30, మార్చి 2014, ఆదివారం
28, మార్చి 2014, శుక్రవారం
నెమలికి నాట్యం నేర్పిందెవరు?

నీ గాత్రమని చెప్పింది.
నెమలి... నెమలి... నీకు నాట్యం నేర్పిందెవరు అంటే...
నీ నడకను చూపింది.
వెన్నెలమ్మ... వెన్నెలమ్మ... నీకు ఇంత చల్లదనం ఇచ్చిందెవరు అంటే...
నీ చూపని వివరించింది.
మల్లె పువ్వమ్మా... మల్లె పువ్వమ్మా..
నీకు ఇంత మృధుత్వం ఎలా వచ్చిందంటే...
నీ స్పర్శని సెలవిచ్చింది.
27, మార్చి 2014, గురువారం
కన్న బిడ్డల సంతోషo కన్నా కులమతాలు గొప్పవా...?

బుడి బుడి అడుగులేస్తుంటే మురిసిపోతారు
చిలక పలుకులు పలుకుతుంటే పరవశిస్తారు
పెరిగి పెద్దవారైతే భవిష్యతు గురించి ఆరాఠపడతారు
ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డ మనసును అర్థం చేసుకోలేరా..?
ప్రేమను పంచి.. ప్రేమతో పెంచి.. ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు తమ బిడ్డలు మరో వ్యక్తిని ప్రేమించారని తెలియగానే కులం అనే పొరలు కమ్మి.. అది పెద్ద తప్పుగా భావించి కఠినoగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయిన ప్రేమికులు.
మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొత్త పల్లికి చెందిన రవి.. లావణ్య కొంతకాలంగా ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల మద్య గొడవలు జరిగాయి. కొద్దిరోజుల తరువాత లావణ్య ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల తరువాత విషయం తెలిసిన రవి 25. 3. 2014 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
26, మార్చి 2014, బుధవారం
24, మార్చి 2014, సోమవారం
ఆప్యాయత అనురాగాలతో పెంచి.. అమానుషంగా అంతం చేసి..

తాను పెట్టిన గుడ్లను ఆకలికి తాళలేక ఆ గుడ్లను మింగేస్తుంది.
మనసెరిగి, మాటలు నేర్చిన మనిషి.. మానవత్వాన్ని మరిచి మరమనిషిలా బతుకుతున్నారు.
కుల మతాల పిచ్చితో మాతృత్వాన్ని మంటగలిపి, ఒంటినిండా విషాన్ని నింపుకొని జీవిస్తున్నారు.
గుంటూరు జిల్లా, నగరంలోని రాజెంద్రనగర్ కు చెందిన దీప్తి, తన సహోద్యోగి కిరణ్ కుమార్ గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వీరి కులాలు వేరు కావడంతో దీప్తి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పలుమార్లు ఒప్పించాలని ప్రయత్నించినా నీరాకరించాడంతో 21. 3. 2014 న హైదరాబాద్ లోని ఆర్యసమాజ మందిరంలో వివాహం చేసుకున్నారు. విషయం తల్లిదండ్రులకు చేరవేశారు. కులాంతర వివాహం చేసుకొని పరువు తీసిందని పదకం వేసి దీప్తి తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకొని నాగదేవత సన్నిదిలో దండలు మార్చుకోవడం తమ ఆచారమని నమ్మించి వారిని గుంటూరు కు తీసుకోచి, దీప్తిని తమ ఇంటికి తీసుకెళ్ళి చున్నీతో ఉరి పోసి హత్యచేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
తల్లిదండ్రులారా...
కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించి కన్న బిడ్డను కడతేర్చారు.
ప్రాణం తీస్తే పరువు నిలబడుతుందా...?
కులమతాలు కిరీటాలు పెడతాయా...?
17, మార్చి 2014, సోమవారం
13, మార్చి 2014, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)