
పెళ్లి చేసుకుంటానంటే జీవితాన్ని అర్పించడానికి సిద్దపడింది.
ఏడడుగులు నడిచేరోజు దగ్గర పడుతుంటే సంబరపడిపోయింది.
బతికినంత వరకు అండగా ఉంటాడనుకుంది కాని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు.
కృష్ణ జిల్లా, సిద్ధార్థ నగర్ కు చెందిన బి.మురళి నాయక్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకున్నారు, పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి జనవరి 4 న పెళ్లి నిశ్చయించారు. జనవరి 3 న మురళి నాయక్ గ్రామం విడచి పరారయ్యాడు. యువతి మనస్తాపాo చెంది జనవరి 21 న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. ఫిబ్రవరి 7 న నూజివీడు పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు.
టైంపాస్ కోసం ప్రేమించి ప్రేమ ముసుగులో ప్రేమించిన వారిని మోసం చేయకండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి