29, జనవరి 2014, బుధవారం

ప్రేమికుడి ప్రాణాలు బలికొన్న కర్షకులు

వీదివెంట తిరిగే కుక్క పిల్లలకు చిన్న గాయం తగిలితే అయ్యో పాపం అంటాము,  
ఏదైనా జంతువు కళ్ళముందు ప్రాణాపాయ స్థితిలో ఉంటె తట్టుకోలేము,
అవి ఆకలితో అలమటిస్తూ కనిపిస్తే వాటి ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తాం. 
ఏ సంబందము లేని ఆ మూగ జీవులపైన ఉన్న జాలి, కనికరం  మనుషులపైన ఎందుకు ఉండదు...? 

ప్రేమించడం.. పాపం కాదు కదా..?  
ప్రేమించడం.. హత్య కాదు కదా..?
ప్రేమించడం.. అన్యాయం కాదు కదా..? 
ప్రేమించడం.. దౌర్జన్యం కాదు కదా..? 
ప్రేమించడం .. వ్యభిచారం కాదు కదా..? 
మరి ఎందుకు ప్రేమిస్తే ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణం పోయేలా చేస్తున్నారు...?

ప్రేమించడం పెద్ద నేరంలా భావించి వంశీ నిండు ప్రాణాలు బలితీసుకున్నారు ఓ కర్షక కుటుంబం..

గోదావరిఖని, సీతానగర్ కు చెoదిన వంశీ కృష్ణ , అదే ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇరువురిని దూరంగా ఉంచారు. 3 నెలల క్రితం అమ్మాయి తరపు వారు స్వయంగా కేసు ఉపసంహరించుకున్నారు. తరువాత అమ్మాయి వంశీ కి ఫోన్ చేయడంతో వంశీ తండ్రి జనవరి 26 న పెద్దలను పిలచి పంచాయితి పెట్టాలనుకున్నాడు. అదే రోజు ఉదయం బైటికి వెళ్ళిన వంశీ ఇంటికి తిరిగి రాలేదు. మరుసటిరోజు ఉదయం మహారాష్ట్ర లోని బల్లార్శ రైలు పట్టాలపైన శవమై కనిపించాడు. ప్రేమించినందుకే అమ్మాయి తరపువారు చంపేశారని శవాన్ని యువతి ఇంటిముందు బైఠాయించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి