15, నవంబర్ 2014, శనివారం
8, నవంబర్ 2014, శనివారం
14, ఆగస్టు 2014, గురువారం
28, జూన్ 2014, శనివారం
24, జూన్ 2014, మంగళవారం
15, జూన్ 2014, ఆదివారం
నీ మది చేరాలని....
సముద్రంలోని అలలకు ఎంత ఆత్రుతో నీ పదాలను స్పర్శించాలని....
ఎగిరి పడుతున్నాయి
సంధ్యా సమయ గాలికి ఎంత ఆశో నీ కురులను తాకాలని....
పరుగులు తీస్తోంది
చందమామకు ఎంత తొందరో నీ మోముపై మెరవాలని...
భానుడు అస్తమించాకుండానే మిరుమిట్లు గొలుపుతున్నాడు
మేఘానికి ఎంత ఇష్టమో నీ మేనుపై కురవాలని...
తొలకరి చినుకులై వర్షిస్తోంది
నా మదికి ఎంత ఉబలాటమో నీ చెంత చేరాలని...
పక్కనే నడుస్తున్నా నీ నామ జపం చేస్తోంది
ఎగిరి పడుతున్నాయి
సంధ్యా సమయ గాలికి ఎంత ఆశో నీ కురులను తాకాలని....

చందమామకు ఎంత తొందరో నీ మోముపై మెరవాలని...
భానుడు అస్తమించాకుండానే మిరుమిట్లు గొలుపుతున్నాడు
మేఘానికి ఎంత ఇష్టమో నీ మేనుపై కురవాలని...
తొలకరి చినుకులై వర్షిస్తోంది
నా మదికి ఎంత ఉబలాటమో నీ చెంత చేరాలని...
పక్కనే నడుస్తున్నా నీ నామ జపం చేస్తోంది
8, మే 2014, గురువారం
3, ఏప్రిల్ 2014, గురువారం
ప్రేమ వయసు తెలుసా...?

ప్రేమకు పవిత్రత, నమ్మకం, వివేచన చాలా అవసరం.
జీవితాన్నిఅందుకోవడానికి పరుగులు తీయాల్సిన పాదాలు ప్రేమ వైపు అడుగులు వేస్తున్నాయి.
ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో ఎవరిని పడితే వారిని నమ్మి, మోసపోయి ప్రాణాలు తీసుకోవడం
సరి కాదు.
l,k,g చదవడం మొదలు పెట్టినప్పటినుండి వయసు ప్రకారమే చదువు ముందుకుపోతుంది.
l,k,g చదివే పిల్లలు 10th ఎగ్జామ్స్ రాయలేరు.
అలాగే ప్రేమకు కూడా ఒక వయసు, ఒక సమయం అవసరం.
అది నిజమా కాదా అనే యోచించే వివేచన అవసరం.
నల్గొండ జిల్లా, గుండ్రపల్లి గ్రామానికి చెందిన మాధవి(ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది) , సైదులు ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పరారిలో ఉన్నాడు.
1, ఏప్రిల్ 2014, మంగళవారం
తప్పు ఎవరిది...?

ఘోరాలు నేరాలు నివాసాన్ని నిర్మించుకున్నాయి.
అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయి.
వీటన్నిటికన్నా నీచమైనదా ప్రేమ....?
ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనగానే వ్యతిరేకత...ఎందుకు?
ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలపట్ల చెడు అభిప్రాయం... ఎందుకు?
ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచిస్తే వారు కోరుకున్న జీవితం వాళ్లకు అందించిన వారు అవుతారు కదా..
కళ్ళ ముందు కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉండాల్సిన జీవితాలను మీ కోప తాపాలతో కడతేర్చారు.
కోల్పోయిన ప్రాణాలను తిరిగి రప్పించగలరా...?
వీరిరువురిని కలిపి నూరేళ్ళ జీవితాన్ని పండించగలరా...?
హైదరాబాద్, మేడ్చల్ మండలం, చంద్రశేఖర్ అదే కాలనీకి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెద్దలు అంగీకరించకపోవడంతో 29.3.2014 న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. 31.3.2014 న గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్ పరిదిలో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అబ్బాయి తల నుజ్జునుజ్జయింది. అమ్మాయి మృతదేహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయింది.
చావడానికి అంత సాహసం చేయగలిగినవాళ్ళు కలసి బతకడానికి ధైర్యం చేయలేకపోయారా..? ఓ నిమిషం ఆలోచించి ఉంటే మీరు కోరుకున్న జీవితాన్ని అందుకునేవారు.
30, మార్చి 2014, ఆదివారం
28, మార్చి 2014, శుక్రవారం
నెమలికి నాట్యం నేర్పిందెవరు?

నీ గాత్రమని చెప్పింది.
నెమలి... నెమలి... నీకు నాట్యం నేర్పిందెవరు అంటే...
నీ నడకను చూపింది.
వెన్నెలమ్మ... వెన్నెలమ్మ... నీకు ఇంత చల్లదనం ఇచ్చిందెవరు అంటే...
నీ చూపని వివరించింది.
మల్లె పువ్వమ్మా... మల్లె పువ్వమ్మా..
నీకు ఇంత మృధుత్వం ఎలా వచ్చిందంటే...
నీ స్పర్శని సెలవిచ్చింది.
27, మార్చి 2014, గురువారం
కన్న బిడ్డల సంతోషo కన్నా కులమతాలు గొప్పవా...?

బుడి బుడి అడుగులేస్తుంటే మురిసిపోతారు
చిలక పలుకులు పలుకుతుంటే పరవశిస్తారు
పెరిగి పెద్దవారైతే భవిష్యతు గురించి ఆరాఠపడతారు
ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డ మనసును అర్థం చేసుకోలేరా..?
ప్రేమను పంచి.. ప్రేమతో పెంచి.. ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు తమ బిడ్డలు మరో వ్యక్తిని ప్రేమించారని తెలియగానే కులం అనే పొరలు కమ్మి.. అది పెద్ద తప్పుగా భావించి కఠినoగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయిన ప్రేమికులు.
మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కొత్త పల్లికి చెందిన రవి.. లావణ్య కొంతకాలంగా ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల మద్య గొడవలు జరిగాయి. కొద్దిరోజుల తరువాత లావణ్య ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల తరువాత విషయం తెలిసిన రవి 25. 3. 2014 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
26, మార్చి 2014, బుధవారం
24, మార్చి 2014, సోమవారం
ఆప్యాయత అనురాగాలతో పెంచి.. అమానుషంగా అంతం చేసి..

తాను పెట్టిన గుడ్లను ఆకలికి తాళలేక ఆ గుడ్లను మింగేస్తుంది.
మనసెరిగి, మాటలు నేర్చిన మనిషి.. మానవత్వాన్ని మరిచి మరమనిషిలా బతుకుతున్నారు.
కుల మతాల పిచ్చితో మాతృత్వాన్ని మంటగలిపి, ఒంటినిండా విషాన్ని నింపుకొని జీవిస్తున్నారు.
గుంటూరు జిల్లా, నగరంలోని రాజెంద్రనగర్ కు చెందిన దీప్తి, తన సహోద్యోగి కిరణ్ కుమార్ గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వీరి కులాలు వేరు కావడంతో దీప్తి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పలుమార్లు ఒప్పించాలని ప్రయత్నించినా నీరాకరించాడంతో 21. 3. 2014 న హైదరాబాద్ లోని ఆర్యసమాజ మందిరంలో వివాహం చేసుకున్నారు. విషయం తల్లిదండ్రులకు చేరవేశారు. కులాంతర వివాహం చేసుకొని పరువు తీసిందని పదకం వేసి దీప్తి తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకొని నాగదేవత సన్నిదిలో దండలు మార్చుకోవడం తమ ఆచారమని నమ్మించి వారిని గుంటూరు కు తీసుకోచి, దీప్తిని తమ ఇంటికి తీసుకెళ్ళి చున్నీతో ఉరి పోసి హత్యచేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
తల్లిదండ్రులారా...
కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించి కన్న బిడ్డను కడతేర్చారు.
ప్రాణం తీస్తే పరువు నిలబడుతుందా...?
కులమతాలు కిరీటాలు పెడతాయా...?
17, మార్చి 2014, సోమవారం
13, మార్చి 2014, గురువారం
25, ఫిబ్రవరి 2014, మంగళవారం
ప్రియురాలిని పొందాలనుకొని..ప్రాణాలు పోయేలా చేశాడు

ప్రేమను ఇవ్వడం, ప్రేమను పొందడం.
ప్రేమిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడదు.
ప్రేమ కోసం ఏ పని చేయడానికైనా,
ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగాఉండడం.
ఒక్క మాటలో చెప్పాలంటే...త్యాగం
ప్రేమించే వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అప్పుడే త్యాగం అనే పదానికి అర్థం తెలుస్తుంది. ప్రియురాలు దూరమౌతుంది అని తెలిసినప్పుడు తన పరిస్థితిని అర్థం చేసుకొని తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. తనను బలవంతంగా సాధించాలనుకోకూడదు.
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వేదించడంతో, ఏమి చేయలేని పరిస్థితిలో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్, రాయదుర్గం, గచ్చిబౌలి రాజీవ్ నగర్ కు చెందిన హేమలత, పోచయ్య ప్రేమించుకున్నారు. ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం హేమలత తన తల్లికి చెప్పింది. వీరి పెళ్ళికి అంగీకరించలేదు. హేమలతకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకుంటావని బెదిరించ సాగాడు. బెదిరింపులను భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
24, ఫిబ్రవరి 2014, సోమవారం
జంతువులు మనిషిలా చేస్తుంటే... మనిషి జంతువులా మారిపోతున్నారు.

అలాగే పెడుతుంటే అవి ఇంటి పరిసరాల్లోనే ఉండిపోతాయి.
వాటికి ఒక్క పూట అన్నం పెట్టినందుకే నమ్మకంగా ఉంటాయి.
మనకు అపాయం ఉందంటే ఎంతకైనా తెగించి కాపాడతాయి.
మాటలు రాని మూగజీవులు అంత విశ్వాసం చూపుతుంటే
మాటలు వచ్చి, తెలివి తేటలు ఉన్న మనిషి మాత్రం జంతువులా ప్రవర్తిస్తున్నాడు.
కర్ణాటక, మంగళూరు, అష్రఫ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. నగర సమీపంలోని చెంబుగుడ్డ ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారయత్నం చేశాడు. యువతి కేకలు వేయడంతో అష్రఫ్ పారిపోయాడు. పోలీసులు ఆ కామాందుడికోసం గాలిస్తున్నారు.
అమ్మాయిలు ఇలాంటి వారి ఉచ్చులలో పడకుండా, బతుకు బజారున పడకుండా జాగ్రత్త పడండి.
23, ఫిబ్రవరి 2014, ఆదివారం
మోసగాడికి గుణపాఠం చెప్పేదెవరు..?

జీవితాంతం నీతో నడవాలి అంటే అడుగేస్తారు...
నువ్వు లేకుండా బతకలేను అనగానే సర్వం అర్పించేస్తారు...
జీవితం నాశానమయ్యాక ప్రాణాలు తీసుకుంటారు.
అమ్మాయి జీవితంలో ఓడిపోతే ఇక బతకడమే వ్యర్థం అనుకుంటారు.
అలా పిరికివారిలా ఆలోచిస్తే నిన్ను నీవే బలైపోయావు.
మోసం చేసిన వ్యక్తికి శిక్ష పడేదెలా...?
అలాంటివారిని ఉరికే వదిలేస్తే రేపు ఇంకొకరి జీవితాన్ని
ఇలాగె నాశనం చేస్తారు.
ధైర్యం చేసి ముందడుగు వేసింటే అన్యాయాన్ని అరికట్టిన
ఆదర్శవంతురాలివి అయ్యెదానివి.
మోసపోకుండా ఆడపిల్లలకి గుణపాఠంగా నిలిచేదానివి.
ఖమ్మం జిల్లా, అశ్వాపురం మండలం, చింతిర్యాలగూడెం కు చెందిన రాధిక, అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా అడిగితే వెంకటనారాయణ నిరాకరించడంతో మనస్తాపం చెందిన రాధిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
అమ్మాయిలు నమ్మిన వారికి జీవితం అర్పిస్తారు..
నమ్మక ద్రోహం చేస్తే జీవితమే లేకుండా చేస్తారు..
అని నిరూపించే ఆత్మ ధైర్యంతో ముందుకు అడుగు వెయ్యండి.
22, ఫిబ్రవరి 2014, శనివారం
ప్రేమకు నిప్పంటించిన ప్రేమికుడు

ఎంత వికసించినా విరగకుండా చూస్తుందని.
పక్షికి రెక్కలపై నమ్మకం...
ఎంత ఎత్తుకు ఎగిరినా పడకుండా చూస్తాయని.
చెట్టుకు భూమిపై నమ్మకం...
ఎంత ఎదిగినా కూలిపోకుండా చూస్తుందని.
ప్రియురాలికి ప్రియుడిపై నమ్మకం...
తన జీవితాన్ని కాపాడతాడని.
తావి,భూమి,రెక్కలు వాటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయి.
ప్రియుడు మృగాడై నమ్మకంతో పాటు ప్రియురాలినీ చంపేస్తున్నాడు.
ప్రాణంగా ప్రేమించింది, సర్వస్వం అర్పించింది, జీవితాంతం కలసి బ్రతకాలనుకుంది, పెద్దలను ఒప్పించింది, మరో 5 రోజుల్లో పెళ్లి, ఎంత సంబరపడిందో... మంత్రాలయం మండలం చిలకలదోణ గ్రామానికి చెందిన మార్తమ్మ.
ప్రాణం తీసైనా వదిలించుకోవాలనుకున్నాడు. అలా బైటికి వెల్లోద్దామని పిలిచాడు, నమ్మకంగా ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు, చంపాడు. కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మార్తమ్మతోపాటు ఆమె ప్రేమను నామరూపాల్లేకుండా చేశాడు. అదే గ్రామానికి చెందిన యోహాన్.
ఫిబ్రవరి 26 న మార్తమ్మకు,యోహాన్ కు పెళ్లి అని ముద్రించిన పత్రిక కన్నీళ్లతో తడిసిపోయింది.
19, ఫిబ్రవరి 2014, బుధవారం
సమస్యకు పరిష్కారం ప్రాణం తీసుకోవడం కాదు

గుండెల్లో పెట్టుకొని ఆరాధించడం.
గుండెలు మండేలా బాద పెట్టడం కాదు.
ప్రేమిస్తుంటే..ప్రేమను పొందడం కోసం ఆరాట పడడం.
ప్రాణం పోయేలా వేధించడం కాదు.
సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి.. ప్రాణo పోతే తిరిగి రాదు.
ప్రేమిస్తున్నానంటూ అల్లరి చేస్తుoటే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి, పెద్దల సహకారంతో ఆకతాయిల ఆట కట్టిoచాలి, స్టేషన్లో కేస్ పెట్టాలి, అలాంటివారికి బుద్దివచ్చేలా చేయాలి. పిరికిదానిలా ప్రాణాలు తీసుకొని నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ధైర్యంగా క్షణమైన ఆలొచించలేకపోయావా...?
కృష్ణ జిల్లా , రాజీవ్ నగర్ కి చెందిన ఊర్మిళ అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన ప్రకాష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అతడి వేదింపులు బరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది, అయినా కూడా ప్రకాష్ ఆకతాయి వేదింపులను ఆపలేదు. మనస్తాపం చెందిన యువతి డిసెంబర్ 16 న ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఫిబ్రవరి 19 న మృతి చెందింది.
కూతురి ప్రేమ..తండ్రి ప్రాణాలు తీసింది

ఆకలేసినప్పుడు గోరుముద్దలు తినిపించావు,
చేయి పట్టుకొని నడకను నేర్పించావు,
బుజాలపైన ఎక్కించుకొని ఆడించావు,
గుండెలకు హత్తుకొని జోలపాడి నిద్రపుచ్చావు, అడిగినవన్నీ కాదనకుండా కొనిచ్చావు,
అమ్మలా ఆదరించావు, ప్రేమించావు...
మరెందుకు నాన్నా నా మనసును అర్థం చేసుకోలేకపోయవు..?
కూతురిని ప్రాణప్రదంగా పెంచుకున్న కన్నతండ్రి.. తన ఇష్టాన్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు.
గుంటూరు జిల్లా, యర్రగుంట్లపాడుకు చెందిన గౌతమి, రమేష్ 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని వారికి చెప్పకుండా ఫిరంగిపురంలోని విజయదుర్గాదేవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు.వీరి పెళ్లి విషయం తెలిసిన గౌతమి తండ్రి అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పద్మావతి గుండె పగిలిపోయింది.
తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాటిని కుప్ప కూల్చేసి వెళ్ళిపోతే వారి గుండెలు పగిలిపోవా..?
ఒక్కసారి మీ ఆలోచనలను వారి ముందు పెట్టి ఉంటే ఈ రోజు మీ తండ్రి ప్రాణాలతో ఉండేవాడు.
14, ఫిబ్రవరి 2014, శుక్రవారం
ప్రేమించి..ప్రేమను సాధించి...

ప్రేమికుల గుండెల్లో ప్రేమ చిగురించింది...
మొగ్గగా మారింది...
పుష్పించింది...
పరిమళాలు విరజల్లుతుంది.
తూర్పుగోదావరి జిల్లా, ఫణీంద్ర , విశ్వనాధం సరస్వతి గత 5 ఏళ్లుగా ప్రేమించుకున్నారు.
విషయం పెద్దలకు తెలిసింది, వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించారు. స్నేహితులు, బందువుల సహకారంతో 13.2.14 న మండపేటలోని
రధం గుడిలో పెళ్లి చేసుకొని వారి పెద్దల నుండి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమ కోసం పెద్దవాళ్ళను కాదని పెళ్లి చేసుకున్నారు, పెద్దలు మెచ్చుకునేల ప్రేమ పరిమళాలు విరజల్లుతూ, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రేమ..హృదయం కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
నేనంతా నువ్వే

త్యాగమంటే ఏమిటో నా కోసం నువ్వేసిన అడుగు చెప్పింది.
ప్రేమంటే ఏమిటో నువ్వు చూపే ఆత్మీయత చూపింది.
నాకు నేనే తెలియదు...నీకు తెలిసినంతగా...
నా గురించి నాకే అర్థం కాదు... నువ్వు అర్థమైనంతగా...
నేను నేను కాదు... నువ్వైనంతగా...
అందుకే....
నీ చూపుల్లో మార్గo వెదుక్కుంటాను.
నీ మాటల్లో నిర్దేశం చూస్తుంటాను.
నీ చేతల్లో నా శక్తిని పట్టుకుంటాను.
నీ ఆలోచనల్లో నా ఉనికి చాటుకుంటాను.
అమ్మ మమకారం... చెల్లి అనురాగం... అక్క అభిమానాన్ని...
స్నేహితురాలి తోడ్పాటుని... ప్రియురాలి మనసుని... కలిపి నిన్ను చేసి...
నా కోసం పంపిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.
ప్రేమతో....
నీ ప్రియుడు.
13, ఫిబ్రవరి 2014, గురువారం
11, ఫిబ్రవరి 2014, మంగళవారం
10, ఫిబ్రవరి 2014, సోమవారం
మృగాడి ప్రేమకు బలైన ప్రియురాలు

ఎందుకంటే అది విషపు జంతువు.
ఆవును పెంచుకుంటే పాలు ఇస్తుంది.
ఎందుకంటే అది సాదు జంతువు.
మనుషుల్లోని ప్రేమ కుడా అంతే..
కపట ప్రేమ విషంతో సమానo,
అది మనసును కాటేస్తుంది.
నిజాయితీ గల ప్రేమ పాల వలే స్వచ్చమైనది,
అది జీవితాన్ని నిలబెడుతుంది.
ప్రేమించాను అని చెప్పగానే నమ్మి లొంగిపోవడమేనా..?
అతడేoటో.. అతని వ్యక్తిత్వం ఏంటో.. అతను ఎలాంటి వాడో..?
తెలుసుకోకుండానే జీవితాన్ని అలా అర్పించడమేనా...?
ఆలోచన లేకుండా అడుగేసినందుకు నీ జీవితానికి ఒరిగిందేమిటి..
కన్నీళ్ళు.. అవమానాలు.
న్యూ డిల్లీ లో అనూజ్ దుబే అనే యువకుడు పంజాబ్ కి చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం పరిచయం పెంచుకున్నాడు, అది కాస్త ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువతిని శారీరకంగా దగ్గరకు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆమె అడిగితే అందుకు నిరాకరించాడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో అనూజ్ ను అరెస్ట్ చేశారు.
మనిషి అనుకొని మృగాన్ని ప్రేమించి మోసపోతున్న యువత తొందర పాటు తనంతో జీవితాన్ని అర్పించి మృగాలకు బలి కాకండి.
ప్రేమికుల మనసు దోచే దారి..

వాటిని ఎవరైనా ఉపయోగించవచ్చు అందులో ప్రత్యేకత ఉండదు.
ప్రేమికుల కోసం ప్రత్యేకమైన 8-బిట్ డైనమిక్ టీషర్టులు తాయారు చేయబడ్డాయి.
ఇందులో ప్రత్యేకత ఏంటో తెలుసా...?
ప్రేమికులు ఒకే ప్రాంతంలో తెలియకుండా వేరుగా ఉంటే మనసుకన్నా వేగంగా మీ జాడను పసిగడుతుంది.
ఎలాగంటారా...?

మీరు ప్రేమించే వారికి ఈ షర్ట్ బహుమతిగా ఇచ్చి ప్రేమికులరోజు న సర్ ప్రైస్ చేయండి. అంతే కాదండోయ్.. ప్రేమికులరోజున మీ ప్రేమ జంట అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలి.
9, ఫిబ్రవరి 2014, ఆదివారం
అనుమానం.. ప్రేమ మందిరాన్ని కూల్చేసింది.

పునాదిని మామూలు రాళ్ళతో కాక బలమైన రాళ్ళని ఎన్నుకొని నిర్మిస్తాం.
పునాది దృడంగా ఉంటేనే ఇల్లు ఎక్కువ కాలం నిలబడుతుంది.
అది సరిగా లేకపోతే కొంతకాలానికే కూలిపోతుంది.
ప్రేమ కూడా అంతే...
ప్రేమకు పునాది నమ్మకం.
అది లేకపోతే ప్రేమ ఎప్పటికి నిలబడదు.
నమ్మకమే మనసును, మనిషిని ముందుకు నడిపిస్తుంది.
అది లేకపోతే చిన్న చిన్న మనస్పర్తలకే ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న
ప్రేమ మందిరం కుప్పకూలి పోతుంది.
ప్రేయసి పైన నమ్మకం లేక అనుమానపు బాణాలు వేయడంతో అవి వారి గుండెల్లో దూసుకుపోయి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
డిల్లీ, బరేలికి చెందిన వివేక్ శంకర్, అమన్ దీప్ కౌర్ ప్రేమించుకున్నారు. అమన్ కొంత కాలంగా మన్ ప్రీత్ తో సన్నితంగా ఉండటంతో అనుమానించాడు దీనితో వీరి మద్య గొడవ జరిగింది. ఇద్దరు మనస్తాపం చెంది వేరు వేరు అపార్ట్ మెంట్స్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
గుండెలోని ప్రేమ తలగడగా మారి జోల పాడితే...

ప్రేమించే మనసుకు మాత్రమే తెలుస్తుంది ఆ తియ్యదనం ఏమిటో...
ఇష్టమైన వాళ్ళకోసం ఏదైనా చేయాలంటే మనసు ఉరకలు వేస్తుంది.
గుండెల నిండా నింపుకున్న ప్రేమను ఎలా చెప్పాలో తెలియక,
గుండెలోని ప్రేమను దాచలేక సతమతమౌతున్న ప్రేమికులకు ఓ చక్కటి అవకాశం దొరికింది.
ప్రేమను మాటలతోనా, బహుమతుల రూపంలోనా, క్రియలతోనా... ఎలా చెప్పాలా అని ఆందోళన పడకుండా ఓసారి ఈ ప్రత్యేకమైన ప్రేమ కానుకను చూడండి మీ ప్రియుల హృదయాలు దోచుకోవడానికి ఉపయోగపడుతుందేమో.
"డి లైట్ యువర్ హార్ట్" అనే కుషన్ ప్రేమికులకోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. కుషన్ పైభాగమంతా బట్టతో చేసిన గులాబీ పువ్వులుండి లోపల ఎల్ఈడి లైట్లు ఉంటాయి . కింది భాగంలో ఉండే బటన్ నొక్కగానే ఆ లైట్లు వెలిగి, రాత్రి పూట దిండు మెరిసిపోతున్న గులాబీ గుత్తిలా దర్శనమిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 4 గంటల పాటు చక్కగా వెలుగుతుంది ఈ హార్ట్ కుషన్.
8, ఫిబ్రవరి 2014, శనివారం
ప్రియుడి ఆవేశం ప్రేయసి ప్రాణం తీసింది

చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది, కాడకి ముల్లు ఉంటుంది.
రోజా నుండి ముల్లును వేరు చేసి రోజాను పూజకోసం ఉపయోగిస్తాo,
రోజా నుండి ముల్లును వేరు చేసి రోజాను పూజకోసం ఉపయోగిస్తాo,
అతివ కొప్పులో సింగారిస్తాo,
షోకేస్ లో అందం కోసం వాడుతాo. ముల్లులు ఉన్నాయని రోజాను కాలితో తోక్కేయం .
ప్రేమా అంతే కోప తాపాలు ఎన్ని ఉన్నా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి,
జీవితాన్ని ఆనందమయంగా మలచుకోవాలి.
ముల్లు ఉంది కదా అని... రోజాను కాలితో తొక్కేస్తే ...
అలా మృగంలా నడచుకున్నాడో ప్రేమికుడు
ముల్లు ఉంది కదా అని... రోజాను కాలితో తొక్కేస్తే ...
అలా మృగంలా నడచుకున్నాడో ప్రేమికుడు
అనాలోచితంగా ప్రవర్తించి ప్రియురాలి ప్రాణాలు తీశాడు.
న్యూ డిల్లి, కోట్లా ముబారక్ పూర్ లో ఉండే ఓ యువతి, విశాల్ ప్రేమించుకున్నారు. ఇద్దరు కలసి 5.2.14 న ట్రోనికా సిటీ లోని సెంట్రల్ పార్కుకు వెళ్లారు. మాటల్లో ఏదో విషయం గురించి గొడవ పడ్డారు. ఆవేశంలో విశాల్ కత్తితో ప్రియురాలిని తీవ్రంగా గాయపరచి పారిపోయాడు. స్థానికులు యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె 6.2.14 న మృతి చెందింది.
ప్రేమించే వ్యక్తికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడటమే ప్రేమకున్న గొప్పతనం. ప్రాణాలు తీయడం మృగాల లక్షణం.
ప్రేమ కావాలంట...పెళ్లి వద్దంటా.

పెళ్లి చేసుకుంటానంటే జీవితాన్ని అర్పించడానికి సిద్దపడింది.
ఏడడుగులు నడిచేరోజు దగ్గర పడుతుంటే సంబరపడిపోయింది.
బతికినంత వరకు అండగా ఉంటాడనుకుంది కాని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు.
కృష్ణ జిల్లా, సిద్ధార్థ నగర్ కు చెందిన బి.మురళి నాయక్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకున్నారు, పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి జనవరి 4 న పెళ్లి నిశ్చయించారు. జనవరి 3 న మురళి నాయక్ గ్రామం విడచి పరారయ్యాడు. యువతి మనస్తాపాo చెంది జనవరి 21 న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. ఫిబ్రవరి 7 న నూజివీడు పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు.
టైంపాస్ కోసం ప్రేమించి ప్రేమ ముసుగులో ప్రేమించిన వారిని మోసం చేయకండి.
7, ఫిబ్రవరి 2014, శుక్రవారం
చైనా, అమెరికా అమ్మాయిలు VS తెలుగు అబ్బాయిలు = ప్రేమ

కులాలు వేరు, మతాలు వేరు అయినా ప్రేమ కలిపింది ఇద్దరిని.
ఇరువురి సంప్రదాయాలు వేరు అయినా మనసు చేసింది ఒక్కటి.
మన దేశంలో ఉంటూ...
ఒకే ప్రాంతంలో నివసిస్తూ...
కులాలు వేరని, మతాలు వేరని ప్రేమికులను విడదీసి ప్రాణాలు పోయేలా చేస్తున్నారు.
వారి ప్రేమను అర్థం చేసుకోక వారి ఆశను, ఆనందాన్ని చంపేస్తున్నారు. పెద్దలు మీ పిల్లల మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితాంతం ఆనందంగా బతకడానికి తోడ్పడండి.
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడికి చేరి హిందూ సంప్రదాయాన్ని గౌరవించి వివాహం చేసుకొని ప్రేమకు అందరు ఒక్కటే అని నిరూపించారు ఈ ప్రేమ జంటలు.
చైనా కు చెందిన టెoగ్ మిన్, చెన్నై కి చెందిన శ్రీరామ్ మనియంలు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పుట్టపర్తిలోని దుర్గామాత ఆలయంలో ఫిబ్రవరి 6 న వివాహం చేసుకున్నారు.
అమెరికా కు చెందిన క్లారిస, పీలేరు కి చెందిన విష్ణు రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో తిరుమలలో ఫిబ్రవరి 6 న వివాహం చేసుకున్నారు.
వీరి ప్రేమమైక జీవితం ఆనందంగా, ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రేమ..హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
6, ఫిబ్రవరి 2014, గురువారం
ప్రేమకు ఆనకట్ట కట్టండి... అడ్డుకట్ట వేయద్దు
నదికి ఆనకట్ట కట్టవచ్చు... అడ్డుకట్ట వేయలేం.
అలా కాకుండా వారు ఎందుకు ప్రేమించారు? ఎవరిని ప్రేమించారు ? అని సావధానంగా తెలుసుకోవాలి. ఈ వయసులో ప్రేమిస్తే కలిగే నష్టాలేంటో వివరించాలి. జీవితంలో స్థిరపడ్డాక మీరు నిర్ణయం తీసుకుంటే వచ్చే ఫలితాలపై విశ్లేషించాలి. వారి ప్రేమకు ఆనకట్ట కట్టి వారిని సరైన మార్గంలో నడిపించాలి.
లేదంటే వెనుకకు తిరిగి తనను తానే ముంచుకుంటుంది... పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంది.
ఆనకట్ట కడితే... నది మన మాట వింటుంది. మనం ఎలా చెబితే అలా కదులుతుంది.
ప్రేమికులూ అంతే వారికి ఆనకట్ట కడితే... ఎన్నిటికో ఉపయోగ పడ తారు.
అడ్డుకట్ట వేస్తే... పెద్దలను ఎదిరిస్తారు. అదీ కాదంటే వారి ప్రాణాలే తీసుకుని ఏడిపిస్తారు.
పెద్దలు ఈ విషయం తెలియక వారికి అడ్డుకట్ట వేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను తమ చేతులారా చంపేసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడెం లో 9 వ తరగతి విద్యార్థిని, ఆరేమైసమ్మకు చెందిన సమీప బంధువు సురేష్ ను ప్రేమించింది. ఇంట్లో విషయం తెలిసి సురేష్ తల్లి విద్యార్థిని మందలించింది. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియలకువచ్చిన సురేష్ తట్టుకోలేక పోయాడు. తన ప్రియురాలు లేకుండా బతకలేను అనుకున్నాడు. 5. 2. 14న ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు.
ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం రేపల్లె కు చెందిన రాము, అదే గ్రామానికి చెందినా పుష్పలత మూడేళ్ళుగా ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి ప్రేమను కాదన్నారు. విడిపోయి బతకలేక చావే శరణ్యమనుకున్నారు. అడవిలోకి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
మన పిల్లలు ప్రేమించారని తెలియగానే... వారి మీద కేకలు వేసి వారి మనసు గాయపడేట్లు చేస్తున్నాం. వారు ఏదో భయంకర తప్పు చేసినట్లు భావించి నిందిస్తున్నాం. వారిని నేరస్తులుగా చేస్తున్నాం.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం
ప్రేమించడం తప్పా...? ఒప్పా...?

ప్రేమ అంటే తెలియని వయసు పిల్లలు కూడా ప్రేమ అనే పదం వింటున్నారు,
ప్రేమ పాటలు పాడుతున్నారు.
యువత మాత్రం ప్రేమపై మక్కువ పెంచుకున్నారు.
జీవితంలో ప్రేమించడం అనేది లేకపోతే అర్థం లేదంటున్నారు.
ప్రేమించడం మంచిదే కాని ఆ ప్రేమ స్వచ్చమైనదా లేదా అనే విషయాన్ని మరచిపోతున్నారు.
కొందరు టైంపాస్ కోసం ప్రేమించి బ్రేక్ అప్ పార్టీ ఇచ్చి
ఆనందంగా విడిపోతున్నారు.
కొందరు ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోతున్నారు.
కొందరు ప్రేమకోసం నేరాలు చేస్తున్నారు.
కొందరు ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తున్నారు.
కొందరు ప్రేమకోసం ప్రాణాలు కోల్పోతున్నారు.
వీటన్నిటిని గమనిస్తే ప్రేమ అనేది గొప్పది. ప్రేమంటే సరైన అవగాహన లేక తప్పుడు ఆలోచనలతో తప్పుడు మార్గాలను ఎన్నుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమలో పవిత్రత, నిజాయితి ఉంటే నేరాలు ఘోరాలు జరగవు. ఎందుకంటే ప్రేమ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది కనుక తొందర పాటుతో ఏ నిర్ణయం తీసుకోదు. ఆలోచనతో వేసే ప్రతి అడుగు అర్థవంతంగా ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల మండలం గాంధీ నగర్ కు చెందిన వనితసాగర్, అదే ప్రాంతానికి చెందిన సాయిశని రెండేళ్ళుగా ప్రేమించుకున్నారు, కలసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన రాగానే సాయిశని పరారయ్యాడు. వనిత ఆమె కుటుంబ సభ్యులు కలసి ప్రియుడి ఇంటివద్ద న్యాయం కోసం మౌన దీక్ష మొదలుపెట్టారు.
నల్గొండ జిల్లా, చండూరు మండల కేంద్రంలోని బేత వెంకన్నయాదవ్, పల్లెంల గ్రామానికి చెందిన బద్దుల మౌనిక ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాని పెద్దలు అంగీకరించలేదు. ఇరువురు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని గమనించిన స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం, మైసూర్, నగెనహళ్లి నివాసి స్వామి అనే వ్యక్తి ఓ విద్యార్థిని ప్రేమించమని వెంటపడ్డాడు. అమ్మాయి ప్రేమను అంగీకరించలేదని కొడవలితో దాడికి దిగి ఆమెను గాయపరిచాడు. గమనించిన స్థానికులు స్వామికి దేహశుద్ది చెశారు. ఇరువురిని ఆసుపత్రిలో చేర్పించారు.
వీరంతా ఆలోచించి ముందడుగు వేసి ఉంటె ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఆ సమస్యలకు పరిష్కారం దొరికి ఉండేది.
2, ఫిబ్రవరి 2014, ఆదివారం
ప్రేమను నట్టేట ముంచేశాడు

పెళ్లి చేసుకుంటానంటే తనువు అర్పించింది.
బతికినంతవరకు తోడుంటానంటే జీవితం అర్పించిది.
సర్వస్వం నువ్వే అనుకోని నీతో ఏడడుగులు నడిస్తే...
ఏడేడు జన్మలు తన చేయి పట్టుకొని నడవాల్సింది పోయి
నట్టేట వదిలి వెళ్ళిపోయావా..?
పెళ్లి చేసుకొని మోసగించడానికి ప్రేమను పావుగా వాడుకున్నవా..?
ప్రేమ అనే పదం ఉపయోగించి ప్రేమను నిలువునా మోసం చేసావు.
తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామానికి చెందిన చప్పిడి మల్లిక అనే అమ్మాయిని.. కరీంనగర్ జిల్లా కు చెందిన కరణం పురుషోత్తమ వెంకట సత్యనారాయణ అనే ఇంజనీర్ మల్లికని ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి నమ్మించి 2012 లో పెళ్ళిచేసుకున్నాడు. కొన్నాళ్ళు కలిసిమెలసి ఉన్నాడు. ఇప్పుడు మల్లికను పట్టించుకోకుండా వదిలేసి వెల్లిపోయాడు. మల్లిక ఆత్రేయపురo పోలీసులను ఆశ్రయించింది.
అబ్బాయిలు ఇలా ఎంత కాలం అమ్మాయిలను మోసం చేస్తారు..?
అమ్మాయిలు ఎంతకాలం అబ్బాయిల మాయ మాటలు నమ్ముతారు..?
ప్రేమను యాసిడ్ లో కాలుస్తా..

ఎందుకంటే వాళ్ళు కష్టపడితే మనసు తట్టుకోలేదు.
విశాఖపట్నo జిల్లా, పెదవాల్తేరు, కొత్తరేసపువానిపాలెం ప్రాంతంలో ఉంటున్న వి.సతీశ్.. వారి ఇంట్లో అద్దెకుంటున్న
బీటెక్ విద్యార్థినితో సన్నితంగా ఇంటూ.. తనని షాపింగ్ మాల్స్ కు తీసుకెళ్తూ సరదాగా అన్నిచోట్ల తిప్పాడు. 3 నెలలుగా తనను బ్లాక్ మేల్ చేస్తున్నాడు. అన్ని షాపింగ్ మాల్స్ లోని సీసీ కెమెరాల్లో ఉంటాము కాబట్టి నన్ను ప్రేమించూ అంటూ వేదించడం మొదలు పెట్టాడు. అమ్మాయి కాదనడoతో ప్రేమించకపోతే మొఖం పైన యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది.
1, ఫిబ్రవరి 2014, శనివారం
ప్రేమకున్న నమ్మకాన్నే చంపేశాడు.

ప్రియుడు ఊపిరనుకుంది.
నీటి మీద నమ్మకం ... తాగితే దాహం తీరుస్తుందని.
ప్రియుడు నీరనుకుంది.
గుండెమీద నమ్మకం... ఎన్ని కస్టాలోచ్చినా బతుకుతానని.
మనసైనవాడు తన హృదయం అనుకుంది.
గాలి సుడిగాలై నమ్మకాన్ని చుట్టుముట్టింది..
నీరు మనసును ముంచింది..
గుండె క్రూరంగా మారి ప్రేమను చంపేసింది.
సహనాన్ని లోకువ చేసుకున్నావు, నిన్ను ప్రేమిస్తున్నానంటే ఇంట్లో వాళ్ళు కొట్టారు... భరించింది.
నీతో కలసి బతకాలనుకుoటున్న్నానంటే ఉద్యోగం మాన్పించారు... సహించింది.
నువ్వు రమ్మంటే.. నీ మీద నమ్మకంతో పెద్దలకు అపద్దం చెప్పి అడుగు బైటపెట్టింది హిమబిందు.
నమ్మకాన్ని కాలరాశావు,
ఆమె ధైర్యాన్ని.. ఆమెను.. నీ చేతులతో చంపేశావు.. నీకు ఇది న్యాయమా...?
కర్నూలు నగరానికి చెందిన హిమబిందు, బలరాం రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దలకు విషయం తెలిసి ప్రేమను కాదన్నారు. హిమబిందు ఉద్యోగం మాన్పించి ఇంట్లో ఉంచారు. డిసెంబర్ 24 న బర్త్ డే పార్టీ ఉందని చెప్పి బైటికోచ్చింది. నేలరోజులతర్వాత ప్రాణాలు కోల్పోయిందని తేలింది. ప్రియుడు బలరాం రెడ్డి శిరువెల్ల పరిదిలోని నల్లమల ప్రాంతానికి తీసుకెళ్ళి అనుమానించి మాట్లాడడంతో ఇరువురిమద్య వాగ్వాదం జరిగింది. ఆవేశంతో హిమబిందు ను కాల్వలో ముంచి చంపేశాడు.
కారణమేదైనా.. ప్రేమికుల నమ్మకాన్ని నిలువునా పాతిపెట్టాడు బలరాం రెడ్డి.
31, జనవరి 2014, శుక్రవారం
పిరికితనం ప్రాణం తీసింది

ధైర్యంగా వెళ్లి పోలీసు స్టేషన్లో
ఫిర్యాదు చేయడమో,
ఇంట్లో వాళ్ళకు చెప్పడమో, లేక
ఫ్రెండ్స్ సహాయం తీసుకొని
అతనికి బుద్ది వచ్చేలా చేయకుండా పిరికి దానిలా ప్రాణాలు తీసుకుంటే ఎలా..?
అలాంటి వారికి శిక్ష పడేలా చేసింటే ఇలాంటి సమస్యలు ఎదురుకునే యువతకు ఆదర్శప్రాయంగా నిలిచెదానివి. ఒక్క క్షణం ధైర్యంగా ఆలోచించలేక పోయావా..?
నిజమైన ప్రేమ ఏంటో తెలియక మూర్ఖంగా ప్రవర్తించి ఓ ఆమ్మాయి ప్రాణాలు కోల్పోయేoదుకు కారకుడయ్యాడు రవి.
అనంతపురం జిల్లా, తాడిమర్రి (బత్తలిపల్లి) మండల కేంద్రానికి చెందిన ప్రియదర్శిని అనే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన రవి తనని ప్రేమించాలంటూ వేదించడమే కాక ఇంకెవరినైనా ప్రేమిస్తే ప్రియదర్శినిని తన తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించడంతో భయపడ్డ ప్రియదర్శిని జనవరి 30 న విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది.
అమ్మాయిలు ఇలాంటి సంగటనలు చూసిన కళ్ళు తెరువండి. భయపడుతుంటే జీవితమంతా భయంతోనే బతకాలి. సమస్యలు వస్తే ఎదురుకోవడానికి ప్రయత్నించండి. పెద్దల సహాయం, పోలిసుల సహాయం తీసుకోండి. పిరికితనాన్ని వీడి ధైర్యంగా అడుగులు వేయండి.
29, జనవరి 2014, బుధవారం
ప్రేమ..నీ అడుగులు ఎటువైపు...?

ఒకరికి ఒకరు తోడుండడం,
ఒకరిని ఒకరు ధైర్యపరచడం,
ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడం,
ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడం,
ఇద్దరు ఒక్కటై ఆనంద జీవితాన్ని మలుచుకోవడం.
ప్రేమ పేరుతో ఒకరిని ఒకరు అనుభవించడం కాదు.
ప్రేమ మనసును త్రుప్తి పరచడానికి ప్రయత్నిస్తుంది కాని శరీరాన్ని కాదు.
ప్రేమ జీవితాంతం తోడుంటుంది కాని మద్యలో ఒంటరిని చేసి వెళ్ళిపోదు.
ప్రేమకు సరైన అర్థం తెలియక ఆకర్షణనే ప్రేమ అనుకొని యువత మోసపోతున్నారు. ఆ మోసపు వలలో పడిoది ఓ యువతి. తన జీవితం అన్యాయం కాకూడదని న్యాయం కోసం పోరాడుతుంది.
ఖమ్మం జిల్లా, ముదిగొండ గ్రామానికి చెందిన సతీష్ అదే గ్రామానికి చెందిన కట్టకూరి నాగమ్మ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నాగమ్మను లొంగదీసుకున్నాడు. పెళ్లి ప్రస్తావన రాగానే మొఖం చాటేస్తున్నాడు. సతీష్ తో పెళ్లి జరిపించి తనకు న్యాయం చేయాలంటూ నాగమ్మ కుటుంబ సభ్యులు, బందువులు జనవరి 29 న తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష మొదలు పెట్టారు.
ప్రేమించే ముందు ఆలోచించండి, ప్రేమించాక ప్రతీ అడుగు ఆలోచించి వెయ్యండి, వేసే ప్రతీ అడుగు మంచి మార్గంలో వేయండి లేకపోతే జీవితమే దారితప్పిపోతుంది.
ప్రేమికుడి ప్రాణాలు బలికొన్న కర్షకులు

ఏదైనా జంతువు కళ్ళముందు ప్రాణాపాయ స్థితిలో ఉంటె తట్టుకోలేము,
అవి ఆకలితో అలమటిస్తూ కనిపిస్తే వాటి ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తాం.
ఏ సంబందము లేని ఆ మూగ జీవులపైన ఉన్న జాలి, కనికరం మనుషులపైన ఎందుకు ఉండదు...?
ప్రేమించడం.. పాపం కాదు కదా..?
ప్రేమించడం.. హత్య కాదు కదా..?
ప్రేమించడం.. అన్యాయం కాదు కదా..?
ప్రేమించడం.. దౌర్జన్యం కాదు కదా..?
ప్రేమించడం .. వ్యభిచారం కాదు కదా..?
మరి ఎందుకు ప్రేమిస్తే ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణం పోయేలా చేస్తున్నారు...?
ప్రేమించడం పెద్ద నేరంలా భావించి వంశీ నిండు ప్రాణాలు బలితీసుకున్నారు ఓ కర్షక కుటుంబం..
గోదావరిఖని, సీతానగర్ కు చెoదిన వంశీ కృష్ణ , అదే ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇరువురిని దూరంగా ఉంచారు. 3 నెలల క్రితం అమ్మాయి తరపు వారు స్వయంగా కేసు ఉపసంహరించుకున్నారు. తరువాత అమ్మాయి వంశీ కి ఫోన్ చేయడంతో వంశీ తండ్రి జనవరి 26 న పెద్దలను పిలచి పంచాయితి పెట్టాలనుకున్నాడు. అదే రోజు ఉదయం బైటికి వెళ్ళిన వంశీ ఇంటికి తిరిగి రాలేదు. మరుసటిరోజు ఉదయం మహారాష్ట్ర లోని బల్లార్శ రైలు పట్టాలపైన శవమై కనిపించాడు. ప్రేమించినందుకే అమ్మాయి తరపువారు చంపేశారని శవాన్ని యువతి ఇంటిముందు బైఠాయించారు.
28, జనవరి 2014, మంగళవారం
ప్రేమ కోసం ఉన్న ఆరాటం పెళ్ళికి ఎందుకు చూపరు..?

ప్రేమించకముందు ఆ అమ్మాయే కావాలనిపిస్తుంది,
ప్రేమను ఒప్పుకునే వరకు వెంటపడతారు,
ప్రేమను అంగీకరిస్తే సంబరపడిపోతారు,
ప్రేమించాక... సమస్యలు వస్తే సంబంధం లేనట్లు ఉండిపోతారు.
ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెంటపడి ఓ యువతీ ప్రేమను పొందాడు ఓ యువకుడు. పెళ్లి దాక వచ్చేసరికి మౌనం వహించాడు. తననే నమ్ముకున్న యువతి తను లేకపోతే బతకలేననుకుంది, ప్రాణాలు వదులుకోవడానికి సిద్దపడింది.
కృష్ణ జిల్లా, సిద్దార్థ నగర్ కు చెందిన భూక్యా మురళి నాయక్ ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్ళిచేసుకుంటానని నచ్చజెప్పాడు. ఆ యువతీ అందుకు ఒప్పుకుంది. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో పెద్దలందరూ కలిసి పంచాయితీ జరిపారు, మురళి కుటుంబీకులు పెళ్ళికి అంగీకరించలేదు. అందుకు మనస్తాపానికి చెందిన ఆ యువతీ వారి తల్లిదండ్రులను క్షమాపణ కోరుతూ ఓ లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతిని నూజివీడు ఆసుపత్రిలలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
ప్రేమ కోసం ఉన్న ఆరాటం పెళ్ళికి ఎందుకు చూపరు..? ప్రేమ పేరుతో మోసం చేయడం న్యాయమా..?
ప్రేమించిన వ్యక్తిని పొందే ధైర్యం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు..?
ప్రేమలో గుణగణాలు, మంచిచెడుల ఎంపిక అవసరమే....
ఒక డ్రెస్ కొనాలంటే ఆ డ్రెస్ రంగు, నాణ్యత, మన్నిక చూసి
జాగ్రత్తగా కొంటాము.
ఒక వస్తువు కొనాలన్నా అది ఎంత కాలం ఉపయోగపడుతుంది,
క్వాలిటీని చూసి కొంటాము.
కాలుకు వేసుకునే చెప్పులు కొనాలన్నా దాని గురించి తెలుసుకొని
మంచివి కొంటాము.
చిన్న చిన్న వస్తువులనే అలోచించి ఎన్నుకుంటున్నప్పుడు మన జీవిత భాగస్వామి కావాలి అనే వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించరు...?
ప్రేమిస్తున్నా అని చెప్పగానే నమ్మి జీవితాన్ని ఎలా అర్పిస్తారు...?
జీవితాన్ని పంచుకునే వ్యక్తిలోని గుణగణాలు,మంచిచెడులు తెలుసుకోరా...?
తన జీవితం గురించి సరైన వ్యక్తిని ఎంచుకునే విషయంలో విఫలమై,
ప్రేమలో మోసపోయిన ఓ ప్రేమికురాలి ఆవేదన...
ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం లోని సూర్యతండాకు చెందిన బానోతు రజని, అదే గ్రామానికి చెందిన చాందవత్ చందూలాల్ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రజని పెళ్లి చేసుకోవాలని అడిగితే అందుకు నిరాకరించాడు. మరో అమ్మాయిని బద్రాచలం తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన రజని జనవరి 18 తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు వార్గాలవారితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పది రోజులు అవుతున్నా పోలీసులు స్పందించక పోవడంతో ప్రియుడి సోదరుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది.
ప్రేమిచడం తప్పుకాదు, ప్రేమించే వ్యక్తి ఎలాంటివారో తెలుసుకొని ముందడుగు వేయండి లేకపోతే జీవితాంతం బాదలు, అవమానాలు మోస్తూ బతకాలి.
జాగ్రత్తగా కొంటాము.
ఒక వస్తువు కొనాలన్నా అది ఎంత కాలం ఉపయోగపడుతుంది,
క్వాలిటీని చూసి కొంటాము.
కాలుకు వేసుకునే చెప్పులు కొనాలన్నా దాని గురించి తెలుసుకొని
మంచివి కొంటాము.
చిన్న చిన్న వస్తువులనే అలోచించి ఎన్నుకుంటున్నప్పుడు మన జీవిత భాగస్వామి కావాలి అనే వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించరు...?
ప్రేమిస్తున్నా అని చెప్పగానే నమ్మి జీవితాన్ని ఎలా అర్పిస్తారు...?
జీవితాన్ని పంచుకునే వ్యక్తిలోని గుణగణాలు,మంచిచెడులు తెలుసుకోరా...?
తన జీవితం గురించి సరైన వ్యక్తిని ఎంచుకునే విషయంలో విఫలమై,
ప్రేమలో మోసపోయిన ఓ ప్రేమికురాలి ఆవేదన...
ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం లోని సూర్యతండాకు చెందిన బానోతు రజని, అదే గ్రామానికి చెందిన చాందవత్ చందూలాల్ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రజని పెళ్లి చేసుకోవాలని అడిగితే అందుకు నిరాకరించాడు. మరో అమ్మాయిని బద్రాచలం తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన రజని జనవరి 18 తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు వార్గాలవారితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పది రోజులు అవుతున్నా పోలీసులు స్పందించక పోవడంతో ప్రియుడి సోదరుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది.
ప్రేమిచడం తప్పుకాదు, ప్రేమించే వ్యక్తి ఎలాంటివారో తెలుసుకొని ముందడుగు వేయండి లేకపోతే జీవితాంతం బాదలు, అవమానాలు మోస్తూ బతకాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)