28, జనవరి 2014, మంగళవారం

ప్రేమ కోసం ఉన్న ఆరాటం పెళ్ళికి ఎందుకు చూపరు..?

అమ్మాయిని చూడగానే గుండె చప్పుడు వేగం పెరుగుతుంది,  
ప్రేమించకముందు ఆ అమ్మాయే కావాలనిపిస్తుంది, 
ప్రేమను ఒప్పుకునే వరకు వెంటపడతారు,
ప్రేమను అంగీకరిస్తే సంబరపడిపోతారు,
ప్రేమించాక... సమస్యలు వస్తే సంబంధం లేనట్లు ఉండిపోతారు. 

ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెంటపడి ఓ యువతీ ప్రేమను పొందాడు ఓ యువకుడు. పెళ్లి దాక వచ్చేసరికి మౌనం వహించాడు. తననే నమ్ముకున్న యువతి తను లేకపోతే బతకలేననుకుంది, ప్రాణాలు వదులుకోవడానికి సిద్దపడింది.     

కృష్ణ జిల్లా, సిద్దార్థ నగర్ కు చెందిన భూక్యా మురళి నాయక్ ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్ళిచేసుకుంటానని నచ్చజెప్పాడు. ఆ యువతీ అందుకు ఒప్పుకుంది. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో పెద్దలందరూ కలిసి పంచాయితీ జరిపారు, మురళి కుటుంబీకులు పెళ్ళికి అంగీకరించలేదు. అందుకు మనస్తాపానికి చెందిన ఆ యువతీ వారి తల్లిదండ్రులను క్షమాపణ కోరుతూ ఓ లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతిని నూజివీడు ఆసుపత్రిలలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. 

ప్రేమ కోసం ఉన్న ఆరాటం పెళ్ళికి ఎందుకు చూపరు..? ప్రేమ పేరుతో మోసం చేయడం న్యాయమా..? 
ప్రేమించిన వ్యక్తిని పొందే ధైర్యం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు..?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి