1, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రేమకున్న నమ్మకాన్నే చంపేశాడు.

గాలి మీద నమ్మకం... ఎక్కడికెళ్ళినా ఊపిరినిస్తుందని. 
ప్రియుడు ఊపిరనుకుంది. 
నీటి మీద నమ్మకం ... తాగితే దాహం తీరుస్తుందని. 
ప్రియుడు నీరనుకుంది. 
గుండెమీద నమ్మకం... ఎన్ని కస్టాలోచ్చినా బతుకుతానని. 
మనసైనవాడు తన హృదయం అనుకుంది. 
గాలి సుడిగాలై నమ్మకాన్ని చుట్టుముట్టింది..  
నీరు మనసును ముంచింది.. 
గుండె క్రూరంగా మారి ప్రేమను చంపేసింది. 

సహనాన్ని లోకువ చేసుకున్నావు, నిన్ను ప్రేమిస్తున్నానంటే ఇంట్లో వాళ్ళు కొట్టారు... భరించింది. 
నీతో కలసి బతకాలనుకుoటున్న్నానంటే ఉద్యోగం మాన్పించారు... సహించింది. 
నువ్వు రమ్మంటే.. నీ మీద నమ్మకంతో పెద్దలకు అపద్దం చెప్పి అడుగు బైటపెట్టింది హిమబిందు. 
నమ్మకాన్ని కాలరాశావు, 
ఆమె ధైర్యాన్ని.. ఆమెను.. నీ చేతులతో చంపేశావు.. 
నీకు ఇది న్యాయమా...? 

కర్నూలు నగరానికి చెందిన హిమబిందు, బలరాం రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దలకు విషయం తెలిసి ప్రేమను కాదన్నారు. హిమబిందు ఉద్యోగం మాన్పించి ఇంట్లో ఉంచారు. డిసెంబర్ 24 న బర్త్ డే పార్టీ ఉందని చెప్పి బైటికోచ్చింది. నేలరోజులతర్వాత ప్రాణాలు కోల్పోయిందని  తేలింది. ప్రియుడు  బలరాం రెడ్డి శిరువెల్ల పరిదిలోని నల్లమల ప్రాంతానికి తీసుకెళ్ళి అనుమానించి మాట్లాడడంతో ఇరువురిమద్య వాగ్వాదం జరిగింది. ఆవేశంతో హిమబిందు ను కాల్వలో ముంచి చంపేశాడు. 
కారణమేదైనా.. ప్రేమికుల నమ్మకాన్ని నిలువునా పాతిపెట్టాడు బలరాం రెడ్డి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి