7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

చైనా, అమెరికా అమ్మాయిలు VS తెలుగు అబ్బాయిలు = ప్రేమ

దేశాలు వేరు, భాషలు వేరు, 
కులాలు వేరు, మతాలు వేరు అయినా ప్రేమ కలిపింది ఇద్దరిని. 
ఇరువురి సంప్రదాయాలు వేరు అయినా మనసు చేసింది ఒక్కటి. 

మన దేశంలో ఉంటూ...  
ఒకే ప్రాంతంలో నివసిస్తూ...  
కులాలు వేరని, మతాలు వేరని ప్రేమికులను విడదీసి ప్రాణాలు పోయేలా చేస్తున్నారు. 
వారి ప్రేమను అర్థం చేసుకోక వారి ఆశను, ఆనందాన్ని చంపేస్తున్నారు. పెద్దలు మీ పిల్లల మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితాంతం ఆనందంగా బతకడానికి తోడ్పడండి. 

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడికి చేరి హిందూ సంప్రదాయాన్ని గౌరవించి వివాహం చేసుకొని ప్రేమకు అందరు ఒక్కటే అని నిరూపించారు ఈ ప్రేమ జంటలు.
చైనా కు చెందిన టెoగ్ మిన్, చెన్నై కి చెందిన శ్రీరామ్ మనియంలు   ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పుట్టపర్తిలోని దుర్గామాత ఆలయంలో ఫిబ్రవరి 6 న వివాహం చేసుకున్నారు. 

అమెరికా కు చెందిన క్లారిస, పీలేరు కి చెందిన విష్ణు రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో తిరుమలలో ఫిబ్రవరి 6 న వివాహం చేసుకున్నారు. 

వీరి ప్రేమమైక జీవితం ఆనందంగా, ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి