8, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రేమ కావాలంట...పెళ్లి వద్దంటా.

ప్రేమించానంటే నమ్మింది.. 
పెళ్లి చేసుకుంటానంటే జీవితాన్ని అర్పించడానికి సిద్దపడింది. 
ఏడడుగులు నడిచేరోజు దగ్గర పడుతుంటే సంబరపడిపోయింది. 
బతికినంత వరకు  అండగా ఉంటాడనుకుంది కాని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు.   

కృష్ణ జిల్లా, సిద్ధార్థ నగర్ కు చెందిన బి.మురళి నాయక్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకున్నారు, పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి జనవరి 4 న పెళ్లి నిశ్చయించారు. జనవరి 3 న  మురళి నాయక్ గ్రామం విడచి పరారయ్యాడు. యువతి మనస్తాపాo  చెంది జనవరి 21 న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. ఫిబ్రవరి 7 న నూజివీడు పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు. 

టైంపాస్ కోసం ప్రేమించి  ప్రేమ ముసుగులో  ప్రేమించిన వారిని మోసం చేయకండి. 

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

చైనా, అమెరికా అమ్మాయిలు VS తెలుగు అబ్బాయిలు = ప్రేమ

దేశాలు వేరు, భాషలు వేరు, 
కులాలు వేరు, మతాలు వేరు అయినా ప్రేమ కలిపింది ఇద్దరిని. 
ఇరువురి సంప్రదాయాలు వేరు అయినా మనసు చేసింది ఒక్కటి. 

మన దేశంలో ఉంటూ...  
ఒకే ప్రాంతంలో నివసిస్తూ...  
కులాలు వేరని, మతాలు వేరని ప్రేమికులను విడదీసి ప్రాణాలు పోయేలా చేస్తున్నారు. 
వారి ప్రేమను అర్థం చేసుకోక వారి ఆశను, ఆనందాన్ని చంపేస్తున్నారు. పెద్దలు మీ పిల్లల మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితాంతం ఆనందంగా బతకడానికి తోడ్పడండి. 

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడికి చేరి హిందూ సంప్రదాయాన్ని గౌరవించి వివాహం చేసుకొని ప్రేమకు అందరు ఒక్కటే అని నిరూపించారు ఈ ప్రేమ జంటలు.
చైనా కు చెందిన టెoగ్ మిన్, చెన్నై కి చెందిన శ్రీరామ్ మనియంలు   ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పుట్టపర్తిలోని దుర్గామాత ఆలయంలో ఫిబ్రవరి 6 న వివాహం చేసుకున్నారు. 

అమెరికా కు చెందిన క్లారిస, పీలేరు కి చెందిన విష్ణు రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో తిరుమలలో ఫిబ్రవరి 6 న వివాహం చేసుకున్నారు. 

వీరి ప్రేమమైక జీవితం ఆనందంగా, ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 

6, ఫిబ్రవరి 2014, గురువారం

ప్రేమకు ఆనకట్ట కట్టండి... అడ్డుకట్ట వేయద్దు

నదికి ఆనకట్ట కట్టవచ్చు... అడ్డుకట్ట వేయలేం. 
ఒక వేళ వేస్తే అది అడ్డుకట్టను ముంచుతుంది. 
లేదంటే వెనుకకు తిరిగి తనను తానే ముంచుకుంటుంది... పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంది. 
ఆనకట్ట కడితే... నది మన మాట వింటుంది. మనం ఎలా చెబితే అలా కదులుతుంది. 

ప్రేమికులూ  అంతే వారికి ఆనకట్ట కడితే... ఎన్నిటికో ఉపయోగ పడ తారు. 
అడ్డుకట్ట వేస్తే... పెద్దలను ఎదిరిస్తారు. అదీ కాదంటే  వారి ప్రాణాలే తీసుకుని ఏడిపిస్తారు. 
పెద్దలు ఈ విషయం తెలియక వారికి అడ్డుకట్ట వేస్తున్నారు.  అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను తమ చేతులారా చంపేసుకుంటున్నారు. 

రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడెం లో 9 వ తరగతి విద్యార్థిని, ఆరేమైసమ్మకు చెందిన  సమీప బంధువు సురేష్ ను ప్రేమించింది. ఇంట్లో విషయం తెలిసి సురేష్ తల్లి విద్యార్థిని మందలించింది. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియలకువచ్చిన  సురేష్ తట్టుకోలేక పోయాడు. తన ప్రియురాలు లేకుండా బతకలేను అనుకున్నాడు.  5. 2. 14న ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. 

ఖమ్మం జిల్లా  చంద్రుగొండ మండలం రేపల్లె కు చెందిన  రాము,  అదే గ్రామానికి చెందినా పుష్పలత మూడేళ్ళుగా ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి ప్రేమను కాదన్నారు. విడిపోయి బతకలేక చావే శరణ్యమనుకున్నారు. అడవిలోకి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.   

మన పిల్లలు ప్రేమించారని  తెలియగానే... వారి మీద కేకలు వేసి వారి మనసు గాయపడేట్లు చేస్తున్నాం.  వారు  ఏదో  భయంకర తప్పు చేసినట్లు భావించి నిందిస్తున్నాం. వారిని నేరస్తులుగా చేస్తున్నాం. 

అలా  కాకుండా వారు ఎందుకు ప్రేమించారు? ఎవరిని ప్రేమించారు ? అని సావధానంగా తెలుసుకోవాలి.  ఈ వయసులో ప్రేమిస్తే కలిగే నష్టాలేంటో వివరించాలి. జీవితంలో స్థిరపడ్డాక మీరు నిర్ణయం తీసుకుంటే వచ్చే ఫలితాలపై విశ్లేషించాలి.  వారి ప్రేమకు ఆనకట్ట కట్టి వారిని సరైన మార్గంలో నడిపించాలి. 


4, ఫిబ్రవరి 2014, మంగళవారం

ప్రేమించడం తప్పా...? ఒప్పా...?

ప్రేమ అనే పదం అందరికి సుపరిచితం. 
ప్రేమ అంటే తెలియని వయసు పిల్లలు కూడా ప్రేమ అనే పదం వింటున్నారు, 
ప్రేమ పాటలు పాడుతున్నారు. 
యువత మాత్రం ప్రేమపై మక్కువ పెంచుకున్నారు. 
జీవితంలో ప్రేమించడం అనేది లేకపోతే అర్థం లేదంటున్నారు. 
ప్రేమించడం మంచిదే కాని ఆ ప్రేమ స్వచ్చమైనదా లేదా అనే విషయాన్ని మరచిపోతున్నారు. 
కొందరు టైంపాస్ కోసం ప్రేమించి బ్రేక్ అప్ పార్టీ ఇచ్చి 
ఆనందంగా విడిపోతున్నారు. 
కొందరు ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోతున్నారు. 
కొందరు ప్రేమకోసం నేరాలు చేస్తున్నారు. 
కొందరు ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తున్నారు. 
కొందరు ప్రేమకోసం ప్రాణాలు కోల్పోతున్నారు. 

వీటన్నిటిని గమనిస్తే ప్రేమ అనేది గొప్పది. ప్రేమంటే సరైన అవగాహన లేక తప్పుడు ఆలోచనలతో తప్పుడు మార్గాలను ఎన్నుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమలో పవిత్రత, నిజాయితి ఉంటే నేరాలు ఘోరాలు జరగవు. ఎందుకంటే ప్రేమ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది కనుక తొందర పాటుతో ఏ నిర్ణయం తీసుకోదు. ఆలోచనతో వేసే ప్రతి అడుగు అర్థవంతంగా ఉంటుంది. 

ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల మండలం గాంధీ నగర్ కు చెందిన వనితసాగర్, అదే ప్రాంతానికి చెందిన సాయిశని రెండేళ్ళుగా ప్రేమించుకున్నారు, కలసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన రాగానే సాయిశని పరారయ్యాడు. వనిత ఆమె కుటుంబ సభ్యులు కలసి ప్రియుడి ఇంటివద్ద న్యాయం కోసం మౌన దీక్ష మొదలుపెట్టారు. 

నల్గొండ జిల్లా, చండూరు మండల కేంద్రంలోని బేత వెంకన్నయాదవ్, పల్లెంల గ్రామానికి చెందిన బద్దుల మౌనిక ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాని పెద్దలు అంగీకరించలేదు. ఇరువురు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని గమనించిన స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. 

కర్ణాటక రాష్ట్రం, మైసూర్, నగెనహళ్లి నివాసి స్వామి అనే వ్యక్తి ఓ విద్యార్థిని ప్రేమించమని వెంటపడ్డాడు. అమ్మాయి ప్రేమను అంగీకరించలేదని కొడవలితో దాడికి దిగి ఆమెను గాయపరిచాడు. గమనించిన స్థానికులు స్వామికి దేహశుద్ది చెశారు. ఇరువురిని ఆసుపత్రిలో చేర్పించారు. 

వీరంతా ఆలోచించి ముందడుగు వేసి ఉంటె ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఆ సమస్యలకు పరిష్కారం దొరికి ఉండేది.  

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

ప్రేమను నట్టేట ముంచేశాడు

ప్రేమిస్తున్నానంటే  మనసు అర్పించింది. 
పెళ్లి చేసుకుంటానంటే తనువు అర్పించింది.  
బతికినంతవరకు తోడుంటానంటే జీవితం అర్పించిది. 
సర్వస్వం నువ్వే అనుకోని నీతో ఏడడుగులు నడిస్తే...   
ఏడేడు జన్మలు తన చేయి పట్టుకొని నడవాల్సింది పోయి 
నట్టేట వదిలి వెళ్ళిపోయావా..? 
పెళ్లి చేసుకొని మోసగించడానికి ప్రేమను పావుగా వాడుకున్నవా..? 
ప్రేమ అనే పదం ఉపయోగించి ప్రేమను నిలువునా  మోసం చేసావు.  

తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, ర్యాలి  గ్రామానికి చెందిన చప్పిడి మల్లిక అనే అమ్మాయిని.. కరీంనగర్ జిల్లా కు చెందిన కరణం పురుషోత్తమ వెంకట సత్యనారాయణ అనే ఇంజనీర్ మల్లికని ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి నమ్మించి 2012 లో పెళ్ళిచేసుకున్నాడు. కొన్నాళ్ళు కలిసిమెలసి ఉన్నాడు. ఇప్పుడు మల్లికను పట్టించుకోకుండా వదిలేసి వెల్లిపోయాడు. మల్లిక ఆత్రేయపురo పోలీసులను ఆశ్రయించింది. 

అబ్బాయిలు ఇలా ఎంత కాలం అమ్మాయిలను మోసం చేస్తారు..? 
అమ్మాయిలు ఎంతకాలం అబ్బాయిల మాయ మాటలు నమ్ముతారు..? 

ప్రేమను యాసిడ్ లో కాలుస్తా..


నిజమైన ప్రేమ.. ప్రేమించిన వ్యక్తి క్షేమం కోరుతారు కాని కష్టపెట్టరు. 
ఎందుకంటే వాళ్ళు కష్టపడితే మనసు తట్టుకోలేదు. 





విశాఖపట్నo జిల్లా, పెదవాల్తేరు, కొత్తరేసపువానిపాలెం ప్రాంతంలో ఉంటున్న వి.సతీశ్.. వారి ఇంట్లో అద్దెకుంటున్న 
బీటెక్ విద్యార్థినితో సన్నితంగా ఇంటూ.. తనని షాపింగ్ మాల్స్ కు తీసుకెళ్తూ సరదాగా అన్నిచోట్ల తిప్పాడు. 3 నెలలుగా తనను బ్లాక్ మేల్ చేస్తున్నాడు. అన్ని షాపింగ్ మాల్స్ లోని సీసీ కెమెరాల్లో ఉంటాము కాబట్టి నన్ను ప్రేమించూ అంటూ వేదించడం మొదలు పెట్టాడు. అమ్మాయి కాదనడoతో ప్రేమించకపోతే మొఖం పైన యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది.  

1, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రేమకున్న నమ్మకాన్నే చంపేశాడు.

గాలి మీద నమ్మకం... ఎక్కడికెళ్ళినా ఊపిరినిస్తుందని. 
ప్రియుడు ఊపిరనుకుంది. 
నీటి మీద నమ్మకం ... తాగితే దాహం తీరుస్తుందని. 
ప్రియుడు నీరనుకుంది. 
గుండెమీద నమ్మకం... ఎన్ని కస్టాలోచ్చినా బతుకుతానని. 
మనసైనవాడు తన హృదయం అనుకుంది. 
గాలి సుడిగాలై నమ్మకాన్ని చుట్టుముట్టింది..  
నీరు మనసును ముంచింది.. 
గుండె క్రూరంగా మారి ప్రేమను చంపేసింది. 

సహనాన్ని లోకువ చేసుకున్నావు, నిన్ను ప్రేమిస్తున్నానంటే ఇంట్లో వాళ్ళు కొట్టారు... భరించింది. 
నీతో కలసి బతకాలనుకుoటున్న్నానంటే ఉద్యోగం మాన్పించారు... సహించింది. 
నువ్వు రమ్మంటే.. నీ మీద నమ్మకంతో పెద్దలకు అపద్దం చెప్పి అడుగు బైటపెట్టింది హిమబిందు. 
నమ్మకాన్ని కాలరాశావు, 
ఆమె ధైర్యాన్ని.. ఆమెను.. నీ చేతులతో చంపేశావు.. 
నీకు ఇది న్యాయమా...? 

కర్నూలు నగరానికి చెందిన హిమబిందు, బలరాం రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దలకు విషయం తెలిసి ప్రేమను కాదన్నారు. హిమబిందు ఉద్యోగం మాన్పించి ఇంట్లో ఉంచారు. డిసెంబర్ 24 న బర్త్ డే పార్టీ ఉందని చెప్పి బైటికోచ్చింది. నేలరోజులతర్వాత ప్రాణాలు కోల్పోయిందని  తేలింది. ప్రియుడు  బలరాం రెడ్డి శిరువెల్ల పరిదిలోని నల్లమల ప్రాంతానికి తీసుకెళ్ళి అనుమానించి మాట్లాడడంతో ఇరువురిమద్య వాగ్వాదం జరిగింది. ఆవేశంతో హిమబిందు ను కాల్వలో ముంచి చంపేశాడు. 
కారణమేదైనా.. ప్రేమికుల నమ్మకాన్ని నిలువునా పాతిపెట్టాడు బలరాం రెడ్డి.