10, ఫిబ్రవరి 2014, సోమవారం

ప్రేమికుల మనసు దోచే దారి..

ప్రపంచంలో ఎన్నో రకాల దుస్తులు తయారు చేయబడ్డాయి, 
వాటిని ఎవరైనా ఉపయోగించవచ్చు అందులో ప్రత్యేకత ఉండదు. 
ప్రేమికుల కోసం ప్రత్యేకమైన 8-బిట్ డైనమిక్ టీషర్టులు తాయారు చేయబడ్డాయి. 
ఇందులో ప్రత్యేకత ఏంటో తెలుసా...? 
ప్రేమికులు ఒకే ప్రాంతంలో తెలియకుండా వేరుగా ఉంటే మనసుకన్నా వేగంగా మీ జాడను పసిగడుతుంది. 
ఎలాగంటారా...? 
ఈ 8-బిట్ డైనమిక్ షర్టుల ముందుభాగంలో 6 హృదయాకారపు గుర్తులుంటాయి. వీటి వెనుక సెన్సార్లు అమర్చడం వల్ల ఈ షర్టులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు దగ్గరకు రాగానే ఆ గుర్తులన్నీ ఎరుపురంగులో మెరుస్తూ వెలుగుతాయి. ప్రేమికులు ఓ అయిదుమీటర్ల దూరం జరగగానే సగానికి పైగా ప్రేమగుర్తులు కాంతిని కోల్పోతాయి. 

మీరు ప్రేమించే వారికి ఈ షర్ట్ బహుమతిగా ఇచ్చి ప్రేమికులరోజు న సర్ ప్రైస్ చేయండి. అంతే కాదండోయ్.. ప్రేమికులరోజున మీ ప్రేమ జంట అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలి.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి