
ప్రేమించి పెద్దల్లు ఒప్పుకోలేదని పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేసుకుంటే మీరు కళలు కన్న ప్రపంచం మీకు దక్కకుండా పోయింది. ఎవరిని సాధించాలని చనిపోయారు... బతికి సాధించాలి ఏదైనా.
ఈ ప్రేమికులిద్దరూ చస్తే సాధిస్తాం అనుకొని ఓడిపోయారు.
ఆదిలాబాద్ జిల్లా, జన్నారం మండలం లో ఇద్దరు ప్రేమికులు ప్రేమను బతికించుకోలేక ప్రాణాలను బలిచేశారు. రొండి రంజిత్, పడిగెల వనజ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి నిరాకరించారు. వనజకు ఆరు నెలల క్రితమే నిశ్చితార్థం చేశారు. మరో నెలలో వివాహం జరగనుంది. వీరి ప్రేమ పెళ్లి పెద్దలు ఒప్పుకోరని నిర్ణయం తీసుకొని పురుగులమందు తాగి జన్నారం మండలంలోని ప్రైవేట్ పాఠశాల ఎదురుగా ప్రధాన రహదారిపై అపస్మారకస్థితిలో పడిపోయారు. చుట్టుపక్కల ఉన్న జనం గమనించి వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు.
ప్రేమించుకునేది కలసి బ్రతకడానికి... కలిసి చావడానికి కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి