22, డిసెంబర్ 2013, ఆదివారం
21, డిసెంబర్ 2013, శనివారం
ప్రేమించినందుకు మరణ శిక్ష.
ప్రేమే ప్రాణం అనుకుంది.. ప్రియుడే జీవితం అనుకుంది..
ఆ ప్రేమే ప్రాణం తీసింది..
ఆ ప్రియుడే ప్రాణం తీశాడు.
తన హృదయాన్ని పువ్వుగా చేసి ప్రియుడికి అర్పిస్తే,
ప్రియుడి తన గుండెను బండరాయి చేసుకొని ఆ రాయితో ఆమె గుండెపై కొట్టి చంపేశాడు.
రామ చంద్రాపురం ఎస్ ఎస్ కాలనీకి చెందిన రేష్మా , దుర్గాప్రసాద్ లు ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోమని ప్రియుడిని అడిగింది రేష్మా. కొద్దిరోజులు ఆగుదమన్నాడు దుర్గాప్రసాద్. ఇద్దరిమద్య మాటామాట పెరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ రేష్మా బెదిరించడంతో ఆగ్రహించిన ప్రియుడు రాయితో ఆమె తలపై మోదాడు. తర్వాత నేలకు గట్టిగా కొట్టాడు. దీంతో రేష్మా అక్కడికక్కడే మృతి చెందింది.
అమ్మాయిలు ఇటువంటి దుర్మార్గులతో జాగ్రత్త.
మరో ప్రేమ కథ ముగిసింది
ప్రేమించి, పెళ్ళిచేసుకొని జీవితంలో స్థిరపడి ఆదర్శంగా నిలబడి ఉంటె నలుగురూమీగురించి గొప్పగా చేపుకునేవారు. ప్రేమించి పెద్దల్లు ఒప్పుకోలేదని పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేసుకుంటే మీరు కళలు కన్న ప్రపంచం మీకు దక్కకుండా పోయింది. ఎవరిని సాధించాలని చనిపోయారు... బతికి సాధించాలి ఏదైనా.
ఈ ప్రేమికులిద్దరూ చస్తే సాధిస్తాం అనుకొని ఓడిపోయారు.
ఆదిలాబాద్ జిల్లా, జన్నారం మండలం లో ఇద్దరు ప్రేమికులు ప్రేమను బతికించుకోలేక ప్రాణాలను బలిచేశారు. రొండి రంజిత్, పడిగెల వనజ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి నిరాకరించారు. వనజకు ఆరు నెలల క్రితమే నిశ్చితార్థం చేశారు. మరో నెలలో వివాహం జరగనుంది. వీరి ప్రేమ పెళ్లి పెద్దలు ఒప్పుకోరని నిర్ణయం తీసుకొని పురుగులమందు తాగి జన్నారం మండలంలోని ప్రైవేట్ పాఠశాల ఎదురుగా ప్రధాన రహదారిపై అపస్మారకస్థితిలో పడిపోయారు. చుట్టుపక్కల ఉన్న జనం గమనించి వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు.
ప్రేమించుకునేది కలసి బ్రతకడానికి... కలిసి చావడానికి కాదు.
రైలు కింద ముక్కలైన ప్రేమ
ఇప్పుడు మీ కోపం చల్లారిందా?
మీ పంతాలు నేగ్గాయా ?
మీ పట్టింపులు తీరాయా?
అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ పిల్లలు
రైలు పట్టాలపై ముక్కలైనా మీ తప్పు తెలిసిరాలేదా?
బిడ్డలకు అడిగిందల్లా ఇచ్చే మీరు
ప్రేమను ఎందుకు కాదంటున్నారు?
పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని మీరు
వారిని చావుకు ఎందుకు పురికొల్పుతున్నారు?
తునాతునకలైన ప్రేమికుల మృత దేహాలు
అడుగుతున్నాయి సమాధానం చెప్పండి...
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకట్రాజుల కండ్రిగకు చెందినా మోహన్ కృష్ణ , సత్యవేడుకు చెందిన చాతుర్య ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు కాదన్నారు. బతికితే కలిసి బతుకుదాం... లేకపోతే కలిసి చనిపోదాo అని నిర్ణ యించుకున్నారు. నెల్లూరు జిల్లా సూల్లురుపేట సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.
ప్రేమికుల్లారా చావాల్సింది మీరు కాదు... పెద్దల్లోని ద్వేషం.
20, డిసెంబర్ 2013, శుక్రవారం
మృత్యువును జయించిన ప్రేమ
ప్రేమంటే ప్రాణం ఇవ్వడమో,
తీయడమో కాదు
ప్రాణం పోయడం.
ఈ ప్రేమ చరిత్ర చదివితే మీకే తెలుస్తుంది.
గ్రీకు చారిత్రక పురుషుడు ఆర్ఫియెస్ సంగీతంలో దిట్ట, మంచి అందగాడు. ఈయన అతిలోక సుందరి ఐన యూరిదైస్ ను ఘాడంగా ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆనంద లోకంలో విహరిస్తుండగా యూరిదైస్ ను పాము కాటేస్తుంది. అతని చేతుల్లోనే ప్రాణాలు విడుస్తుంది. ఆర్ఫియెస్ తట్టుకోలేక పోతాడు. విలవిలలాడిపోతాడు. ఎలాగైనా తన ప్రియురాలిని బతికించుకోవాలని మృత్యు లోకానికి వెళ్తాడు. తన సంగీత కౌశలంతో దేవుళ్ళను మెప్పిస్తాడు. దేవుళ్ళు వరం కోరుకోమని అంటే... తన ప్రియురాలు యూరిదైస్ ను బతికించాలని కోరతాడు. అతని ప్రేమకు మెచ్చుకున్న దేవుళ్ళు ఆమెను బతికిస్తారు.
ప్రేమలో నిజాయతీ ఉంటే మృత్యువునైనా జయించవచ్చునని చాటాడు ఆర్ఫియెస్. మరి మీరు...?
తీయడమో కాదు
ప్రాణం పోయడం.
ఈ ప్రేమ చరిత్ర చదివితే మీకే తెలుస్తుంది.
గ్రీకు చారిత్రక పురుషుడు ఆర్ఫియెస్ సంగీతంలో దిట్ట, మంచి అందగాడు. ఈయన అతిలోక సుందరి ఐన యూరిదైస్ ను ఘాడంగా ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆనంద లోకంలో విహరిస్తుండగా యూరిదైస్ ను పాము కాటేస్తుంది. అతని చేతుల్లోనే ప్రాణాలు విడుస్తుంది. ఆర్ఫియెస్ తట్టుకోలేక పోతాడు. విలవిలలాడిపోతాడు. ఎలాగైనా తన ప్రియురాలిని బతికించుకోవాలని మృత్యు లోకానికి వెళ్తాడు. తన సంగీత కౌశలంతో దేవుళ్ళను మెప్పిస్తాడు. దేవుళ్ళు వరం కోరుకోమని అంటే... తన ప్రియురాలు యూరిదైస్ ను బతికించాలని కోరతాడు. అతని ప్రేమకు మెచ్చుకున్న దేవుళ్ళు ఆమెను బతికిస్తారు.
ప్రేమలో నిజాయతీ ఉంటే మృత్యువునైనా జయించవచ్చునని చాటాడు ఆర్ఫియెస్. మరి మీరు...?
19, డిసెంబర్ 2013, గురువారం
రెండు విఫల ప్రేమ కతలు
ప్రేమ తీసిన ప్రాణం
కరీంనగర్ జిల్లా జ్యోతి నగర్ చెందిన
చక్రధర్ ఒక యువతిని ప్రేమించాడు.
యువతిని తీసుకొనివెళ్ళిపోయాడు.
వారిబంధువులు ఇద్దరిని
పట్టుకొచ్చి హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తర్వాత చక్రధర్ తండ్రి చనిపోవడంతో సింగరేణి గనిలో ఉద్యోగం ఇచ్చారు. అక్కడ విధులకు వెళ్ళిన చక్రధర్ హత్యకు గురయ్యాడు. యువతి బంధువులే ఈ పని చేసి ఉంటారని చక్రధర్ తల్లి కేసు పెట్టారు. చక్రధర్ కు నలుగురు పెళ్ళికాని చెల్లెళ్ళు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటని తల్లి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు.
వన్ సైడ్ లవ్
బెంగళూర్ కు చెందిన ఐటి ఉద్యోగిని పవిత్ర అనే యువతి అక్కడ నటుడు శ్రీ మురళిని ప్రేమించింది. మురళి ఫోన్ నంబర్ తెలుసుకుని రోజు సందేశం పంపేది. మురళి వాటికి స్పందించేవాడు కాదు. వన్ సైడ్ లవ్ చేసేది. మురళికి ఇదేవరకే పెళ్లి అయింది. బుధవారం మురళి ఇంటి వద్దకు వెళ్ళిన పవిత్ర తనను పెళ్ళిచేసుకోవాలని, లేక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వెంటనే మురళి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను తీసుకెళ్ళి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మనస్తాపం చెందిన పవిత్ర నిద్ర మాత్రలు మింగి మురళి ఇంటి వద్దకు వచ్చి పడిపోయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)




