
పెళ్లి చేసుకుంటానంటే
కలిసి నడిచింది.
సంసార సాగరంలో ఒక బిడ్డకు తల్లైంది.
వ్యాపారం చేస్తానంటే మేడలో బంగారు అమ్మి డబ్బులిచ్చింది.
పుట్టింటికి వెళ్లి రమ్మంటే పోయింది.
ఇంకా భర్త వస్తాడని ఎదురుచూసింది...
ఎంతకి రాకపోయేసరికి ... అతని ఇంటికి వెళ్ళింది.
అతను తనను కాదని వేరే అమ్మాయితో వివాహానికి సిద్దపడుతున్నాడని
తెలుసుకుని బాధ పడింది. నిలదీసింది.
రూ. 5 లక్షలు తీసుకొస్తే నీతో ఉంటా లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని
అతను తెగేసి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించింది.
కడప జిల్లా సంబెపల్లికి చెందిన మంజూరువలీ చేసిన ప్రేమ ద్రోహం ఇది. ఇతని మోసానికి బలైంది గుత్తికి చెందిన రమీజ. తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లిని చేసి ఎప్పుడు కాదు పొమ్మంటున్నాడని రమీజ సంబెపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి మగాళ్ళతో జాగ్రత్త ... యువతుల్లారా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి