25, ఫిబ్రవరి 2014, మంగళవారం

ప్రియురాలిని పొందాలనుకొని..ప్రాణాలు పోయేలా చేశాడు

ప్రేమకు ముఖ్యమైనవి రెండు లక్షణాలు. 
ప్రేమను ఇవ్వడం, ప్రేమను పొందడం. 
ప్రేమిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడదు. 
ప్రేమ కోసం ఏ పని చేయడానికైనా, 
ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగాఉండడం. 
ఒక్క మాటలో చెప్పాలంటే...త్యాగం 

ప్రేమించే వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అప్పుడే త్యాగం అనే పదానికి అర్థం తెలుస్తుంది. ప్రియురాలు దూరమౌతుంది అని తెలిసినప్పుడు తన పరిస్థితిని అర్థం చేసుకొని తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. తనను బలవంతంగా సాధించాలనుకోకూడదు. 

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వేదించడంతో, ఏమి చేయలేని పరిస్థితిలో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.  

హైదరాబాద్, రాయదుర్గం, గచ్చిబౌలి రాజీవ్ నగర్ కు చెందిన హేమలత, పోచయ్య ప్రేమించుకున్నారు. ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం హేమలత తన తల్లికి చెప్పింది. వీరి పెళ్ళికి అంగీకరించలేదు. హేమలతకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకుంటావని బెదిరించ సాగాడు. బెదిరింపులను భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి