
గుండెల్లో పెట్టుకొని ఆరాధించడం.
గుండెలు మండేలా బాద పెట్టడం కాదు.
ప్రేమిస్తుంటే..ప్రేమను పొందడం కోసం ఆరాట పడడం.
ప్రాణం పోయేలా వేధించడం కాదు.
సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి.. ప్రాణo పోతే తిరిగి రాదు.
ప్రేమిస్తున్నానంటూ అల్లరి చేస్తుoటే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి, పెద్దల సహకారంతో ఆకతాయిల ఆట కట్టిoచాలి, స్టేషన్లో కేస్ పెట్టాలి, అలాంటివారికి బుద్దివచ్చేలా చేయాలి. పిరికిదానిలా ప్రాణాలు తీసుకొని నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ధైర్యంగా క్షణమైన ఆలొచించలేకపోయావా...?
కృష్ణ జిల్లా , రాజీవ్ నగర్ కి చెందిన ఊర్మిళ అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన ప్రకాష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అతడి వేదింపులు బరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది, అయినా కూడా ప్రకాష్ ఆకతాయి వేదింపులను ఆపలేదు. మనస్తాపం చెందిన యువతి డిసెంబర్ 16 న ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఫిబ్రవరి 19 న మృతి చెందింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి