23, ఫిబ్రవరి 2014, ఆదివారం

మోసగాడికి గుణపాఠం చెప్పేదెవరు..?

ప్రేమిస్తున్నాను అనగానే నమ్మేస్తారు.. 
జీవితాంతం నీతో నడవాలి అంటే అడుగేస్తారు... 
నువ్వు లేకుండా బతకలేను అనగానే సర్వం అర్పించేస్తారు... 
జీవితం నాశానమయ్యాక ప్రాణాలు తీసుకుంటారు. 

అమ్మాయి జీవితంలో ఓడిపోతే ఇక బతకడమే వ్యర్థం అనుకుంటారు. 
అలా పిరికివారిలా ఆలోచిస్తే నిన్ను నీవే బలైపోయావు. 
మోసం చేసిన వ్యక్తికి శిక్ష పడేదెలా...? 
అలాంటివారిని ఉరికే వదిలేస్తే రేపు ఇంకొకరి జీవితాన్ని 
ఇలాగె నాశనం చేస్తారు.  
ధైర్యం చేసి ముందడుగు వేసింటే అన్యాయాన్ని అరికట్టిన 
ఆదర్శవంతురాలివి అయ్యెదానివి. 
మోసపోకుండా ఆడపిల్లలకి గుణపాఠంగా నిలిచేదానివి.   

ఖమ్మం జిల్లా, అశ్వాపురం మండలం, చింతిర్యాలగూడెం కు చెందిన రాధిక, అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా అడిగితే వెంకటనారాయణ నిరాకరించడంతో మనస్తాపం చెందిన రాధిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

అమ్మాయిలు నమ్మిన వారికి జీవితం అర్పిస్తారు.. 
నమ్మక ద్రోహం చేస్తే జీవితమే లేకుండా చేస్తారు.. 
అని నిరూపించే ఆత్మ ధైర్యంతో ముందుకు అడుగు వెయ్యండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి