11, డిసెంబర్ 2013, బుధవారం

బైబిల్ మాట ప్రేమ బాట



ప్రేమిచడం అంటే    పార్కులకు, పబ్బులకు, షికార్లకు వెళ్లి సరదాలు తీర్చుకోవడం కాదు ప్రేమ బతుకునిస్తుంది. ప్రేమ కలిగి ఉండటం అంటే ఏంటి, ఎలా నడుచుకోవాలి అని బైబిల్ ( 1 కొరంధీ 1:7 ) నందు ప్రేమ యొక్క లక్షణాలను క్లుప్తంగా వివరించబడింది. 

1. ప్రేమ దీర్ఘకాలం (జీవితాంతం ) సహిస్తుంది. 
2. ప్రేమ దయ చూపుతుంది 
3. ప్రేమ మత్సర (అసూయ ) పడదు.
4. ప్రేమ డంబముగా (గర్వం ) ప్రవర్తించదు. 
5. ప్రేమ ఉప్పొంగదు (గొప్పలు చెప్పదు) 
6. ప్రేమ అమర్యాదగా నడువదు. 
7. ప్రేమ స్వప్రయోజనము (స్వార్థం ) విచారించుకొనదు.  
8. ప్రేమ త్వరగా కోపపడదు. 
9. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 
10. ప్రేమ సత్యము నందు సంతోషించును. 
11. ప్రేమ అన్నింటిని తాలుకొనును (భరించును). 
12. ప్రేమ అన్నింటిని నమ్మును. 
13. ప్రేమ అన్నింటిని నిరీక్షించును. 
14.  ప్రేమ అన్నింటిని ఓర్చుకొనును. 

10, డిసెంబర్ 2013, మంగళవారం

నా గుండె చప్పుడు నువ్వే



ఎడారిలో నీరు చూడలేము 

చీకటిలో నీడను వెదకలేము 

భీడు భూమిలో పంట వేయలేము 

నీటిలో చేప జాడను కనిపెట్టలేము 

మండుటెండలో వెన్నెలను కనలేము 

నువ్వు లేని క్షణం నా గుండె చప్పుడు వినలేము 





ఓ నెలవంక.... నీ వెనకే నేనింక

  
నిండు పున్నమి వెన్నెల్లో మిల మిల మెరిసే తారను చూస్తే ఏమనిపిస్తుంది....? 

ఎవరో గొప్ప వ్యక్తి  జన్మించి ఉంటారు అని సహజంగా అనుకుంటుంటారు. 

తార, నెలవంక చెంత చేరి మెరుస్తుంటే ఏమంటారో తెలుసా.....?  

నెలవంక, తారల కలయికను ప్రేమకు చిహ్నంగా ఆఫ్రికా దేశస్థులు భావిస్తారు. 

మీరు  ప్రేమించే వ్యక్తికి మీ ప్రేమను  తెలియజేయాలనుకుంటే నెలవంక తారలు కలిసి దగ్గరగా ఉన్నట్లు కనిపించే బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్, లాకెట్స్ ఇవ్వవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... 

9, డిసెంబర్ 2013, సోమవారం

ప్రేమ హృదయాలకు ఓ చక్కటి అవకాశం.




ప్రేమ అంటే కేవలం ఒక అమ్మాయి, అబ్బాయిల మధ్య ఉన్న బందం మాత్రమే కాదు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు , బందువులు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య ఉన్న  అనుబందాలను కూడా ప్రేమ అనే అంటారు. 

ఎవరినైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తికి మీ ప్రేమను వినూతానంగా చూపించాలనుకుంటే గ్రాఫిక్స్ కోడ్ రూపంలో తెలియజేసి వారి హృదయాల్లో మీ స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు.     


ఈ క్రింది లింక్స్ ప్రయత్నించండి. 

http://www.zwani.com/graphics/i_love_you/

http://www.zwani.com/graphics/i_love_you/?page=2

బెదిరిస్తే భయం పుడుతుంది. ప్రేమ కాదు

బెదిరిస్తే భయం పుడుతుంది. 
ప్రేమ కాదు 
ప్రేమను ప్రేమతో సాధించాలి. 
ప్రేమను ప్రేమతోనే జయించాలి. 
భయపెట్టి , బాధ పెట్టి కాదు. 

X¾šÇ-¯þ-Íçª½Õ ¬Ç¢A-Ê-’¹-ªý-ÂÃ-©-FÂË Íç¢CÊ NŸÄu-JnE å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð œË¤ñx«Ö ÍŒŸ¿Õ-«Û-Åî¢C.- ªîW X¾šÇ-¯þ-Íçª½Õ ¦²Äd¢œîx ¦®¾Õq ‡Â¹×ˆ-ŌբC.- ¬Á¢Â¹-ª½-X¾-LxÂË Íç¢CÊ §Œá«-¹ל¿Õ “X¾²Ä-Ÿþ-骜Ëf „äêª „ÃJÂË ¤¶ò¯þ Í䮾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× ŠÂ¹ˆ-²ÄJ ¤¶ò¯þ ƒ«y-«ÕE ÆœË-’Ü¿Õ.- D¢Åî ‚„çÕ ¤¶ò¯þ ƒ*a¢C.- ‚ ¤¶ò¯þ Ê¢¦ª½Õ Åç©Õ-®¾Õ-¹×E ÅŒª½ÍŒÖ ‚„çÕÊÕ „äCµ¢-Íä-„Ü¿Õ.- „ê½¢ ªîV-©Õ’à NX¾-K-ÅŒ¢’à „äCµ®¾Öh “æXNÕ-²Äh„Ã.-.- ÍŒ¢æX-§ŒÕ¯Ã Æ¢{Ö ¦ãC-J-®¾Õh-¯Ãoœ¿Õ.  NŸÄu-JnEని  ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు'లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

8, డిసెంబర్ 2013, ఆదివారం

ఢిల్లీకి రాజైనా ప్రేమకు ప్రేమికుడే

ప్రేమ ఆద్మీ 

ఢిల్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదు చేసిన ఆమ్ ఆద్మీ నేత అరవింద్  కేజ్రీవాల్ ప్రేమికుడే...
 సునీతకు ప్రియుడే. 
ఐఆర్ఎస్ కు ఎంపికైన  కేజ్రీవాల్ ... సునీత శిక్షణలో భాగంగా ముస్సోరిలో తొలిసారి కలుసుకున్నారు. అక్కడ పరిచయం ... ప్రేమగా మారింది.  తరవాత వారు ఘాడంగా ప్రేమించుకున్నారు.  ముందు తన ప్రేమను చెప్పారంట. 

వారు ప్రేమించు కుంటున్నామని ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. బాగా చదివి, విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. ఉద్యోగాలు వచ్చిన తరవాత పెళ్ళితో ఒక్కటయ్యారు. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు. ఇప్పటికీ ఆమె సహకారం లేనిది నేను ఇంత విజయం సాధించలేనని చెబుతారు  కేజ్రీవాల్. అందుకే ఆయన ప్రేమ ఆద్మీ. ఆయన ప్రోత్సాహం లేనిది నేను ఉద్యోగ నిర్వహణలో ఇంత ఎత్తుకు ఎదగాలేనని అంటారు సునీత..... అందుకే ఆమె  కేజ్రీవాల్ ఆద్మీ.   వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.  వారి ప్రేమైక జీవితమిది. 

                       ఢిల్లీకి రాజైనా ప్రేమకు ప్రేమికుడే 

7, డిసెంబర్ 2013, శనివారం

పెద్దలను ఎదిరించే ధైర్యం లేక... ప్రేమను కాపాడుకునే శక్తి లేక...

నీరు లేకుండా చేప జీవించగలదా?
వేర్లు లేకుండా చెట్టు మనగలదా ?
ప్రాణం లేకుండా శరీరం బతకగలదా?
నువ్వు లేకుండా నేను ఈ లోకంలో ఉండగలనా?
అనుకున్నాడో  ప్రేమికుడు. 
పెద్దలను ఎదిరించే ధైర్యం లేక... ప్రేమను కాపాడుకునే శక్తి లేక... ప్రియురాలిని తన వద్దకు చేర్చుకునే మార్గం లేక ... ఆత్మహత్య చేసుకున్నాడు. 

తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన ప్రకాష్, మరో యువతి ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు వచ్చి ప్రకాష్ ను కొట్టి, ప్రియురాలిని తీసుకెళ్ళారు. ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో బల్వన్మరణం పొందాడు. 



 ఈ ప్రేమికుడికి ప్రేమ హృదయం నివాళి అర్పిస్తోంది.