
తాను పెట్టిన గుడ్లను ఆకలికి తాళలేక ఆ గుడ్లను మింగేస్తుంది.
మనసెరిగి, మాటలు నేర్చిన మనిషి.. మానవత్వాన్ని మరిచి మరమనిషిలా బతుకుతున్నారు.
కుల మతాల పిచ్చితో మాతృత్వాన్ని మంటగలిపి, ఒంటినిండా విషాన్ని నింపుకొని జీవిస్తున్నారు.
గుంటూరు జిల్లా, నగరంలోని రాజెంద్రనగర్ కు చెందిన దీప్తి, తన సహోద్యోగి కిరణ్ కుమార్ గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వీరి కులాలు వేరు కావడంతో దీప్తి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పలుమార్లు ఒప్పించాలని ప్రయత్నించినా నీరాకరించాడంతో 21. 3. 2014 న హైదరాబాద్ లోని ఆర్యసమాజ మందిరంలో వివాహం చేసుకున్నారు. విషయం తల్లిదండ్రులకు చేరవేశారు. కులాంతర వివాహం చేసుకొని పరువు తీసిందని పదకం వేసి దీప్తి తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకొని నాగదేవత సన్నిదిలో దండలు మార్చుకోవడం తమ ఆచారమని నమ్మించి వారిని గుంటూరు కు తీసుకోచి, దీప్తిని తమ ఇంటికి తీసుకెళ్ళి చున్నీతో ఉరి పోసి హత్యచేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
తల్లిదండ్రులారా...
కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించి కన్న బిడ్డను కడతేర్చారు.
ప్రాణం తీస్తే పరువు నిలబడుతుందా...?
కులమతాలు కిరీటాలు పెడతాయా...?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి