9, ఫిబ్రవరి 2014, ఆదివారం

గుండెలోని ప్రేమ తలగడగా మారి జోల పాడితే...

ప్రేమ అనేది ఓ తియ్యటి అనుబూతి. 
ప్రేమించే మనసుకు మాత్రమే తెలుస్తుంది ఆ తియ్యదనం ఏమిటో... 
ఇష్టమైన వాళ్ళకోసం ఏదైనా చేయాలంటే మనసు ఉరకలు వేస్తుంది. 
గుండెల నిండా నింపుకున్న ప్రేమను ఎలా చెప్పాలో తెలియక, 
గుండెలోని ప్రేమను దాచలేక సతమతమౌతున్న ప్రేమికులకు ఓ చక్కటి అవకాశం దొరికింది. 

ప్రేమను మాటలతోనా, బహుమతుల రూపంలోనా, క్రియలతోనా... ఎలా చెప్పాలా అని ఆందోళన పడకుండా ఓసారి ఈ ప్రత్యేకమైన ప్రేమ కానుకను చూడండి మీ ప్రియుల హృదయాలు దోచుకోవడానికి ఉపయోగపడుతుందేమో. 

"డి లైట్ యువర్ హార్ట్" అనే కుషన్ ప్రేమికులకోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. కుషన్ పైభాగమంతా బట్టతో చేసిన గులాబీ పువ్వులుండి లోపల ఎల్ఈడి లైట్లు ఉంటాయి . కింది భాగంలో ఉండే బటన్ నొక్కగానే ఆ లైట్లు వెలిగి, రాత్రి పూట దిండు మెరిసిపోతున్న గులాబీ గుత్తిలా దర్శనమిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 4 గంటల పాటు చక్కగా వెలుగుతుంది ఈ హార్ట్ కుషన్.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి