14, ఆగస్టు 2014, గురువారం

ప్రేమకు స్వాతంత్ర్యం ఎప్పుడు?

కులమతాల అడ్డుగోడల మధ్య
 ప్రేమికులకు స్వేఛ్చ ఎక్కడ?

పేద ధనిక తేడాల మధ్య 
ప్రేమకు స్వాతంత్ర్యం ఎప్పుడు?

పెద్దలను కాదన్న ప్రేమికులకు 
జీవించే హక్కు ఎక్కడ ?

పెళ్లి చేసుకున్న జంటలకు 
సమానత్వపు హక్కు ఎప్పుడు ?





28, జూన్ 2014, శనివారం

నా మనసుకు ఎన్ని ఊహలు

ఆకాశానికి ఇన్ని రంగులు ఎవరు వేసారబ్బా... 
బహుషా నిన్ను చూసిందేమో 

గాలికి ఇన్ని పరిమళాలు ఏంటబ్బా ... 
నీ కురులు తాకిందేమో 

నది జలాలకు ఇన్ని రుచులు ఎలా వచ్చాయబ్బా...
 నీ పాదాలు స్పర్శిన్చినట్లుందే

నా మనసుకు ఎన్ని ఊహలు వస్తున్నయబ్బా ....
 నీ మనసులో చేరిందేమో 

24, జూన్ 2014, మంగళవారం

మన రెండు మనసులు పెనవేసుకున్నాయని....

రెండు పెదవులు కలిస్తే ... 
నీ పేరే పలుకుతాయి 

రెండు పాదాలు కదిలితే... 
నీ వైపే నడుస్తాయి 

రెండు కళ్ళు చూస్తే... 
నీ రూపంతో కనులు నిండుతాయి

రెండు రెప్పలు మూత పడితే... 
నీ ఉహలు కలలో మెదులుతాయి

మన రెండు మనసులు పెనవేసుకున్నాయని   
ఇవన్నీ చెప్పకనే చెబుతున్నాయి

15, జూన్ 2014, ఆదివారం

నీ మది చేరాలని....

సముద్రంలోని అలలకు ఎంత ఆత్రుతో నీ పదాలను స్పర్శించాలని....  
ఎగిరి పడుతున్నాయి 
సంధ్యా సమయ గాలికి ఎంత ఆశో నీ కురులను తాకాలని.... 
పరుగులు తీస్తోంది
చందమామకు ఎంత తొందరో నీ మోముపై మెరవాలని... 
భానుడు అస్తమించాకుండానే మిరుమిట్లు గొలుపుతున్నాడు 
మేఘానికి ఎంత ఇష్టమో నీ మేనుపై కురవాలని... 
తొలకరి చినుకులై వర్షిస్తోంది 
నా మదికి ఎంత ఉబలాటమో నీ చెంత చేరాలని... 
పక్కనే నడుస్తున్నా నీ నామ జపం చేస్తోంది 



8, మే 2014, గురువారం

యువకుడికి.... ప్రేమికుడికి తేడా ఏంటి?

యువకుడికి ఒకటే వెన్నెల 
ప్రేమికుడికి ప్రియురాలి నవ్వుతో కలిపి రెండు వెన్నెలలు. 

యువకుడికి చల్లదనం కావాలంటే ఏసీ కావాలి
ప్రేమికుడికి చెలి కురులను తాకిన గాలి చాలు. 

యువకుడికి  తోడు లేకుంటే ఒంటరి 
ప్రేమికుడికి సఖి ఊహలు ఎప్పుడూ వెంట ఉంటాయి. 

యువకుడికి ఈ లోకం ఒక్కటే తెలుసు 
ప్రేమికుడికి ప్రియురాలి లోకం అదనం. 

3, ఏప్రిల్ 2014, గురువారం

ప్రేమ వయసు తెలుసా...?

ప్రేమ చాలా గొప్పది. ప్రేమను వర్ణించడం చాలా కష్టo. 
ప్రేమకు పవిత్రత, నమ్మకం, వివేచన చాలా అవసరం. 

జీవితాన్నిఅందుకోవడానికి పరుగులు తీయాల్సిన పాదాలు ప్రేమ వైపు అడుగులు వేస్తున్నాయి.
ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో ఎవరిని పడితే వారిని నమ్మి, మోసపోయి ప్రాణాలు తీసుకోవడం 
సరి కాదు. 
l,k,g చదవడం మొదలు పెట్టినప్పటినుండి వయసు ప్రకారమే చదువు ముందుకుపోతుంది.  
l,k,g చదివే పిల్లలు 10th ఎగ్జామ్స్ రాయలేరు. 
అలాగే ప్రేమకు కూడా ఒక వయసు, ఒక సమయం అవసరం. 
అది నిజమా కాదా అనే యోచించే వివేచన అవసరం. 

నల్గొండ జిల్లా, గుండ్రపల్లి గ్రామానికి చెందిన మాధవి(ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది) , సైదులు ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పరారిలో ఉన్నాడు.  

1, ఏప్రిల్ 2014, మంగళవారం

తప్పు ఎవరిది...?

అన్యాయo, అవినీతి, అక్రమాలు, మోసాలు రాజ్యమేలుతున్నాయి. 
ఘోరాలు నేరాలు నివాసాన్ని నిర్మించుకున్నాయి.  
అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయి. 
వీటన్నిటికన్నా నీచమైనదా ప్రేమ....?

ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనగానే వ్యతిరేకత...ఎందుకు? 
ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలపట్ల చెడు అభిప్రాయం... ఎందుకు?  
ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచిస్తే వారు కోరుకున్న జీవితం వాళ్లకు అందించిన వారు అవుతారు కదా.. 
కళ్ళ ముందు కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉండాల్సిన జీవితాలను మీ కోప తాపాలతో కడతేర్చారు. 
కోల్పోయిన ప్రాణాలను తిరిగి రప్పించగలరా...? 
వీరిరువురిని కలిపి నూరేళ్ళ జీవితాన్ని పండించగలరా...?   

హైదరాబాద్, మేడ్చల్ మండలం, చంద్రశేఖర్ అదే కాలనీకి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెద్దలు అంగీకరించకపోవడంతో 29.3.2014 న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. 31.3.2014 న గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్ పరిదిలో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్బాయి తల నుజ్జునుజ్జయింది. అమ్మాయి మృతదేహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయింది. 

చావడానికి అంత సాహసం చేయగలిగినవాళ్ళు కలసి బతకడానికి ధైర్యం చేయలేకపోయారా..? ఓ నిమిషం ఆలోచించి ఉంటే మీరు కోరుకున్న జీవితాన్ని అందుకునేవారు. 

30, మార్చి 2014, ఆదివారం

ఏటా నాకు ప్రేమ ఉగాది

ప్రియురాలు కోప్పడిన కారం 


ప్రేయసి అలిగిన వగరు 

ప్రియసఖి బాధలో  చేదు 

ప్రాణ చెలి అలకలో పులుపు 

హృదయ విరహంలో ఉప్పు 

ప్రాణ సఖి ముద్దులో తీపి 

ఏటా నాకు ప్రేమ ఉగాది 

ఈ సారి జయ సంవత్సరాది 

28, మార్చి 2014, శుక్రవారం

నెమలికి నాట్యం నేర్పిందెవరు?

కోకిలమ్మ... కోకిలమ్మ... నీకు పాటలు నేర్పిందెవరు అంటే... 
నీ గాత్రమని చెప్పింది. 

నెమలి... నెమలి...  నీకు నాట్యం నేర్పిందెవరు అంటే... 
నీ నడకను చూపింది. 

వెన్నెలమ్మ... వెన్నెలమ్మ... నీకు ఇంత చల్లదనం ఇచ్చిందెవరు అంటే... 
నీ చూపని వివరించింది. 

మల్లె పువ్వమ్మా... మల్లె పువ్వమ్మా.. 
నీకు ఇంత మృధుత్వం ఎలా వచ్చిందంటే... 
నీ స్పర్శని సెలవిచ్చింది. 


27, మార్చి 2014, గురువారం

కన్న బిడ్డల సంతోషo కన్నా కులమతాలు గొప్పవా...?

బిడ్డ పుట్టగానే ఆనందంతో గంతులేస్తారు 
బుడి బుడి అడుగులేస్తుంటే మురిసిపోతారు 
చిలక పలుకులు పలుకుతుంటే పరవశిస్తారు 
పెరిగి పెద్దవారైతే భవిష్యతు గురించి ఆరాఠపడతారు
ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డ మనసును అర్థం చేసుకోలేరా..?

ప్రేమను పంచి.. ప్రేమతో పెంచి..  ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు తమ బిడ్డలు మరో వ్యక్తిని ప్రేమించారని తెలియగానే కులం అనే పొరలు కమ్మి..  అది పెద్ద తప్పుగా భావించి కఠినoగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయిన ప్రేమికులు. 

మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొత్త పల్లికి చెందిన రవి.. లావణ్య కొంతకాలంగా ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల మద్య గొడవలు జరిగాయి. కొద్దిరోజుల తరువాత లావణ్య ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల తరువాత విషయం తెలిసిన రవి 25. 3. 2014 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

26, మార్చి 2014, బుధవారం

ప్రేమ రుతువులివి

నువ్వు నవ్వితే పువ్వుల వసంతం 

నువ్వు అలిగితే వేడి గ్రీష్మం 

నువ్వు మాట్లాడితే ముత్యాల వర్షం 

నువ్వు చూస్తే  శరద్ వెన్నెల 

నువ్వు నడిస్తే హేమంత చల్లదనం 

నువ్వు కోప్పడితే శిశిర విహీనం 

24, మార్చి 2014, సోమవారం

ఆప్యాయత అనురాగాలతో పెంచి.. అమానుషంగా అంతం చేసి..

మనసు లేని, మాటలు రాని హానికరమైన మూగ జీవి విషసర్పం. 
తాను పెట్టిన గుడ్లను ఆకలికి తాళలేక ఆ గుడ్లను మింగేస్తుంది. 

మనసెరిగి, మాటలు నేర్చిన మనిషి.. మానవత్వాన్ని మరిచి మరమనిషిలా బతుకుతున్నారు. 
కుల మతాల పిచ్చితో  మాతృత్వాన్ని మంటగలిపి, ఒంటినిండా విషాన్ని నింపుకొని జీవిస్తున్నారు. 

గుంటూరు జిల్లా, నగరంలోని రాజెంద్రనగర్ కు చెందిన దీప్తి, తన సహోద్యోగి కిరణ్ కుమార్  గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వీరి కులాలు వేరు కావడంతో దీప్తి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పలుమార్లు ఒప్పించాలని ప్రయత్నించినా నీరాకరించాడంతో 21. 3. 2014 న హైదరాబాద్ లోని ఆర్యసమాజ మందిరంలో వివాహం చేసుకున్నారు. విషయం తల్లిదండ్రులకు చేరవేశారు. కులాంతర వివాహం చేసుకొని పరువు తీసిందని పదకం వేసి దీప్తి తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకొని నాగదేవత సన్నిదిలో దండలు మార్చుకోవడం తమ ఆచారమని నమ్మించి వారిని గుంటూరు కు తీసుకోచి, దీప్తిని తమ ఇంటికి తీసుకెళ్ళి చున్నీతో ఉరి పోసి హత్యచేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. 

తల్లిదండ్రులారా... 
కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించి కన్న బిడ్డను కడతేర్చారు. 
ప్రాణం తీస్తే పరువు నిలబడుతుందా...? 
కులమతాలు కిరీటాలు పెడతాయా...? 

17, మార్చి 2014, సోమవారం

చందమామ ఎందుకు తెల్ల ముఖం వేశాడు?

ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పగలు పశ్చిమ ఒడిలో ఒదుగుతోంది... 
వెచ్చని ఊహల రేతిరిని ఆకాశం అలంకరించుకుంటోంది. 
చుక్కలు మేఘాల చాటున తల దాచుకున్నాయి... 
నా  పక్కన నడుస్తున్న చుక్కను చూసి... 
చందమామ తెల్ల ముఖం వేశాడు నా అదృష్టం చూసి ... 

13, మార్చి 2014, గురువారం

మను షులను ప్రేమికులుగా చేయాలంటే ?

హృదయం తెరవడానికి 
ఒక చూపు చాలు... 
పువ్వులు పూయించడానికి 
ఒక నవ్వు చాలు... 
పుడమిని స్వర్గం చేయడానికి 
ఒక చాలు... 
మనుషులను ప్రేమికులను చేయడానికి... మంచి మనసు చాలు... 


 

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

ప్రియురాలిని పొందాలనుకొని..ప్రాణాలు పోయేలా చేశాడు

ప్రేమకు ముఖ్యమైనవి రెండు లక్షణాలు. 
ప్రేమను ఇవ్వడం, ప్రేమను పొందడం. 
ప్రేమిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడదు. 
ప్రేమ కోసం ఏ పని చేయడానికైనా, 
ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగాఉండడం. 
ఒక్క మాటలో చెప్పాలంటే...త్యాగం 

ప్రేమించే వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అప్పుడే త్యాగం అనే పదానికి అర్థం తెలుస్తుంది. ప్రియురాలు దూరమౌతుంది అని తెలిసినప్పుడు తన పరిస్థితిని అర్థం చేసుకొని తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. తనను బలవంతంగా సాధించాలనుకోకూడదు. 

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వేదించడంతో, ఏమి చేయలేని పరిస్థితిలో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.  

హైదరాబాద్, రాయదుర్గం, గచ్చిబౌలి రాజీవ్ నగర్ కు చెందిన హేమలత, పోచయ్య ప్రేమించుకున్నారు. ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం హేమలత తన తల్లికి చెప్పింది. వీరి పెళ్ళికి అంగీకరించలేదు. హేమలతకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకుంటావని బెదిరించ సాగాడు. బెదిరింపులను భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

24, ఫిబ్రవరి 2014, సోమవారం

జంతువులు మనిషిలా చేస్తుంటే... మనిషి జంతువులా మారిపోతున్నారు.

వీదిలో తిరుగుతున్న కుక్కలకు ఒక్కసారి అన్నం పెడితే మరుసటిరోజు వస్తాయి. 
అలాగే పెడుతుంటే అవి ఇంటి పరిసరాల్లోనే ఉండిపోతాయి. 
వాటికి ఒక్క పూట  అన్నం పెట్టినందుకే నమ్మకంగా ఉంటాయి. 
మనకు అపాయం ఉందంటే ఎంతకైనా తెగించి కాపాడతాయి. 
మాటలు రాని మూగజీవులు అంత విశ్వాసం చూపుతుంటే 
మాటలు వచ్చి, తెలివి తేటలు ఉన్న మనిషి మాత్రం జంతువులా ప్రవర్తిస్తున్నాడు. 

కర్ణాటక, మంగళూరు, అష్రఫ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. నగర సమీపంలోని చెంబుగుడ్డ ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారయత్నం చేశాడు. యువతి కేకలు వేయడంతో అష్రఫ్ పారిపోయాడు. పోలీసులు ఆ కామాందుడికోసం గాలిస్తున్నారు. 

అమ్మాయిలు ఇలాంటి వారి ఉచ్చులలో పడకుండా, బతుకు బజారున పడకుండా జాగ్రత్త పడండి. 

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

మోసగాడికి గుణపాఠం చెప్పేదెవరు..?

ప్రేమిస్తున్నాను అనగానే నమ్మేస్తారు.. 
జీవితాంతం నీతో నడవాలి అంటే అడుగేస్తారు... 
నువ్వు లేకుండా బతకలేను అనగానే సర్వం అర్పించేస్తారు... 
జీవితం నాశానమయ్యాక ప్రాణాలు తీసుకుంటారు. 

అమ్మాయి జీవితంలో ఓడిపోతే ఇక బతకడమే వ్యర్థం అనుకుంటారు. 
అలా పిరికివారిలా ఆలోచిస్తే నిన్ను నీవే బలైపోయావు. 
మోసం చేసిన వ్యక్తికి శిక్ష పడేదెలా...? 
అలాంటివారిని ఉరికే వదిలేస్తే రేపు ఇంకొకరి జీవితాన్ని 
ఇలాగె నాశనం చేస్తారు.  
ధైర్యం చేసి ముందడుగు వేసింటే అన్యాయాన్ని అరికట్టిన 
ఆదర్శవంతురాలివి అయ్యెదానివి. 
మోసపోకుండా ఆడపిల్లలకి గుణపాఠంగా నిలిచేదానివి.   

ఖమ్మం జిల్లా, అశ్వాపురం మండలం, చింతిర్యాలగూడెం కు చెందిన రాధిక, అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా అడిగితే వెంకటనారాయణ నిరాకరించడంతో మనస్తాపం చెందిన రాధిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

అమ్మాయిలు నమ్మిన వారికి జీవితం అర్పిస్తారు.. 
నమ్మక ద్రోహం చేస్తే జీవితమే లేకుండా చేస్తారు.. 
అని నిరూపించే ఆత్మ ధైర్యంతో ముందుకు అడుగు వెయ్యండి.