28, నవంబర్ 2013, గురువారం

ప్రేమకోసం నీ హృదయం పరుగులు తీస్తుందా....? అయితే ఒక్క నిమిషం......

ఇదివరకటి కాలంలో ప్రేమించడం అంటే కొందరు ఎంతో పవిత్రంగా భావించేవారు, మరికొందరు నేరంగా పరిగణించేవారు. కాని ఇప్పటి కాలంలో పరిస్థితి ప్రేమించడం సహజం అనే స్థాయికి మారిపోయింది. 

ప్రేమంటే ఏంటో  తెలియకుండానే యువత ప్రేమకోసం పరుగులు తీస్తుంది. ప్రేమించకపోతే  స్నేహితులమధ్య  చిన్నతనంగా భావిస్తోంది.

ఒక్కసారి ప్రేమకోసం పరుగులు తీసిన పాదాలు ఏవైపు వాల్తాయో, ఏచోట ఆగుతాయో, చివరికి ఏమౌతాయో కూడా తెలియదు కాని ప్రేమ మాత్రం కావాలని కోరుకుంటున్నారు. 

ప్రేమించకముందు తెలియకపోయినా ప్రేమించాక కొన్ని ఊహించగలం.  వాటిని ఎదుర్కోనగల్గితే నీ అడుగు  ముందుకువెయ్యి . 

1. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం 

2. బెదిరింపులకు లొంగిపోవడం 

3. ఆర్థికపరిస్థితులకు తలోగ్గడం 

4. సమాజానికి భయపడడం 

5. బంధువులు వేలేస్తారని క్రుంగిపోవడం 

వీటిని ఎదుర్కోనే సామర్త్యం నీలో లేకపోతే టైం పాస్ కోసం ప్రేమించి ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు. 

వీటన్నిటిని జయించే శక్తి, ధైర్యం, మనోనిబ్బరం నీకుంటే ప్రేమ కోసం పరిగెత్తు, ప్రేమ కోసం తపించు, ప్రేమ కోసం జీవించు, ప్రేమను జయించు.      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి