
త్యాగమంటే ఏమిటో నా కోసం నువ్వేసిన అడుగు చెప్పింది.
ప్రేమంటే ఏమిటో నువ్వు చూపే ఆత్మీయత చూపింది.
నాకు నేనే తెలియదు...నీకు తెలిసినంతగా...
నా గురించి నాకే అర్థం కాదు... నువ్వు అర్థమైనంతగా...
నేను నేను కాదు... నువ్వైనంతగా...
అందుకే....
నీ చూపుల్లో మార్గo వెదుక్కుంటాను.
నీ మాటల్లో నిర్దేశం చూస్తుంటాను.
నీ చేతల్లో నా శక్తిని పట్టుకుంటాను.
నీ ఆలోచనల్లో నా ఉనికి చాటుకుంటాను.
అమ్మ మమకారం... చెల్లి అనురాగం... అక్క అభిమానాన్ని...
స్నేహితురాలి తోడ్పాటుని... ప్రియురాలి మనసుని... కలిపి నిన్ను చేసి...
నా కోసం పంపిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.
ప్రేమతో....
నీ ప్రియుడు.
నీ చూపుల్లో మార్గo వెదుక్కుంటాను.
రిప్లయితొలగించండినీ మాటల్లో నిర్దేశం చూస్తుంటాను.
నీ చేతల్లో నా శక్తిని పట్టుకుంటాను.
నీ ఆలోచనల్లో నా ఉనికి చాటుకుంటాను.
chaalaa baagundi:-):-)
mee prothsham... marintha shakthi nisthundi
తొలగించండిmee prothsham... marintha shakthi nisthundi
తొలగించండి