
పునాదిని మామూలు రాళ్ళతో కాక బలమైన రాళ్ళని ఎన్నుకొని నిర్మిస్తాం.
పునాది దృడంగా ఉంటేనే ఇల్లు ఎక్కువ కాలం నిలబడుతుంది.
అది సరిగా లేకపోతే కొంతకాలానికే కూలిపోతుంది.
ప్రేమ కూడా అంతే...
ప్రేమకు పునాది నమ్మకం.
అది లేకపోతే ప్రేమ ఎప్పటికి నిలబడదు.
నమ్మకమే మనసును, మనిషిని ముందుకు నడిపిస్తుంది.
అది లేకపోతే చిన్న చిన్న మనస్పర్తలకే ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న
ప్రేమ మందిరం కుప్పకూలి పోతుంది.
ప్రేయసి పైన నమ్మకం లేక అనుమానపు బాణాలు వేయడంతో అవి వారి గుండెల్లో దూసుకుపోయి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
డిల్లీ, బరేలికి చెందిన వివేక్ శంకర్, అమన్ దీప్ కౌర్ ప్రేమించుకున్నారు. అమన్ కొంత కాలంగా మన్ ప్రీత్ తో సన్నితంగా ఉండటంతో అనుమానించాడు దీనితో వీరి మద్య గొడవ జరిగింది. ఇద్దరు మనస్తాపం చెంది వేరు వేరు అపార్ట్ మెంట్స్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి