21, జనవరి 2014, మంగళవారం

చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి ఉండదా..?


'కోటి విద్యలు కూటికోసమే" అనే సామెత విన్నారా..? 
ఎంత కష్టపడ్డా, ఎన్ని సంపాదించినా కడుపునిండా బోంచేసి త్రుప్తి పొందడం కోసమే. అలా త్రుప్తి లేని సంపద ఎంత ఉన్నా వ్యర్థమే. 

'ప్రాణంగా ప్రేమించుకున్నాం' అనే పదం తెలుసా..? 
ఆ మాటకు అర్థం.. ఎన్ని బాదలొచ్చినా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని కష్టాలెదురైన, ఏ పరిస్థితిలోనైనా కలసి సంతోషంగా జీవించడం. అలా బతకలేని ప్రేమ వ్యర్థం. 

ప్రేమలో అంత గొప్ప   జీవితం దాగి ఉన్నప్పుడు కలసి బతకాల్సిందిపోయి బతుకును నాశనం చేసుకున్నారు ఓ ప్రేమ జంట. 
ఒకరిని విడచి ఒకరు ఉండలేము అనుకున్నారు  తొందరపాటు వలన ప్రియురాలు ప్రాణాలు కోల్పోవడంతో ఇంకెప్పుడు కలని ఉండే అవకాశం లేకపోయింది. 
చావడానికి అంత ధైర్యం చేసిన వాళ్ళు బతకడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోయారు...? అలా చేసి ఉంటె ఆ ప్రియురాలు ప్రాణాలతో ఉండేది.

తూర్పుగోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, నేలటూరుకు చెందిన సాకా స్వర్ణలత, ఆమె బావ తమ్ముడు బిక్కవోలు మండలం తుమ్మలపల్లికి చెందిన మాదేస్వామి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు అదే విషయం పెద్దలకు చెప్పారు. ఇరు కుటుంబీకులు వారి పెళ్ళికి అంగీకరించలేదు. కలసి జీవితం పంచుకోలేకపోయినా చావుతో కలసి జీవితాన్ని ముగించాలనుకున్నారు. స్థానిక బైపాస్ రోడ్ లోని నిర్జీవ ప్రదేశానికి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారు ఆత్మహత్య చేసుకోవలనుకుంటున్నారు అనే విషయం మాదేస్వామి తన స్నేహితులకు ముందుగా చెప్పడంతో వారి స్నేహితులు ఆ ప్రాంతానికి చేరుకొని వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రియుడు బతికాడు ప్రియురాలు ప్రాణాలు కోల్పోయింది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి