
ప్రేమ అంటే తెలియని వయసు పిల్లలు కూడా ప్రేమ అనే పదం వింటున్నారు,
ప్రేమ పాటలు పాడుతున్నారు.
యువత మాత్రం ప్రేమపై మక్కువ పెంచుకున్నారు.
జీవితంలో ప్రేమించడం అనేది లేకపోతే అర్థం లేదంటున్నారు.
ప్రేమించడం మంచిదే కాని ఆ ప్రేమ స్వచ్చమైనదా లేదా అనే విషయాన్ని మరచిపోతున్నారు.
కొందరు టైంపాస్ కోసం ప్రేమించి బ్రేక్ అప్ పార్టీ ఇచ్చి
ఆనందంగా విడిపోతున్నారు.
కొందరు ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోతున్నారు.
కొందరు ప్రేమకోసం నేరాలు చేస్తున్నారు.
కొందరు ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తున్నారు.
కొందరు ప్రేమకోసం ప్రాణాలు కోల్పోతున్నారు.
వీటన్నిటిని గమనిస్తే ప్రేమ అనేది గొప్పది. ప్రేమంటే సరైన అవగాహన లేక తప్పుడు ఆలోచనలతో తప్పుడు మార్గాలను ఎన్నుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమలో పవిత్రత, నిజాయితి ఉంటే నేరాలు ఘోరాలు జరగవు. ఎందుకంటే ప్రేమ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది కనుక తొందర పాటుతో ఏ నిర్ణయం తీసుకోదు. ఆలోచనతో వేసే ప్రతి అడుగు అర్థవంతంగా ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల మండలం గాంధీ నగర్ కు చెందిన వనితసాగర్, అదే ప్రాంతానికి చెందిన సాయిశని రెండేళ్ళుగా ప్రేమించుకున్నారు, కలసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన రాగానే సాయిశని పరారయ్యాడు. వనిత ఆమె కుటుంబ సభ్యులు కలసి ప్రియుడి ఇంటివద్ద న్యాయం కోసం మౌన దీక్ష మొదలుపెట్టారు.
నల్గొండ జిల్లా, చండూరు మండల కేంద్రంలోని బేత వెంకన్నయాదవ్, పల్లెంల గ్రామానికి చెందిన బద్దుల మౌనిక ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాని పెద్దలు అంగీకరించలేదు. ఇరువురు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని గమనించిన స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం, మైసూర్, నగెనహళ్లి నివాసి స్వామి అనే వ్యక్తి ఓ విద్యార్థిని ప్రేమించమని వెంటపడ్డాడు. అమ్మాయి ప్రేమను అంగీకరించలేదని కొడవలితో దాడికి దిగి ఆమెను గాయపరిచాడు. గమనించిన స్థానికులు స్వామికి దేహశుద్ది చెశారు. ఇరువురిని ఆసుపత్రిలో చేర్పించారు.
వీరంతా ఆలోచించి ముందడుగు వేసి ఉంటె ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఆ సమస్యలకు పరిష్కారం దొరికి ఉండేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి