31, జనవరి 2014, శుక్రవారం
పిరికితనం ప్రాణం తీసింది

ధైర్యంగా వెళ్లి పోలీసు స్టేషన్లో
ఫిర్యాదు చేయడమో,
ఇంట్లో వాళ్ళకు చెప్పడమో, లేక
ఫ్రెండ్స్ సహాయం తీసుకొని
అతనికి బుద్ది వచ్చేలా చేయకుండా పిరికి దానిలా ప్రాణాలు తీసుకుంటే ఎలా..?
అలాంటి వారికి శిక్ష పడేలా చేసింటే ఇలాంటి సమస్యలు ఎదురుకునే యువతకు ఆదర్శప్రాయంగా నిలిచెదానివి. ఒక్క క్షణం ధైర్యంగా ఆలోచించలేక పోయావా..?
నిజమైన ప్రేమ ఏంటో తెలియక మూర్ఖంగా ప్రవర్తించి ఓ ఆమ్మాయి ప్రాణాలు కోల్పోయేoదుకు కారకుడయ్యాడు రవి.
అనంతపురం జిల్లా, తాడిమర్రి (బత్తలిపల్లి) మండల కేంద్రానికి చెందిన ప్రియదర్శిని అనే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన రవి తనని ప్రేమించాలంటూ వేదించడమే కాక ఇంకెవరినైనా ప్రేమిస్తే ప్రియదర్శినిని తన తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించడంతో భయపడ్డ ప్రియదర్శిని జనవరి 30 న విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది.
అమ్మాయిలు ఇలాంటి సంగటనలు చూసిన కళ్ళు తెరువండి. భయపడుతుంటే జీవితమంతా భయంతోనే బతకాలి. సమస్యలు వస్తే ఎదురుకోవడానికి ప్రయత్నించండి. పెద్దల సహాయం, పోలిసుల సహాయం తీసుకోండి. పిరికితనాన్ని వీడి ధైర్యంగా అడుగులు వేయండి.
29, జనవరి 2014, బుధవారం
ప్రేమ..నీ అడుగులు ఎటువైపు...?

ఒకరికి ఒకరు తోడుండడం,
ఒకరిని ఒకరు ధైర్యపరచడం,
ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడం,
ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడం,
ఇద్దరు ఒక్కటై ఆనంద జీవితాన్ని మలుచుకోవడం.
ప్రేమ పేరుతో ఒకరిని ఒకరు అనుభవించడం కాదు.
ప్రేమ మనసును త్రుప్తి పరచడానికి ప్రయత్నిస్తుంది కాని శరీరాన్ని కాదు.
ప్రేమ జీవితాంతం తోడుంటుంది కాని మద్యలో ఒంటరిని చేసి వెళ్ళిపోదు.
ప్రేమకు సరైన అర్థం తెలియక ఆకర్షణనే ప్రేమ అనుకొని యువత మోసపోతున్నారు. ఆ మోసపు వలలో పడిoది ఓ యువతి. తన జీవితం అన్యాయం కాకూడదని న్యాయం కోసం పోరాడుతుంది.
ఖమ్మం జిల్లా, ముదిగొండ గ్రామానికి చెందిన సతీష్ అదే గ్రామానికి చెందిన కట్టకూరి నాగమ్మ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నాగమ్మను లొంగదీసుకున్నాడు. పెళ్లి ప్రస్తావన రాగానే మొఖం చాటేస్తున్నాడు. సతీష్ తో పెళ్లి జరిపించి తనకు న్యాయం చేయాలంటూ నాగమ్మ కుటుంబ సభ్యులు, బందువులు జనవరి 29 న తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష మొదలు పెట్టారు.
ప్రేమించే ముందు ఆలోచించండి, ప్రేమించాక ప్రతీ అడుగు ఆలోచించి వెయ్యండి, వేసే ప్రతీ అడుగు మంచి మార్గంలో వేయండి లేకపోతే జీవితమే దారితప్పిపోతుంది.
ప్రేమికుడి ప్రాణాలు బలికొన్న కర్షకులు

ఏదైనా జంతువు కళ్ళముందు ప్రాణాపాయ స్థితిలో ఉంటె తట్టుకోలేము,
అవి ఆకలితో అలమటిస్తూ కనిపిస్తే వాటి ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తాం.
ఏ సంబందము లేని ఆ మూగ జీవులపైన ఉన్న జాలి, కనికరం మనుషులపైన ఎందుకు ఉండదు...?
ప్రేమించడం.. పాపం కాదు కదా..?
ప్రేమించడం.. హత్య కాదు కదా..?
ప్రేమించడం.. అన్యాయం కాదు కదా..?
ప్రేమించడం.. దౌర్జన్యం కాదు కదా..?
ప్రేమించడం .. వ్యభిచారం కాదు కదా..?
మరి ఎందుకు ప్రేమిస్తే ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణం పోయేలా చేస్తున్నారు...?
ప్రేమించడం పెద్ద నేరంలా భావించి వంశీ నిండు ప్రాణాలు బలితీసుకున్నారు ఓ కర్షక కుటుంబం..
గోదావరిఖని, సీతానగర్ కు చెoదిన వంశీ కృష్ణ , అదే ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇరువురిని దూరంగా ఉంచారు. 3 నెలల క్రితం అమ్మాయి తరపు వారు స్వయంగా కేసు ఉపసంహరించుకున్నారు. తరువాత అమ్మాయి వంశీ కి ఫోన్ చేయడంతో వంశీ తండ్రి జనవరి 26 న పెద్దలను పిలచి పంచాయితి పెట్టాలనుకున్నాడు. అదే రోజు ఉదయం బైటికి వెళ్ళిన వంశీ ఇంటికి తిరిగి రాలేదు. మరుసటిరోజు ఉదయం మహారాష్ట్ర లోని బల్లార్శ రైలు పట్టాలపైన శవమై కనిపించాడు. ప్రేమించినందుకే అమ్మాయి తరపువారు చంపేశారని శవాన్ని యువతి ఇంటిముందు బైఠాయించారు.
28, జనవరి 2014, మంగళవారం
ప్రేమ కోసం ఉన్న ఆరాటం పెళ్ళికి ఎందుకు చూపరు..?

ప్రేమించకముందు ఆ అమ్మాయే కావాలనిపిస్తుంది,
ప్రేమను ఒప్పుకునే వరకు వెంటపడతారు,
ప్రేమను అంగీకరిస్తే సంబరపడిపోతారు,
ప్రేమించాక... సమస్యలు వస్తే సంబంధం లేనట్లు ఉండిపోతారు.
ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెంటపడి ఓ యువతీ ప్రేమను పొందాడు ఓ యువకుడు. పెళ్లి దాక వచ్చేసరికి మౌనం వహించాడు. తననే నమ్ముకున్న యువతి తను లేకపోతే బతకలేననుకుంది, ప్రాణాలు వదులుకోవడానికి సిద్దపడింది.
కృష్ణ జిల్లా, సిద్దార్థ నగర్ కు చెందిన భూక్యా మురళి నాయక్ ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్ళిచేసుకుంటానని నచ్చజెప్పాడు. ఆ యువతీ అందుకు ఒప్పుకుంది. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో పెద్దలందరూ కలిసి పంచాయితీ జరిపారు, మురళి కుటుంబీకులు పెళ్ళికి అంగీకరించలేదు. అందుకు మనస్తాపానికి చెందిన ఆ యువతీ వారి తల్లిదండ్రులను క్షమాపణ కోరుతూ ఓ లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతిని నూజివీడు ఆసుపత్రిలలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
ప్రేమ కోసం ఉన్న ఆరాటం పెళ్ళికి ఎందుకు చూపరు..? ప్రేమ పేరుతో మోసం చేయడం న్యాయమా..?
ప్రేమించిన వ్యక్తిని పొందే ధైర్యం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు..?
ప్రేమలో గుణగణాలు, మంచిచెడుల ఎంపిక అవసరమే....
ఒక డ్రెస్ కొనాలంటే ఆ డ్రెస్ రంగు, నాణ్యత, మన్నిక చూసి
జాగ్రత్తగా కొంటాము.
ఒక వస్తువు కొనాలన్నా అది ఎంత కాలం ఉపయోగపడుతుంది,
క్వాలిటీని చూసి కొంటాము.
కాలుకు వేసుకునే చెప్పులు కొనాలన్నా దాని గురించి తెలుసుకొని
మంచివి కొంటాము.
చిన్న చిన్న వస్తువులనే అలోచించి ఎన్నుకుంటున్నప్పుడు మన జీవిత భాగస్వామి కావాలి అనే వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించరు...?
ప్రేమిస్తున్నా అని చెప్పగానే నమ్మి జీవితాన్ని ఎలా అర్పిస్తారు...?
జీవితాన్ని పంచుకునే వ్యక్తిలోని గుణగణాలు,మంచిచెడులు తెలుసుకోరా...?
తన జీవితం గురించి సరైన వ్యక్తిని ఎంచుకునే విషయంలో విఫలమై,
ప్రేమలో మోసపోయిన ఓ ప్రేమికురాలి ఆవేదన...
ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం లోని సూర్యతండాకు చెందిన బానోతు రజని, అదే గ్రామానికి చెందిన చాందవత్ చందూలాల్ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రజని పెళ్లి చేసుకోవాలని అడిగితే అందుకు నిరాకరించాడు. మరో అమ్మాయిని బద్రాచలం తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన రజని జనవరి 18 తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు వార్గాలవారితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పది రోజులు అవుతున్నా పోలీసులు స్పందించక పోవడంతో ప్రియుడి సోదరుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది.
ప్రేమిచడం తప్పుకాదు, ప్రేమించే వ్యక్తి ఎలాంటివారో తెలుసుకొని ముందడుగు వేయండి లేకపోతే జీవితాంతం బాదలు, అవమానాలు మోస్తూ బతకాలి.
జాగ్రత్తగా కొంటాము.
ఒక వస్తువు కొనాలన్నా అది ఎంత కాలం ఉపయోగపడుతుంది,
క్వాలిటీని చూసి కొంటాము.
కాలుకు వేసుకునే చెప్పులు కొనాలన్నా దాని గురించి తెలుసుకొని
మంచివి కొంటాము.
చిన్న చిన్న వస్తువులనే అలోచించి ఎన్నుకుంటున్నప్పుడు మన జీవిత భాగస్వామి కావాలి అనే వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించరు...?
ప్రేమిస్తున్నా అని చెప్పగానే నమ్మి జీవితాన్ని ఎలా అర్పిస్తారు...?
జీవితాన్ని పంచుకునే వ్యక్తిలోని గుణగణాలు,మంచిచెడులు తెలుసుకోరా...?
తన జీవితం గురించి సరైన వ్యక్తిని ఎంచుకునే విషయంలో విఫలమై,
ప్రేమలో మోసపోయిన ఓ ప్రేమికురాలి ఆవేదన...
ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం లోని సూర్యతండాకు చెందిన బానోతు రజని, అదే గ్రామానికి చెందిన చాందవత్ చందూలాల్ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రజని పెళ్లి చేసుకోవాలని అడిగితే అందుకు నిరాకరించాడు. మరో అమ్మాయిని బద్రాచలం తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన రజని జనవరి 18 తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు వార్గాలవారితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పది రోజులు అవుతున్నా పోలీసులు స్పందించక పోవడంతో ప్రియుడి సోదరుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది.
ప్రేమిచడం తప్పుకాదు, ప్రేమించే వ్యక్తి ఎలాంటివారో తెలుసుకొని ముందడుగు వేయండి లేకపోతే జీవితాంతం బాదలు, అవమానాలు మోస్తూ బతకాలి.
25, జనవరి 2014, శనివారం
ప్రేమ జంటల పెళ్లి మేళం

మహబూబ్ నగర్ జిల్లా, బీ.కే రెడ్డి కాలనీకి చెందిన మౌనిక, సంపత్ ప్రేమించుకున్నారు. 23 తేదిన పెళ్ళిచేసుకున్నారు. గురువారం మౌనిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన ప్రేమికులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, మాకు రక్షణ కలిపించాల్సిందిగా కోరారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంటలకు ఏ సమస్యలు రాకూడదని కోరుకుంటూ, జీవితాంతం ప్రేమకు నిదర్శనంగా.. ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
23, జనవరి 2014, గురువారం
ప్రేమిస్తే..ఆవేశమెందుకు..?

ప్రేమ సున్నితత్వానికి నిర్వచనం. మీ ప్రేమను పెద్దలకు అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించి ఉంటె వారు తప్పకుండా ఒప్పుకునేవారు. పెద్దలను ఎదిరించి ఆవేశంగా ప్రవర్తిస్తే వారు మీ ప్రేమను ఎప్పటికీ ఒప్పుకోరు.

పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో ఆవేశపడ్డ ప్రేమికులు ఆసుపత్రి పాలయ్యారు. ఆలోచనతో అడుగేసింటే వారి ప్రేమ పెళ్ళికి అందరిని ఒప్పించుకునే వారు.
నంద్యాల మండలం, దేవనగర్ కు చెందిన షేక్ పీరా, అదే కాలనీకి చెందిన రామలీల ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలలో తెలిసి వేర్వేరు సామాజిక వర్గాలవారు కావడంతో పెద్దలు అంగీకరించకుండా ప్రేమికులను మందలించారు. షేక్ పీరా కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలిసిన ప్రియురాలు రసాయన మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇరువురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
22, జనవరి 2014, బుధవారం
అమర ప్రేమికుడు అక్కినేని

తెలుగు ప్రజలకు ప్రేమించడం
చెప్పిన వాడు
దేవదాసుగా... ప్రేమ దాసులు ఎలా కావాలో నేర్పిన వాడు
జీవితంలో సఫలమైన...
విఫల ప్రేమికుడు
అక్కినేని మనందరి ప్రేమను వదిలి వెళ్ళిపోయాడు.
ప్రేమకు నగరం నిర్మించిన వాడు...
ప్రేయసికి ప్రేమాభిషేకం చేసిన వాడు...
ప్రేమికులందరికీ ప్రేమ మేఘ సందేశం పంపినవాడు...
ప్రేమకు చలాకి తనం అద్దిన దసరాబుల్లోడు...
తన ప్రేమను మన హృదయాల్లో మిగిల్చి వెళ్ళిపోయాడు.
21, జనవరి 2014, మంగళవారం
కాపాడదాం ప్రేమికులను
పెద్దలు ఒప్పుకోలేదు. విడదీసే ప్రయత్నం చేశారు.
తమ ప్రేమను కాపాడు కోవడానికి... కలిసి బతకడానికి పెళ్లి చేసుకున్నారు.
మీరు కలిసి బతికే కంటే ... చావడమే మాకు ఇష్టమని పెద్దలు
చిన్న మనసుతో తెగేసి చెప్పారు.
ప్రేమను బతికించు కోవడానికి కర్నూలు పోలీసులను ఆశ్రయించారు.
నందికోట్కూరు మండలం అల్లూరుకు చెందిన
సురేష్, తేజస్వనిల పరిస్థితి ఇది.
వీరి ప్రేమైక జీవితానికి ఎలాంటి ఆపద రాకుడదని కోరుకుంటోంది
ప్రేమ హృదయం...
చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి ఉండదా..?

'కోటి విద్యలు కూటికోసమే" అనే సామెత విన్నారా..?
ఎంత కష్టపడ్డా, ఎన్ని సంపాదించినా కడుపునిండా బోంచేసి త్రుప్తి పొందడం కోసమే. అలా త్రుప్తి లేని సంపద ఎంత ఉన్నా వ్యర్థమే.
'ప్రాణంగా ప్రేమించుకున్నాం' అనే పదం తెలుసా..?
ఆ మాటకు అర్థం.. ఎన్ని బాదలొచ్చినా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని కష్టాలెదురైన, ఏ పరిస్థితిలోనైనా కలసి సంతోషంగా జీవించడం. అలా బతకలేని ప్రేమ వ్యర్థం.
ప్రేమలో అంత గొప్ప జీవితం దాగి ఉన్నప్పుడు కలసి బతకాల్సిందిపోయి బతుకును నాశనం చేసుకున్నారు ఓ ప్రేమ జంట.
ఒకరిని విడచి ఒకరు ఉండలేము అనుకున్నారు తొందరపాటు వలన ప్రియురాలు ప్రాణాలు కోల్పోవడంతో ఇంకెప్పుడు కలని ఉండే అవకాశం లేకపోయింది.
చావడానికి అంత ధైర్యం చేసిన వాళ్ళు బతకడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోయారు...? అలా చేసి ఉంటె ఆ ప్రియురాలు ప్రాణాలతో ఉండేది.
తూర్పుగోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, నేలటూరుకు చెందిన సాకా స్వర్ణలత, ఆమె బావ తమ్ముడు బిక్కవోలు మండలం తుమ్మలపల్లికి చెందిన మాదేస్వామి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు అదే విషయం పెద్దలకు చెప్పారు. ఇరు కుటుంబీకులు వారి పెళ్ళికి అంగీకరించలేదు. కలసి జీవితం పంచుకోలేకపోయినా చావుతో కలసి జీవితాన్ని ముగించాలనుకున్నారు. స్థానిక బైపాస్ రోడ్ లోని నిర్జీవ ప్రదేశానికి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారు ఆత్మహత్య చేసుకోవలనుకుంటున్నారు అనే విషయం మాదేస్వామి తన స్నేహితులకు ముందుగా చెప్పడంతో వారి స్నేహితులు ఆ ప్రాంతానికి చేరుకొని వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రియుడు బతికాడు ప్రియురాలు ప్రాణాలు కోల్పోయింది.
20, జనవరి 2014, సోమవారం
వయస్సు చేసిన తప్పా..? పెద్దలు చేసిన పొరపాటా..?


వారు మేజర్లు కాదు అయినప్పటికీ ఉరకలు వేసే వయస్సు వారిని పరుగులు తీయించి ప్రేమలో పడేసింది. ప్రేమికులిద్దరూ పెద్దలకు విలువిచ్చి ప్రేమ విషయం చెబితే పెళ్లి చేయల్సిందిపోయి ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారు.
కడప జిల్లా, ప్రొద్దుటూరు శివారులోని అమృతానగర్ కు చెందిన యువతీ, అదే కాలనీకి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదే విషయం పెద్దలకు చెప్పారు, ఇద్దరి [వయస్సు 17 సంవత్సరాలు] మైనర్లు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. రెండు నెలల తరువాత పెళ్లి చేస్తామని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు అంతవరకు ఆగి తరువాత పెళ్లి విషయం మాట్లాడితే అబ్బాయి తల్లిదండ్రులు 4 ఏళ్ల తరువాత చేస్తామని చెప్పడంతో ఇరుకుటుంబాలమద్య గొడవలు మొదలయ్యాయి. ప్రేమించిన అబ్బాయి ఇదంతా నావల్లే జరిగిందని మనస్తాపానికి గురై రాత్రి విషం మింగాడు, అబ్బాయిని ఆసుపత్రిలో చేర్పించారు, విషయం తెలిసిన ప్రియురాలు తెల్లవారుజామున విషద్రవం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది, అమ్మాయి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
పెద్దలు పెద్దమనసుతో వారి ప్రేమను అర్థం చేసుకొనుంటే ఆ ప్రేమికులు సంతోషంగా జీవించేవారు, పెద్దల మూర్కత్వమే వారి ప్రాణాలు తీసింది. పెద్దల్లారా మీ బిడ్డల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి వారిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి.
19, జనవరి 2014, ఆదివారం
ప్రేమించడం అంత ఘోరమైన పాపమా...?

పండ్ల చెట్టు నాటితే పండ్లు కాస్తాయి..
ప్రేమ విత్తనం వేస్తే మరణ శిక్ష వస్తుంది.
ప్రపంచంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, ఎన్నో మోసాలు చేస్తున్నారు, అన్యాయం అవినీతి రాజ్యమేలుతున్నాయి.. వీటన్నిటిని చూస్తూ అందరూ మౌనం వహిస్తారు.
అది తప్పు అని తెలిసినా కూడా దానిని వ్యతిరేకించరు.
ప్రేమను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తారు...?
ప్రేమ విషయంలో ఎందుకు ఖఠినంగా ప్రవర్తిస్తారు..?
ప్రేమించడం అంత ఘోరమైన పాపమా...?
కడప జిల్లా, తొండూరు, కదిరి మండలం చలమకుంట గ్రామానికి చెందిన కుటాగళ్ళ రవి.. చక్రాయపేట మండలం, కొండప్ప గారి పల్లెకు చెందిన ఈశ్వర్ రెడ్డి ఇరు కుటుంబీకులు బతుకు తెరువు కోసం బెంగళూర్ వెళ్లారు, వేరు వేరు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు కానీ వీరంతా ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. రవి, ఈశ్వర్ రెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు, కుల మతాలు వేరైనా కలసి బ్రతకాలనుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెద్దలు అందుకు అంగీకరించలేదు.రవి,అమ్మాయి రవి స్వగ్రామo చలమకుంటకు వెళ్లారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి తనని తీసుకెళ్ళారు. తరువాత అమ్మాయి తండ్రి, మామ కలిసి రవిని పని ఇప్పిస్తామంటూ పిలిపించి మల్లేలఘాట్ కు తీసుకెళ్ళి రవిని రాళ్ళతో కొట్టి చంపేసి శవం కనబడకుండా రాళ్ళతో కప్పిపెట్టారు. ఈ విషయం చాల ఆలస్యంగా వెలుగుచూసింది.
15, జనవరి 2014, బుధవారం
ప్రేమ పోరాటం

ప్రేమించి, మోసపోయి, కుమిలుపోయి, జీవితమే లేదని మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోకుండా ధైర్యంగా నిలబడుతున్నారు.
అలాంటివారిలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతీ చేరింది. తనపై దాడులు జరిగినా భయపడకుండా పోరాటం మొదలు పెట్టింది.
నల్గొండ జిల్లా, డొంకదొండీ గ్రామపంచాయితీ పరిదిలోని కాన్యతండకు చెందిన ఇష్లావత్ సునీత, డొంకదొండీ గ్రామానికి చెందిన శివకుమార్ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావనకు వచ్చేసరికి శివకుమార్ పెళ్ళికి నిరాకరించాడు. సునీత ప్రియుడి ఇంటిముందు కూర్చొని దీక్ష మొదలుపెట్టింది తనుకు శివకుమార్ కు పెళ్లి జరగాలని. ప్రియుడి తల్లి, సోదరి ఆమెపై దాడి చేశారు అయినప్పటికీ తనకు న్యాయం జరగాలని దీక్ష కొనసాగిస్తుంది.
సునీతకు న్యాయం జరగాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది.
14, జనవరి 2014, మంగళవారం
తెలుగు అబ్బాయి చైనా అమ్మాయి
ప్రేమకు నిజమైన అర్థం తెలిసినవాళ్ళుతప్పకుండా ప్రేమలో పడతారు, అదిఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో అని ఎవరు చెప్పలేరు. ప్రేమకు ఒక్కటే తెలుసు ప్రేమించడం. ఆ ప్రేమలో ఓ తెలుగబ్బాయి చైనా అమ్మాయి పడిపోయారు. అంతే కాకుండా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
విజయవాడకు చెందిన ఫణి కుమార్ ఎం.బీ.బీ.ఎస్ చేయడం కోసం చైనా వెళ్ళాడు అక్కడ చైనా కు చెందిన అమ్మాయి లీ లూయన్ పరిచయమయ్యింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు, పెద్దలకు చెప్పి పెళ్ళికి ఒప్పించారు, పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి విజయవాడలో జనవరి 11 న వివాహం జరిపించారు.
ఈ ప్రేమికులిద్దరూ కలకాలం సంతోషంగా, అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
విజయవాడకు చెందిన ఫణి కుమార్ ఎం.బీ.బీ.ఎస్ చేయడం కోసం చైనా వెళ్ళాడు అక్కడ చైనా కు చెందిన అమ్మాయి లీ లూయన్ పరిచయమయ్యింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు, పెద్దలకు చెప్పి పెళ్ళికి ఒప్పించారు, పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి విజయవాడలో జనవరి 11 న వివాహం జరిపించారు.
ఈ ప్రేమికులిద్దరూ కలకాలం సంతోషంగా, అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
రొమాంటిక్ ప్రేమ లేఖ

ప్రేమ లేఖను చూడగానే గుండెల్లో పొంగే ఆనందం కళ్ళల్లో కనిపిస్తుంది.
ప్రేమ లేఖను తాకగానే గుండెల్లో వైబ్రేషన్స్ మొదలవుతాయి .
ఈ మాటలన్నీ పాత కాలంలో వినిపించేవి .. ఇప్పట్లో ప్రేమ లేఖ అనే పదం వినబడదు. ఎందుకంటే మొబైల్ ఫోన్ లు, ఇ-మెయిల్, ఫేస్ బుక్ లు అందుబాటులోకి వచ్చాయి.
రొటీన్ కి బిన్నంగా మీ ప్రేమను రొమాంటిక్ గా కంటికింపుగా కనిపించేలా "రెడ్ హార్డ్ స్టాంప్ పెన్ను" ఉపయోగించి ఓ ప్రేమ లేఖ రాయండి. ఈ పెన్నుకి పై భాగంలో ఎర్రటి ఇంకుతో హృదయాకారపు స్టాంప్ఉంటుంది. ఆ గుర్తును ప్రేమ లేఖలో అక్కడక్కడా గురుతులు పెట్టచ్చు,
ఇంకాస్త సృజనాత్మకత జోడించి ఈ గురుతులతో 'ఐ లవ్ యు'
లేక ప్రేమించే వారి పేరు రాసి పంపండి మీ ప్రియులు ఫ్లాట్ అయిపోతారు.
లవ్ ఫెయిల్యూర్

వాటికీఎరువు వేసి, నీళ్ళు పోసి పెంచుతాము.
ఆ మొక్కలకు పూలు పూయకుంటే ఆ మొక్కలను పీకేస్తామా ....?
మొక్కను నాటిన చేతిని నరికేస్తామా....?
పూలు పూయనందుకు కారణాలు ఏవో తెలుసుకొని వాటికీ తగిన మందులు ఉపయోగించి, సరైన పద్దతిలో ఎరువు వేసి మళ్లీ పూలు పూసేలా చేసుకుంటాము.
మన జీవితంలో ప్రేమ కూడా అంతే.. ప్రేమించిన వాళ్ళు ప్రేమను కాదన్నారని,
ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకోవడనికే పరుగెడుతారు
కాని ఆ ప్రేమ ఫలించెలా ప్రయత్నాలు చేయరు.
అలా ఆలోచించకనే ఓ ప్రేమికుడు ప్రాణాలు తీసుకున్నాడు.
కర్ణాటక, బెంగళూర్, మాగడిరోడ్డు చోళురాపాళ్య నివాసి కుమార్ తను ప్రేమించిన అమ్మాయి తనని పట్టించుకోవట్లేదని, తన ప్రేమను నిరాకరించిందని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
13, జనవరి 2014, సోమవారం
10, జనవరి 2014, శుక్రవారం
ప్రేమ పలుకులు

సినిమాలోనిది...
"వేచి చూడడంలో ఓర్పు ఉంటుంది..
ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది..
ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది."
నేటి యువత ఈ మాటను గుర్తుంచుకోవాలి. ప్రేమ విఫలమైoదనో..
పెద్దలు ఒప్పుకోలేదనో..
ప్రేమించిన వారు మోసం చేశారనో..
ఇలా ఏదోక కారణం వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రేమ ఎలాంటి వారినైనా మార్చేస్తుంది కాబట్టి నమ్మకంతో ముందడుగు వేసి
ప్రేమను, ప్రాణాలను కాపాడుకోండి.
9, జనవరి 2014, గురువారం
ప్రాణమే లేకుంటే ప్రేమ ఎలా పొందుతావు

ప్రేమలో ఓదార్పు, ధైర్యం, నమ్మకం, నీరీక్షణ, బలం దొరుకుతాయి. అవి జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి కాని నాశనం చేయవు.
అలా జరిగితే అది ప్రేమే కాదు.
ప్రేమను దక్కించుకోవడం కోసం ఏ సాహసమైనా చేయచ్చు కాని ప్రేమ దక్కలేదని ప్రాణం తీసుకుంటే మనం కావలి అనుకునే ప్రేమ మనకు దక్కదు కదా...
ప్రేమించిన అమ్మాయి ప్రేమను కాదంటే మల్లి మల్లి ప్రయత్నించి ఆమె మనసును గెలవాలి. పిరికి వాడిలా ప్రాణాలు విడిస్తే జీవితాన్ని కోల్పోతావు. అంత పిరికితనం ఉన్న నీకు ప్రేమ ఎందుకు...?
ప్రేమకు అర్థం తెలియకుండానే ప్రేమించి, ప్రేమ విఫలమైందని ప్రాణం తీసుకుంటున్నారు నేటి యువత. ప్రేమ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా అంటే.. ప్రాణమే ముఖ్యం కదా. ప్రాణమే లేకుంటే ఎలా ప్రేమిస్తారు..?
ఎలా ప్రేమను పొందుతారు..? ఎలా ప్రేమగా జీవిస్తారు..?
అనంతపురం జిల్లా, కళ్యాణ దుర్గ మండలం, దాసం పల్లి గ్రమంలో తిమ్మరాజు అనే యువకుడు ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురై జనవరి 7 తేదిన పురుగుల మందు తాగి ప్రాణం విడిచాడు.
ప్రేమ విఫలమైదని బాదపడేదనికన్నా ఎలాగైనా ప్రేమను దక్కించుకోవాలి అని అనుకుంటే తిమ్మరాజు బతికి ఉండేవాడు.
ప్రేమకు న్యాయం జరుగుతుందా..
మంచి డ్రెస్ కనిపిస్తే కొని వాడి పక్కన పడేస్తాం.
అందమైన వస్తువు కనిపిస్తే కొని ఉపయోగించి కొత్త మోడల్ రాగానే వేరేది కొంటాం.
ఈ కాలంలో ప్రేమ కూడా అలాగే మారిపోయింది. ఎంజాయ్ చేసేవరకు ఉండి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనుషులకు వస్తువులకు తేడా లేనంతగా ప్రవర్తిస్తున్నారు ఈ సమాజం. ఇలాంటి మరమనుషులకు ఇద్దరు బలయ్యారు.
ఆదిలాబాద్ జిల్లా, వేమనపల్లి చెన్నూరు మండలం, గంగారాం గ్రామానికి చెందిన ఏదళ్ళ రజిత, నీల్వాయి గ్రామానికి చెందిన శ్రీశైలం ప్రేమించుకున్నారు పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారు. పెద్దలచేత ముగుర్తాలు కూడా పెట్టించారు. శ్రీశైలం వరసకు బావ కావడంతో తనని పూర్తిగా నమ్మి పెళ్ళికి ముందే తనువును అర్పించుకుంది. అలా మూడు నెలలు కలసి ఉన్నారు. పెళ్లి సమయం దగ్గర పడే సమయంలో పెళ్ళికి నిరాకరించాడు శ్రీశైలం. రజిత తనను పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ఇంటి ముందు 15 రోజులనుండి మౌనపోరాటం చేస్తుంది. చావైన బతుకైన తనతోనే తేల్చుకుంటానని దీక్ష పట్టింది. శ్రీశైలo తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడని తనకి న్యాయం చేయాలనీ అతనితో పెళ్లి జరిపించాలని కోరుతుంది.
ఖమ్మం జిల్లా, ఇల్లెందు గ్రామీణం మండలంలోని నాయకుల గూడేనికి చెందిన కిన్నెర వసంత, కుమ్మరి బస్తీకి చెందిన సింగవరపు నవీన్ కుమార్ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వసంతని పెళ్ళిచేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరకు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడు. తనకు న్యాయం జరగాలంటూ ప్రియుడి ఇంటిముందు పోరాటానికి దిగింది.
రజిత, వసంత చేసిన పోరాటాన్ని చూసి గర్వపడాలి. అందరి అమ్మాయిల్లా ప్రేమలో ఓడిపోయి పిరికి దానిలా ఆత్మహత్య చేసుకోకుండా మోసం చేసిన వాదిపైకి ఉద్యమించడం గొప్ప విషయం. వారికి న్యాయం జరగాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది.
యువతకు ఓ చిన్న మాట... ప్రేమించండి తప్పులేదు కాని ప్రేమ పేరుతో తనువులు దగ్గర చేసుకొని తలదించుకునే పనులు చేసుకోవద్దు.
అందమైన వస్తువు కనిపిస్తే కొని ఉపయోగించి కొత్త మోడల్ రాగానే వేరేది కొంటాం.
ఈ కాలంలో ప్రేమ కూడా అలాగే మారిపోయింది. ఎంజాయ్ చేసేవరకు ఉండి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనుషులకు వస్తువులకు తేడా లేనంతగా ప్రవర్తిస్తున్నారు ఈ సమాజం. ఇలాంటి మరమనుషులకు ఇద్దరు బలయ్యారు.


రజిత, వసంత చేసిన పోరాటాన్ని చూసి గర్వపడాలి. అందరి అమ్మాయిల్లా ప్రేమలో ఓడిపోయి పిరికి దానిలా ఆత్మహత్య చేసుకోకుండా మోసం చేసిన వాదిపైకి ఉద్యమించడం గొప్ప విషయం. వారికి న్యాయం జరగాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది.
యువతకు ఓ చిన్న మాట... ప్రేమించండి తప్పులేదు కాని ప్రేమ పేరుతో తనువులు దగ్గర చేసుకొని తలదించుకునే పనులు చేసుకోవద్దు.
8, జనవరి 2014, బుధవారం
ఓ ప్రియురాలి ఉద్యమం
మోసం చేస్తాడనుకోలేదు.
పెళ్లి చేసుకున్నాడునుకుంది... ద్రోహం చేస్తాడనుకోలేదు.
నూరేళ్ళు తోడుంటాడనుకుంది... వంచన చేస్తాడనుకోలేదు.
మోసాన్ని ఎదుర్కోడానికి...
ద్రోహాన్ని నిలదీయడానికి... వంచనను ప్రశ్నించడానికి...
ఓ ప్రియురాలు నడుం బిగించింది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన విజయలక్ష్మి చాగలమర్రికి చెందిన పెద్దబాబును ప్రేమించింది. ఇరువురు కర్నూలు లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. మూడేళ్ళ క్రితం పెద్దబాబు ఎవరికీ తెలియకుండా విజయలక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కాదు పొమ్మంటున్నాడు. దీంతో చాగలమర్రిలోని పెద్దబాబు ఇంటి వద్ద విజయలక్ష్మి ధర్నాకు దిగారు.
ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ ఐన పెద్దబాబు కు పోలీసులు సహకరిస్తున్నారు. తోటి మహిళలు విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఏ ప్రియురాలికి ఇలాంటి కష్టం రాకుడదంటే మనమంతా విజయలక్ష్మికి బాసటగా నిలవాలి. ప్రేమహృదయం విజయలక్ష్మి వైపే ఉంది... మరి మీరూ... ?
ప్రేమనే చంపేశాడు ఓ ప్రేమోన్మాది

భూమిలో విత్తనం వేస్తే మొలకేత్తేవరకు ఎదురుచూడాలి
చెట్టుకు పూత వస్తే కాయగా మారేవరకు ఎదురుచూడాలి
ప్రేమిస్తే ప్రేమను పొందేవరకు ఎదురుచూడాలి..
ప్రేమించి ప్రేమను పొందేవరకు ఎదురుచూడలేక ప్రేమనే చంపేశాడు ఓ ప్రేమోన్మాది.
మహారాష్ట్ర , ముంబాయి చెంబూరుకు చెందిన గణేష్ సూర్యవంశీ , షాహీన్ ఖాన్ అనే అమ్మాయి ప్రేమించుకున్నారు పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారు. కొంతకాలంగా గణేష్ తమ పెళ్లి విషయం షాహీన్ తో ప్రస్తావిస్తే తను ఏమి చెప్పకుండా దాటవేస్తూ వచ్చింది. తను పెళ్లి చేసుకోదేమో అని మనస్తాపానికి గురయ్యేవాడు. పెళ్లి విషయంలో గణేష్ చాలాసార్లు గొడవ కూడా పడేవాడు. షాహీన్ మీద అనుమానం వచ్చిo డిది. ఆమెపైన కక్ష పెంచుకున్నాడు. జనవరి 6 వ తేదిన నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై చర్చిస్తుండగా మాట మాట పెరగడంతో గణేష్ దగ్గర వున్న కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.
7, జనవరి 2014, మంగళవారం
ప్రేమ మాట

బాలకృష్ణ చెప్పిన డైలాగ్....
అందమైన అమ్మాయిలను వెంటపడండి,
టీస్ చేయండి వాళ్ళు ఎంజాయ్ చేసేవరకు..
కామెంట్ చేయండి వాళ్ళు హర్ట్ అవనంతవరకు..
లవ్ చేయండి వాళ్ళు ఓకే అంటే ప్రాణాలిచ్చైనా దక్కించుకోండి..
ప్రేమించనంటే యాసిడ్ పోయడమేoటిరా......
యువత జీవితాన్ని సరదాగా గడపాలనుకుంటారు తప్పులేదు కాని అందులో మంచి చెడును గ్రహిస్తే ఏ పొరపాట్లు జరగవు.
6, జనవరి 2014, సోమవారం
ప్రేమ పుట్టింది... ఎలా నమ్ముతారు...?

మల్లె చెట్టునుండి పూసింది అని నమ్ముతాము.
మామిడి పండు కాసింది...
మామిడి చెట్టు నుండి కాసింది అని నమ్ముతాము.
జాబిల్లి కనబడుతుంది...
రాత్రి అయిందని నమ్ముతాము.
ఎండలు మండుతున్నాయి...
సూర్యుడి నుండి అని నమ్ముతాము.
ప్రేమ పుట్టింది... ఎలా నమ్ముతారు...?
ప్రేమ నమ్మకం నుండి పుడుతుంది.
ఒక వ్యక్తిని చూసి, వారిలోని నడవడిక, పద్దతులు, ఆలోచనలు, అభిరుచులు...... నచ్చి వారిపైన నమ్మకం ఏర్పడుతుంది.
ఆ నమ్మకం ప్రేమగా పరిపక్వం చెందుతుంది.
నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేనిచోటే నమ్మకం ఉండదు.
ప్రేమించిన అమ్మాయిపైన నమ్మకం లేక ప్రియురాలి ప్రాణం తీశాడు ఓ ప్రేమికుడు. అది ప్రేమేనంటారా...?
హైదరాబాద్, హయ్యత్ నగర్ లో ఈ సంగటన జరిగింది. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, గంజుగాపూర్ గ్రామానికి చెందిన షబానా బేగం రామ్ కోఠి లో ఉంటున్నారు. కాచిగూడలో నివాసముంటున్న మహమ్మద్ హుస్సేన్ ఇరువురు ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. షబానా కొంత కాలంగా ఇమ్రాన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉందని ఆమెపై అనుమానం పెంచుకొని ఆమెను చంపాలని నిర్ణయించుకొని తన చిన్నాన్న కుమారుడు రఫిక్ సహాయంతో శికారుకని బైటికి తీసుకెళ్ళి ఆమెను పొదలలోకి తీసుకెళ్ళి కత్తితో, స్క్రూడ్రైవర్ తో పొడిచి విచక్షణారహితంగా బండరాయితో మోది చంపాడు.
గుండెలనిండా అనుమానం నింపుకొని కసాయితానంగా ప్రవర్తించడం ప్రేమ లక్షణం కాదు.
ప్రేమిస్తే నమ్మండి.. నమ్మకం లేకపోతే ప్రేమించద్దు.
5, జనవరి 2014, ఆదివారం
జీవితాలను మొగ్గలోనే తుంచేయకండి

అబ్బాయికి ఇష్టం వచ్చింది తీసుకోనీలే.
నగలు ఏం కొందాం...?
అమ్మాయికి నచ్చింది తీసుకోనీలే.
టి.వి ఏది కొందాం...?
అబ్బాయికి నచ్చిన మోడల్ తీసుకోనీలే.
ఏ కోర్స్ చదివిద్దాం...?
అమ్మాయికి ఇష్టం వచ్చింది చాడువుకోనీలే.
తల్లిదండ్రులారా పిల్లలకు నచ్చిందే చేయాలని అన్నింటిలో ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమ విషయంలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు...?
మీ చేజేతులార పిల్లలను ఎందుకు చంపుతున్నారు...?
న్యూ డిల్లీ , మోదీనగర్ సౌదాగావ్ లో ఉండే ఓ యువకుడు, ఓయువతి ప్రేమించుకున్నారు. కలసి బ్రతకలనుకున్నారు. వీరి ప్రేమను తల్లిదండ్రులకు చెప్పారు కాని పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. కలసి బ్రతకకపోయినా కలసి చావలనుకున్నరేమో జనవరి 4 వ తేదిన పురుగులమందు తాగి కలసి ప్రాణాలు విడిచారు.
పెద్దలారా పిల్లల ప్రేమను మూర్ఖంగా తిరస్కరించి , వారి జీవితాలను మొగ్గలోనే తుంచేయకండి.
ప్రేమతో కలిసి పెళ్లితో ఒక్కటయ్యారు

నది ఎప్పుడైనా
సాగరంలో కలవాలి..
అమ్మాయి అబ్బాయి ప్రేమలోనే కలవాలి..
అలాగే ఓ ప్రేమ జంట... ప్రేమతో కలిసి పెళ్లితో ఒక్కటయ్యారు.
కడప జిల్లా, రాజంపేట మండలం పుల్లంపేటకు చెందిన ఫన్నీష్ కుమార్, ఓబులవారి మండలం ముక్కవారిపల్లెకు చెందిన అమ్మాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి ఇంట్లో విషయం తెలిసిన పెద్దలు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిర్ణయించారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. వీరిరువురు తిరుపతి ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుకొని రాజంపెతలోని మున్నూరు పోలీస్ స్టేషన్ కు చేరి ఇరు కుటుంబాలనుండి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
వీరు పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమైక జీవితాన్ని చూసి పెద్దలు మెచ్చుకునేల బతకాలని ఆశిస్తూ ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
4, జనవరి 2014, శనివారం
పెద్దల్లారా మీది ఏ కులం

మీరు తాగుతున్న నీటిని మీ కులం వాడే శుద్ధి చేసి పంపిస్తున్నాడా....?
మీరు పీలుస్తున్న గాలి మీ కులం వాల్లదేనా....?
మీరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, రక్తం అత్యవసరం అయినప్పుడు
మీ కులం వాడా కాదా అని అడిగి తీసుకుంటారా....?
వీటన్నింటికి కులం అడ్డురానప్పుడు మీ బిడ్డల ప్రేమకు, పెళ్ళికి కులం ఎందుకు అడ్డువస్తుంది...?
హైదరాబాద్ లోని నిజాం పేట గ్రామ బండారు లేఅవుట్ లో ఉన్నటువంటి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్వాతి, కొండాపూర్ లో ఉంటున్నటువంటి యువకుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమను పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలకు విషయం తెలియజేశారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. స్వాతి మనోవేదన భరించలేక శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇలా కులానికి పిల్లల్ని బలి చేయాలనుకుంటే పెద్దల్లారా మీకు కులమే ముక్యం అనుకుంటే ముందు మీరే చావాలి.
ఎందుకంటే మీరు తినే బియ్యం, తాగే నీరు, పీల్చే గాలి, ఏ కులం వాళ్ళ దగ్గరనుండి వస్స్తుందో మీకే తెలియాలి...
3, జనవరి 2014, శుక్రవారం
ప్రేమ పరీక్షలో సీత

మనసిచ్చింది.
పెళ్లి చేసుకుంటానంటే...
సంబర పడింది.
మనువుకు సరేనంది.
ఏడడుగులు నడిచి... వందేళ్ళ జీవితం తనతో పంచుకోవలనుకుంది.
తొలి అడుగులోనే అనుమానం తనకు పరీక్ష పెట్టింది.
నువ్వు నీ క్లాసుమేట్ తో క్లోజ్ గా ఉన్నావంటూ ప్రియుడు అనుమానించాడు.
పెళ్లి చేసుకోవాలా వద్దా? అని ఆలోచిస్తున్నాడు.
తను శీల పరీక్షకైనా సిద్ధమంటున్నా ఒప్పుకోవడం లేదు.
మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరిగిన ఈ ఘటనలో ఈ అమ్మాయి రామాయణంలో సీతలా ప్రేమ అగ్ని పరీక్షకు సిద్దపడుతోంది.
ఇంత అనుమానం ఉన్న వాడిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని సుఖపడుతుoదంటారా?
పూర్తి వివరాలు చదవండి ...
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20140104a_016101007&ileft=727&itop=196&zoomRatio=130&AN=20140104a_016101007
చచ్చి సాధించేది ఏమీ లేదు. బతికి ప్రేమ గెలవాలి
యూ లవ్ మీ అని అర్థం అక్కడ లేదోయి....
ఆర్య సినిమాలోని ఓ పాటలో చరణం...
దీన్ని నేటి యువత తప్పక తెలుసుకోవాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి.
బెంగళూరుకు చెందిన లోకేష్ (22) ఓ అమ్మాయిని ప్రేమించాడు. నూతన సంవత్సరాది సందర్బంగా ఆమెకు గ్రీటింగ్ ఇవ్వబోయాడు. ఆమె తీసుకోలేదు. దీంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంత చిన్న విషయానికే చావడం ఎంత తప్పు?
నువ్వు నిజాయితీగా ప్రేమిస్తే 2015లో గ్రీటింగ్ తీసుకొనే అవకాశం ఐన ఉండేది. ఇప్పుడు ఇక లేదు.
మనం ప్రేమించినంత మాత్రాన అవతలి వారు ప్రేమించాలని లేదు కదా?
యువతా ...చచ్చి సాధించేది ఏమీ లేదు. బతికి ప్రేమ గెలవాలి
గుండెకు ప్రేమకు సంబంధం ఉందా....?

ప్రేమలో పడితే నిజంగానే ఒళ్ళంతా ఏదో తియ్యని, సంతోషకరమైన భావ తరంగాలు వ్యాపిస్తాయట.
ఒళ్ళంతా నులువేచ్చని ఆవిర్లు వచ్చినట్లు ఉండటం, ఏదో తెలియని ఆందోళన కలగటం, వీటికి తోడు గుండెల్లో చిన్న నొప్పి... ఇవన్ని ప్రేమ లక్షణాలేనంటున్నారు శాస్త్రవేత్తలు.
ప్రేమలో పడినప్పుడు, ప్రేమించినవారిని చూసినప్పుడు గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. శ్వాస వేగవంతమవుతుంది. ముఖం కళకళలాడుతుంది. అదే చాలా విచారకరమైన విషయాలు విన్నప్పుడు కడుపులో గడబిడ మొదలవుతుందట.
శారీరకరమైన ఈ మార్పులు మెదడులోని సంతోష భాగాలను ఉత్తేజితం చేసి ప్రేమలో ఉన్నప్పుడు అదనపు ఆనందం కలిగేలా ప్రేరేపిస్తాయట.
2, జనవరి 2014, గురువారం
ప్రేమంటే శరీరం ఇవ్వోచ్చా?... అడగొచ్చా?

ప్రేమంటే ప్రాణం ఇవ్వొచ్చు...
ప్రేమంటే జీవితం ఇవ్వొచ్చు...
ప్రేమంటే శరీరం ఇవ్వోచ్చా?... అడగొచ్చా?
ఇవ్వొచ్చు... అడగొచ్చు... పెళ్లి అనే మూడు ముళ్ళ బంధం తరవాత...
ఇదే మన భారతీయ సంప్రదాయం.
దీన్ని అతిక్రమిస్తే ఎన్నో కష్టాలు వస్తాయనే మన పెద్దలు అలా చెప్పారు.
మగ్గాళ్ళ ముసుగు వేసుకున్న మృగాళ్ళు ఉంటారని హెచ్చరించారు.
ఇది తెలియని ఇద్దరు అమాయకురాళ్ళు మృగాళ్ళ నోటికి చిక్కారు.
* గుంటూరు జిల్లా తాడేపల్లిలో 16 ఏళ్ల బాలిక ప్రేమిస్తానంటే మనసు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానంటే సర్వస్వం అర్పించింది. తీర పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు వెంకటేశ్వర రావు. తట్టుకోలేని బాలిక ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ బాలిక ఎప్పుడు రెండునెలల గర్భవతి.
* మహారాష్ట్ర అంబర్ నాథ్ ఉల్లాస్ నగర్ లోని దోభిఘాట్ పరిసరాల్లో ఓ యువతిని అనిల్ రాజ్ బర్ ఇలాగే మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని నిలదీస్తే కత్తితో పొడిచాడు.
అమ్మాయిలూ జాగ్రత్త... ప్రేమ పేరుతో శరీరం అడిగే వాళ్ళను నమ్మకండి.
ప్రేమ విఫలమై ఆగిన ఊపిరి

అమ్మా నాన్నల ప్రేమను చంపేసి హంతకుడవయ్యావు. 27 ఏళ్ళు నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ కాలరాశావు. ప్రేమంటే జీవం పొయ్యాలి కాని ఊపిరి తీయకూడదు. నీ ఆత్మహత్యతో నీతో పాటు మీ తల్లిదండ్రులు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు.
నీకు ఇది న్యాయమా...?
కరీంనగర్ జిల్లా లోని గోదావరి ఖని తిలక్ నగర్ కు చెందిన ఉదయకుమార్ పద్మశాలి వసతి గృహంలో ఉంటూ చింతకుంట లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎం.బి.ఎ చదువుతున్నాడు. జనవరి 1తేదిన తన ప్రేమ విఫలం అయ్యిందని మానసికంగా క్రుంగిపోయి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ప్రేమ విఫలమైనదని...అందుకే చనిపోతున్నానని ఫేసుబుక్ లో రాశాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)