ప్రేమ ఆద్మీ
ఢిల్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదు చేసిన ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రేమికుడే...
సునీతకు ప్రియుడే.
ఐఆర్ఎస్ కు ఎంపికైన కేజ్రీవాల్ ... సునీత శిక్షణలో భాగంగా ముస్సోరిలో తొలిసారి కలుసుకున్నారు. అక్కడ పరిచయం ... ప్రేమగా మారింది. తరవాత వారు ఘాడంగా ప్రేమించుకున్నారు. ముందు తన ప్రేమను చెప్పారంట.
వారు ప్రేమించు కుంటున్నామని ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. బాగా చదివి, విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. ఉద్యోగాలు వచ్చిన తరవాత పెళ్ళితో ఒక్కటయ్యారు. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు. ఇప్పటికీ ఆమె సహకారం లేనిది నేను ఇంత విజయం సాధించలేనని చెబుతారు కేజ్రీవాల్. అందుకే ఆయన ప్రేమ ఆద్మీ. ఆయన ప్రోత్సాహం లేనిది నేను ఉద్యోగ నిర్వహణలో ఇంత ఎత్తుకు ఎదగాలేనని అంటారు సునీత..... అందుకే ఆమె కేజ్రీవాల్ ఆద్మీ. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. వారి ప్రేమైక జీవితమిది.
ఢిల్లీకి రాజైనా ప్రేమకు ప్రేమికుడే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి