
ఎంత వికసించినా విరగకుండా చూస్తుందని.
పక్షికి రెక్కలపై నమ్మకం...
ఎంత ఎత్తుకు ఎగిరినా పడకుండా చూస్తాయని.
చెట్టుకు భూమిపై నమ్మకం...
ఎంత ఎదిగినా కూలిపోకుండా చూస్తుందని.
ప్రియురాలికి ప్రియుడిపై నమ్మకం...
తన జీవితాన్ని కాపాడతాడని.
తావి,భూమి,రెక్కలు వాటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయి.
ప్రియుడు మృగాడై నమ్మకంతో పాటు ప్రియురాలినీ చంపేస్తున్నాడు.
ప్రాణంగా ప్రేమించింది, సర్వస్వం అర్పించింది, జీవితాంతం కలసి బ్రతకాలనుకుంది, పెద్దలను ఒప్పించింది, మరో 5 రోజుల్లో పెళ్లి, ఎంత సంబరపడిందో... మంత్రాలయం మండలం చిలకలదోణ గ్రామానికి చెందిన మార్తమ్మ.
ప్రాణం తీసైనా వదిలించుకోవాలనుకున్నాడు. అలా బైటికి వెల్లోద్దామని పిలిచాడు, నమ్మకంగా ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు, చంపాడు. కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మార్తమ్మతోపాటు ఆమె ప్రేమను నామరూపాల్లేకుండా చేశాడు. అదే గ్రామానికి చెందిన యోహాన్.
ఫిబ్రవరి 26 న మార్తమ్మకు,యోహాన్ కు పెళ్లి అని ముద్రించిన పత్రిక కన్నీళ్లతో తడిసిపోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి