29, జనవరి 2014, బుధవారం

ప్రేమ..నీ అడుగులు ఎటువైపు...?

ప్రేమించడం అంటే...  
ఒకరికి ఒకరు తోడుండడం, 
ఒకరిని ఒకరు ధైర్యపరచడం, 
ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడం,
ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడం, 
ఇద్దరు ఒక్కటై ఆనంద జీవితాన్ని మలుచుకోవడం.

ప్రేమ పేరుతో ఒకరిని ఒకరు అనుభవించడం కాదు. 
ప్రేమ మనసును త్రుప్తి పరచడానికి ప్రయత్నిస్తుంది కాని శరీరాన్ని కాదు.
ప్రేమ జీవితాంతం తోడుంటుంది కాని మద్యలో ఒంటరిని చేసి వెళ్ళిపోదు. 
ప్రేమకు సరైన అర్థం తెలియక ఆకర్షణనే ప్రేమ అనుకొని యువత మోసపోతున్నారు. ఆ మోసపు వలలో పడిoది  ఓ యువతి. తన జీవితం అన్యాయం కాకూడదని న్యాయం కోసం పోరాడుతుంది.     

ఖమ్మం జిల్లా, ముదిగొండ గ్రామానికి చెందిన సతీష్ అదే గ్రామానికి చెందిన కట్టకూరి నాగమ్మ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నాగమ్మను లొంగదీసుకున్నాడు. పెళ్లి ప్రస్తావన రాగానే మొఖం చాటేస్తున్నాడు. సతీష్ తో పెళ్లి జరిపించి తనకు న్యాయం చేయాలంటూ నాగమ్మ కుటుంబ సభ్యులు, బందువులు జనవరి 29 న తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష మొదలు పెట్టారు. 

ప్రేమించే ముందు ఆలోచించండి, ప్రేమించాక ప్రతీ అడుగు ఆలోచించి వెయ్యండి, వేసే ప్రతీ అడుగు మంచి మార్గంలో వేయండి లేకపోతే జీవితమే దారితప్పిపోతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి