20, జనవరి 2014, సోమవారం

వయస్సు చేసిన తప్పా..? పెద్దలు చేసిన పొరపాటా..?

ప్రేయసి ప్రియులు ఒకరిని విడచి ఒకరు ఉండలేక మరణంలోనైన కలసి ఉండాలనుకున్నారు ప్రాణాలు విడిచేందుకు సిద్దపడ్డారు. సరైన వయస్సులేదు, మంచి చెడుల అవగాహనలేదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని యువతకు  ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి..?


వారు మేజర్లు కాదు అయినప్పటికీ ఉరకలు వేసే వయస్సు వారిని పరుగులు తీయించి ప్రేమలో పడేసింది. ప్రేమికులిద్దరూ పెద్దలకు విలువిచ్చి ప్రేమ విషయం చెబితే పెళ్లి చేయల్సిందిపోయి ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారు.   

కడప జిల్లా, ప్రొద్దుటూరు శివారులోని అమృతానగర్ కు చెందిన యువతీ, అదే కాలనీకి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదే విషయం పెద్దలకు చెప్పారు, ఇద్దరి [వయస్సు 17 సంవత్సరాలు] మైనర్లు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. రెండు నెలల తరువాత పెళ్లి చేస్తామని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు అంతవరకు ఆగి తరువాత పెళ్లి విషయం మాట్లాడితే అబ్బాయి తల్లిదండ్రులు 4 ఏళ్ల  తరువాత చేస్తామని చెప్పడంతో ఇరుకుటుంబాలమద్య గొడవలు మొదలయ్యాయి. ప్రేమించిన అబ్బాయి ఇదంతా నావల్లే జరిగిందని మనస్తాపానికి గురై రాత్రి విషం మింగాడు, అబ్బాయిని ఆసుపత్రిలో చేర్పించారు, విషయం తెలిసిన ప్రియురాలు తెల్లవారుజామున విషద్రవం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది, అమ్మాయి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. 

పెద్దలు పెద్దమనసుతో వారి ప్రేమను అర్థం చేసుకొనుంటే  ఆ ప్రేమికులు సంతోషంగా  జీవించేవారు, పెద్దల మూర్కత్వమే వారి ప్రాణాలు తీసింది. పెద్దల్లారా మీ బిడ్డల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి  వారిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి