25, జనవరి 2014, శనివారం

ప్రేమ జంటల పెళ్లి మేళం

మహబూబ్ నగర్ జిల్లా, హన్యాడ మండలం, నాయినోని గ్రామానికి చెందిన ప్రమీల.. అదే మండలం పెద్దదర్ పల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులు ప్రేమించుకున్నారు. 23తేదిన ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నారు. ప్రమీల తరపువారితో ప్రమాదం వచ్చే అవకాశం ఉందని రక్షణ కలిపించాల్సిందిగా కోరారు.  
మహబూబ్ నగర్ జిల్లా, బీ.కే  రెడ్డి కాలనీకి  చెందిన మౌనిక, సంపత్ ప్రేమించుకున్నారు. 23 తేదిన పెళ్ళిచేసుకున్నారు. గురువారం మౌనిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన ప్రేమికులు పోలీస్  స్టేషన్ కు వెళ్లి మేము ఇష్టపూర్వకంగానే  పెళ్లి చేసుకున్నామని, మాకు రక్షణ కలిపించాల్సిందిగా కోరారు. 

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంటలకు ఏ సమస్యలు రాకూడదని కోరుకుంటూ, జీవితాంతం ప్రేమకు నిదర్శనంగా.. ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 

23, జనవరి 2014, గురువారం

ప్రేమిస్తే..ఆవేశమెందుకు..?

పంతాలకు, పట్టిoపులకు పోయి ప్రేమను గెలవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. 
ప్రేమ సున్నితత్వానికి నిర్వచనం. మీ  ప్రేమను పెద్దలకు అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించి ఉంటె వారు తప్పకుండా ఒప్పుకునేవారు. పెద్దలను ఎదిరించి ఆవేశంగా ప్రవర్తిస్తే వారు మీ ప్రేమను ఎప్పటికీ ఒప్పుకోరు.


పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో ఆవేశపడ్డ ప్రేమికులు ఆసుపత్రి పాలయ్యారు. ఆలోచనతో అడుగేసింటే వారి ప్రేమ పెళ్ళికి అందరిని  ఒప్పించుకునే వారు.  


నంద్యాల మండలం, దేవనగర్ కు చెందిన షేక్ పీరా, అదే కాలనీకి చెందిన రామలీల ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలలో తెలిసి వేర్వేరు సామాజిక వర్గాలవారు కావడంతో పెద్దలు అంగీకరించకుండా ప్రేమికులను మందలించారు. షేక్ పీరా  కిరోసిన్ తాగి  ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలిసిన ప్రియురాలు రసాయన మందు సేవించి  ఆత్మహత్యాయత్నం చేసింది. ఇరువురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 

22, జనవరి 2014, బుధవారం

అమర ప్రేమికుడు అక్కినేని

రాష్ట్రానికి ప్రేమ రుచి తెలిపిన వాడు 
తెలుగు ప్రజలకు ప్రేమించడం 
చెప్పిన వాడు 
దేవదాసుగా... ప్రేమ దాసులు ఎలా కావాలో నేర్పిన వాడు 
జీవితంలో సఫలమైన... 
విఫల ప్రేమికుడు 
అక్కినేని మనందరి ప్రేమను వదిలి వెళ్ళిపోయాడు. 

ప్రేమకు నగరం నిర్మించిన వాడు... 
ప్రేయసికి ప్రేమాభిషేకం చేసిన వాడు... 
ప్రేమికులందరికీ ప్రేమ మేఘ సందేశం పంపినవాడు... 
ప్రేమకు చలాకి తనం అద్దిన దసరాబుల్లోడు... 
తన ప్రేమను మన హృదయాల్లో మిగిల్చి వెళ్ళిపోయాడు. 


21, జనవరి 2014, మంగళవారం

కాపాడదాం ప్రేమికులను

వారిద్దరూ ప్రేమించుకున్నారు.
పెద్దలు ఒప్పుకోలేదు. విడదీసే ప్రయత్నం చేశారు. 
తమ ప్రేమను కాపాడు కోవడానికి... కలిసి బతకడానికి పెళ్లి చేసుకున్నారు. 
మీరు కలిసి బతికే కంటే ... చావడమే మాకు ఇష్టమని పెద్దలు 
చిన్న మనసుతో తెగేసి చెప్పారు. 
ప్రేమను బతికించు కోవడానికి కర్నూలు పోలీసులను ఆశ్రయించారు. 
నందికోట్కూరు మండలం అల్లూరుకు చెందిన 
సురేష్, తేజస్వనిల పరిస్థితి ఇది. 
 వీరి ప్రేమైక జీవితానికి ఎలాంటి ఆపద రాకుడదని కోరుకుంటోంది 
ప్రేమ హృదయం... 



చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి ఉండదా..?


'కోటి విద్యలు కూటికోసమే" అనే సామెత విన్నారా..? 
ఎంత కష్టపడ్డా, ఎన్ని సంపాదించినా కడుపునిండా బోంచేసి త్రుప్తి పొందడం కోసమే. అలా త్రుప్తి లేని సంపద ఎంత ఉన్నా వ్యర్థమే. 

'ప్రాణంగా ప్రేమించుకున్నాం' అనే పదం తెలుసా..? 
ఆ మాటకు అర్థం.. ఎన్ని బాదలొచ్చినా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని కష్టాలెదురైన, ఏ పరిస్థితిలోనైనా కలసి సంతోషంగా జీవించడం. అలా బతకలేని ప్రేమ వ్యర్థం. 

ప్రేమలో అంత గొప్ప   జీవితం దాగి ఉన్నప్పుడు కలసి బతకాల్సిందిపోయి బతుకును నాశనం చేసుకున్నారు ఓ ప్రేమ జంట. 
ఒకరిని విడచి ఒకరు ఉండలేము అనుకున్నారు  తొందరపాటు వలన ప్రియురాలు ప్రాణాలు కోల్పోవడంతో ఇంకెప్పుడు కలని ఉండే అవకాశం లేకపోయింది. 
చావడానికి అంత ధైర్యం చేసిన వాళ్ళు బతకడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోయారు...? అలా చేసి ఉంటె ఆ ప్రియురాలు ప్రాణాలతో ఉండేది.

తూర్పుగోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, నేలటూరుకు చెందిన సాకా స్వర్ణలత, ఆమె బావ తమ్ముడు బిక్కవోలు మండలం తుమ్మలపల్లికి చెందిన మాదేస్వామి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు అదే విషయం పెద్దలకు చెప్పారు. ఇరు కుటుంబీకులు వారి పెళ్ళికి అంగీకరించలేదు. కలసి జీవితం పంచుకోలేకపోయినా చావుతో కలసి జీవితాన్ని ముగించాలనుకున్నారు. స్థానిక బైపాస్ రోడ్ లోని నిర్జీవ ప్రదేశానికి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారు ఆత్మహత్య చేసుకోవలనుకుంటున్నారు అనే విషయం మాదేస్వామి తన స్నేహితులకు ముందుగా చెప్పడంతో వారి స్నేహితులు ఆ ప్రాంతానికి చేరుకొని వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రియుడు బతికాడు ప్రియురాలు ప్రాణాలు కోల్పోయింది.  

20, జనవరి 2014, సోమవారం

వయస్సు చేసిన తప్పా..? పెద్దలు చేసిన పొరపాటా..?

ప్రేయసి ప్రియులు ఒకరిని విడచి ఒకరు ఉండలేక మరణంలోనైన కలసి ఉండాలనుకున్నారు ప్రాణాలు విడిచేందుకు సిద్దపడ్డారు. సరైన వయస్సులేదు, మంచి చెడుల అవగాహనలేదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని యువతకు  ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి..?


వారు మేజర్లు కాదు అయినప్పటికీ ఉరకలు వేసే వయస్సు వారిని పరుగులు తీయించి ప్రేమలో పడేసింది. ప్రేమికులిద్దరూ పెద్దలకు విలువిచ్చి ప్రేమ విషయం చెబితే పెళ్లి చేయల్సిందిపోయి ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారు.   

కడప జిల్లా, ప్రొద్దుటూరు శివారులోని అమృతానగర్ కు చెందిన యువతీ, అదే కాలనీకి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదే విషయం పెద్దలకు చెప్పారు, ఇద్దరి [వయస్సు 17 సంవత్సరాలు] మైనర్లు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. రెండు నెలల తరువాత పెళ్లి చేస్తామని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు అంతవరకు ఆగి తరువాత పెళ్లి విషయం మాట్లాడితే అబ్బాయి తల్లిదండ్రులు 4 ఏళ్ల  తరువాత చేస్తామని చెప్పడంతో ఇరుకుటుంబాలమద్య గొడవలు మొదలయ్యాయి. ప్రేమించిన అబ్బాయి ఇదంతా నావల్లే జరిగిందని మనస్తాపానికి గురై రాత్రి విషం మింగాడు, అబ్బాయిని ఆసుపత్రిలో చేర్పించారు, విషయం తెలిసిన ప్రియురాలు తెల్లవారుజామున విషద్రవం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది, అమ్మాయి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. 

పెద్దలు పెద్దమనసుతో వారి ప్రేమను అర్థం చేసుకొనుంటే  ఆ ప్రేమికులు సంతోషంగా  జీవించేవారు, పెద్దల మూర్కత్వమే వారి ప్రాణాలు తీసింది. పెద్దల్లారా మీ బిడ్డల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి  వారిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి.  

19, జనవరి 2014, ఆదివారం

ప్రేమించడం అంత ఘోరమైన పాపమా...?

పూల మొక్కలు నాటితే పూలు పూస్తాయి.. 
పండ్ల చెట్టు నాటితే పండ్లు కాస్తాయి.. 
ప్రేమ విత్తనం వేస్తే మరణ శిక్ష వస్తుంది.

ప్రపంచంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, ఎన్నో మోసాలు చేస్తున్నారు, అన్యాయం అవినీతి రాజ్యమేలుతున్నాయి.. వీటన్నిటిని చూస్తూ అందరూ మౌనం వహిస్తారు. 
అది తప్పు అని తెలిసినా కూడా దానిని వ్యతిరేకించరు.
ప్రేమను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తారు...? 
ప్రేమ విషయంలో ఎందుకు ఖఠినంగా ప్రవర్తిస్తారు..? 

ప్రేమించడం అంత ఘోరమైన పాపమా...? 

కడప జిల్లా, తొండూరు, కదిరి మండలం చలమకుంట గ్రామానికి చెందిన కుటాగళ్ళ రవి.. చక్రాయపేట మండలం, కొండప్ప గారి పల్లెకు చెందిన ఈశ్వర్ రెడ్డి ఇరు కుటుంబీకులు బతుకు తెరువు కోసం బెంగళూర్ వెళ్లారు, వేరు వేరు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు కానీ వీరంతా ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. రవి, ఈశ్వర్ రెడ్డి కుమార్తె  ప్రేమించుకున్నారు, కుల మతాలు వేరైనా కలసి బ్రతకాలనుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెద్దలు అందుకు అంగీకరించలేదు.రవి,అమ్మాయి రవి స్వగ్రామo చలమకుంటకు వెళ్లారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి తనని తీసుకెళ్ళారు. తరువాత అమ్మాయి తండ్రి, మామ కలిసి రవిని పని ఇప్పిస్తామంటూ పిలిపించి  మల్లేలఘాట్ కు తీసుకెళ్ళి రవిని రాళ్ళతో కొట్టి చంపేసి శవం కనబడకుండా రాళ్ళతో కప్పిపెట్టారు. ఈ విషయం చాల ఆలస్యంగా వెలుగుచూసింది.