ ముందు కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉండాల్సిన జీవితాలను మీ కోప తాపాలతో కడతేర్చారు. 
కోల్పోయిన ప్రాణాలను తిరిగి రప్పించగలరా...? 
వీరిరువురిని కలిపి నూరేళ్ళ జీవితాన్ని పండించగలరా...?   

హైదరాబాద్, మేడ్చల్ మండలం, చంద్రశేఖర్ అదే కాలనీకి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెద్దలు అంగీకరించకపోవడంతో 29.3.2014 న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. 31.3.2014 న గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్ పరిదిలో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్బాయి తల నుజ్జునుజ్జయింది. అమ్మాయి మృతదేహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయింది. 

చావడానికి అంత సాహసం చేయగలిగినవాళ్ళు కలసి బతకడానికి ధైర్యం చేయలేకపోయారా..? ఓ నిమిషం ఆలోచించి ఉంటే మీరు కోరుకున్న జీవితాన్ని అందుకునేవారు. 

30, మార్చి 2014, ఆదివారం

ఏటా నాకు ప్రేమ ఉగాది

ప్రియురాలు కోప్పడిన కారం 


ప్రేయసి అలిగిన వగరు 

ప్రియసఖి బాధలో  చేదు 

ప్రాణ చెలి అలకలో పులుపు 

హృదయ విరహంలో ఉప్పు 

ప్రాణ సఖి ముద్దులో తీపి 

ఏటా నాకు ప్రేమ ఉగాది 

ఈ సారి జయ సంవత్సరాది 

28, మార్చి 2014, శుక్రవారం

నెమలికి నాట్యం నేర్పిందెవరు?

కోకిలమ్మ... కోకిలమ్మ... నీకు పాటలు నేర్పిందెవరు అంటే... 
నీ గాత్రమని చెప్పింది. 

నెమలి... నెమలి...  నీకు నాట్యం నేర్పిందెవరు అంటే... 
నీ నడకను చూపింది. 

వెన్నెలమ్మ... వెన్నెలమ్మ... నీకు ఇంత చల్లదనం ఇచ్చిందెవరు అంటే... 
నీ చూపని వివరించింది. 

మల్లె పువ్వమ్మా... మల్లె పువ్వమ్మా.. 
నీకు ఇంత మృధుత్వం ఎలా వచ్చిందంటే... 
నీ స్పర్శని సెలవిచ్చింది. 


27, మార్చి 2014, గురువారం

కన్న బిడ్డల సంతోషo కన్నా కులమతాలు గొప్పవా...?

బిడ్డ పుట్టగానే ఆనందంతో గంతులేస్తారు 
బుడి బుడి అడుగులేస్తుంటే మురిసిపోతారు 
చిలక పలుకులు పలుకుతుంటే పరవశిస్తారు 
పెరిగి పెద్దవారైతే భవిష్యతు గురించి ఆరాఠపడతారు
ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డ మనసును అర్థం చేసుకోలేరా..?

ప్రేమను పంచి.. ప్రేమతో పెంచి..  ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు తమ బిడ్డలు మరో వ్యక్తిని ప్రేమించారని తెలియగానే కులం అనే పొరలు కమ్మి..  అది పెద్ద తప్పుగా భావించి కఠినoగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయిన ప్రేమికులు. 

మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొత్త పల్లికి చెందిన రవి.. లావణ్య కొంతకాలంగా ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల మద్య గొడవలు జరిగాయి. కొద్దిరోజుల తరువాత లావణ్య ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల తరువాత విషయం తెలిసిన రవి 25. 3. 2014 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

26, మార్చి 2014, బుధవారం

ప్రేమ రుతువులివి

నువ్వు నవ్వితే పువ్వుల వసంతం 

నువ్వు అలిగితే వేడి గ్రీష్మం 

నువ్వు మాట్లాడితే ముత్యాల వర్షం 

నువ్వు చూస్తే  శరద్ వెన్నెల 

నువ్వు నడిస్తే హేమంత చల్లదనం 

నువ్వు కోప్పడితే శిశిర విహీనం