
బుడి బుడి అడుగులేస్తుంటే మురిసిపోతారు
చిలక పలుకులు పలుకుతుంటే పరవశిస్తారు
పెరిగి పెద్దవారైతే భవిష్యతు గురించి ఆరాఠపడతారు
ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డ మనసును అర్థం చేసుకోలేరా..?
ప్రేమను పంచి.. ప్రేమతో పెంచి.. ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు తమ బిడ్డలు మరో వ్యక్తిని ప్రేమించారని తెలియగానే కులం అనే పొరలు కమ్మి.. అది పెద్ద తప్పుగా భావించి కఠినoగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయిన ప్రేమికులు.
మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొత్త పల్లికి చెందిన రవి.. లావణ్య కొంతకాలంగా ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల మద్య గొడవలు జరిగాయి. కొద్దిరోజుల తరువాత లావణ్య ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల తరువాత విషయం తెలిసిన రవి 25. 3. 2014 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి