మబ్బులను తొలగించుకొని దూసుకువస్తున్న రవి కిరణాలను చూశా ..
నా మదిలోకి దూసుకువచ్చిన్న నీ చూపులా అనిపించింది.
నిర్మలమైన నీ మనసులా కనిపించింది.
వికసించి పరిమళించే పువ్వును చూశా..
చక్కటి నీ నవ్వులా తోచింది.
గల గల పారేటి సెలయేరును చూశా..
కమ్మటి నీ మాటలా వినిపించింది.
వీచే చిరుగాలిని చూశా..
చల్లటి నీ స్పర్శలా తాకింది.
అద్దంలో నా రూపం చూశా..
నీలా కనిపించింది.... అర్థమైంది నేను నువ్వైనని ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి