28, జనవరి 2014, మంగళవారం

ప్రేమలో గుణగణాలు, మంచిచెడుల ఎంపిక అవసరమే....

ఒక డ్రెస్ కొనాలంటే ఆ డ్రెస్ రంగు, నాణ్యత, మన్నిక చూసి 
జాగ్రత్తగా కొంటాము. 
ఒక వస్తువు కొనాలన్నా అది ఎంత కాలం ఉపయోగపడుతుంది, 
క్వాలిటీని చూసి కొంటాము. 
కాలుకు వేసుకునే చెప్పులు కొనాలన్నా దాని గురించి తెలుసుకొని 
మంచివి కొంటాము. 

చిన్న చిన్న వస్తువులనే అలోచించి ఎన్నుకుంటున్నప్పుడు మన జీవిత భాగస్వామి కావాలి అనే వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించరు...?  
ప్రేమిస్తున్నా అని చెప్పగానే నమ్మి జీవితాన్ని ఎలా అర్పిస్తారు...? 
జీవితాన్ని పంచుకునే వ్యక్తిలోని గుణగణాలు,మంచిచెడులు తెలుసుకోరా...? 

తన జీవితం గురించి సరైన వ్యక్తిని ఎంచుకునే విషయంలో విఫలమై, 
ప్రేమలో మోసపోయిన ఓ ప్రేమికురాలి ఆవేదన... 

ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం లోని సూర్యతండాకు చెందిన  బానోతు రజని, అదే గ్రామానికి చెందిన చాందవత్  చందూలాల్ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రజని పెళ్లి చేసుకోవాలని అడిగితే అందుకు నిరాకరించాడు. మరో అమ్మాయిని బద్రాచలం తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన రజని జనవరి 18 తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు వార్గాలవారితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పది రోజులు అవుతున్నా పోలీసులు స్పందించక పోవడంతో ప్రియుడి సోదరుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది.  

ప్రేమిచడం తప్పుకాదు, ప్రేమించే వ్యక్తి ఎలాంటివారో తెలుసుకొని ముందడుగు వేయండి లేకపోతే జీవితాంతం బాదలు, అవమానాలు మోస్తూ బతకాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి