
ఆకలేసినప్పుడు గోరుముద్దలు తినిపించావు,
చేయి పట్టుకొని నడకను నేర్పించావు,
బుజాలపైన ఎక్కించుకొని ఆడించావు,
గుండెలకు హత్తుకొని జోలపాడి నిద్రపుచ్చావు, అడిగినవన్నీ కాదనకుండా కొనిచ్చావు,
అమ్మలా ఆదరించావు, ప్రేమించావు...
మరెందుకు నాన్నా నా మనసును అర్థం చేసుకోలేకపోయవు..?
కూతురిని ప్రాణప్రదంగా పెంచుకున్న కన్నతండ్రి.. తన ఇష్టాన్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు.
గుంటూరు జిల్లా, యర్రగుంట్లపాడుకు చెందిన గౌతమి, రమేష్ 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని వారికి చెప్పకుండా ఫిరంగిపురంలోని విజయదుర్గాదేవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు.వీరి పెళ్లి విషయం తెలిసిన గౌతమి తండ్రి అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పద్మావతి గుండె పగిలిపోయింది.
తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాటిని కుప్ప కూల్చేసి వెళ్ళిపోతే వారి గుండెలు పగిలిపోవా..?
ఒక్కసారి మీ ఆలోచనలను వారి ముందు పెట్టి ఉంటే ఈ రోజు మీ తండ్రి ప్రాణాలతో ఉండేవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి